సంఖ్యాకాండం Chapter 26 TELIRV Bible Verse Images

సంఖ్యాకాండం 26 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share సంఖ్యాకాండం 26 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


సంఖ్యాకాండం 26:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ తెగులు పోయిన తరువాత యెహోవా మోషేతో, యాజకుడైన అహరోను కొడుకు ఎలియాజరుతో మాట్లాడుతూ,

సంఖ్యాకాండం 26:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“మీరు ఇశ్రాయేలీయుల సమాజమంతట్లో 20 సంవత్సరాలు మొదలుకుని ఆ పై వయస్సు ఉన్న ఇశ్రాయేలీయుల్లో యుద్ధం చెయ్యగల సామర్థ్యం ఉన్న వారిని, తమ పితరుల కుటుంబాల ప్రకారం లెక్కపెట్టండి” అన్నాడు.

సంఖ్యాకాండం 26:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి మోషే, యాజకుడైన ఎలియాజరు యెరికో దగ్గర యోర్దాను తీరంలో మోయాబు మైదానాల్లో సమాజమంతటితో మాట్లాడుతూ,

సంఖ్యాకాండం 26:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“20 సంవత్సరాలు, ఆ పై వయస్సు కలిగి, ఐగుప్తులోనుంచి బయటకు వచ్చిన వారిని లెక్కపెట్టమని యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు” అన్నారు.

సంఖ్యాకాండం 26:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలు పెద్దకొడుకు రూబేను. రూబేను కొడుకు హనోకు నుంచి హనోకీయులు హనోకు వంశస్థులు,

సంఖ్యాకాండం 26:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పల్లువీయులు పల్లు వంశస్థులు. హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు, కర్మీయులు కర్మీ వంశస్థులు.

సంఖ్యాకాండం 26:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వీరు రూబేనీయుల వంశస్థులు. వారిల్లో లెక్కకు వచ్చినవారు 43, 730 మంది పురుషులు.

సంఖ్యాకాండం 26:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పల్లు కొడుకు ఏలీయాబు. ఏలీయాబు కొడుకులు నెమూయేలు, దాతాను, అబీరాము.

సంఖ్యాకాండం 26:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కోరహు, అతని సమాజం యెహోవాకు విరోధంగా వాదించినప్పుడు సమాజంలో మోషే అహరోనులకు విరోధంగా వాదించిన దాతాను అబీరాములు వీరే.

సంఖ్యాకాండం 26:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ సమాజం వారు చనిపోయినప్పుడు అగ్ని 250 మందిని కాల్చేసినందువల్ల, భూమి తన నోరు తెరచి వారిని, కోరహును మింగేసినందువల్ల, వారు ఒక హెచ్చరికగా అయ్యారు.

సంఖ్యాకాండం 26:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే కోరహు కొడుకులు చనిపోలేదు.

సంఖ్యాకాండం 26:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షిమ్యోను కొడుకుల వంశంలో నెమూయేలీయులు నెమూయేలు వంశస్థులు, యామీనీయులు యామీను వంశస్థులు, యాకీనీయులు యాకీను వంశస్థులు,

సంఖ్యాకాండం 26:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జెరహీయులు జెరహు వంశస్థులు, షావూలీయులు షావూలు వంశస్థులు.

సంఖ్యాకాండం 26:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇవి షిమ్యోనీయుల వంశాలు. వారు 22, 200 మంది పురుషులు.

సంఖ్యాకాండం 26:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గాదు కొడుకుల వంశాల్లో సెపోనీయులు సెపోను వంశస్థులు, హగ్గీయులు హగ్గీ వంశస్థులు, షూనీయులు షూనీ వంశస్థులు,

సంఖ్యాకాండం 26:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఓజనీయులు ఓజని వంశస్థులు, ఏరీయులు ఏరీ వంశస్థులు,

సంఖ్యాకాండం 26:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆరోదీయులు ఆరోదు వంశస్థులు, అరేలీయులు అరేలీ వంశస్థులు.

సంఖ్యాకాండం 26:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వీరు గాదీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 40, 500 మంది పురుషులు.

సంఖ్యాకాండం 26:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదా కొడుకులు ఏరు, ఓనాను. ఏరు, ఓనాను, కనాను ప్రదేశంలో చనిపోయారు.

సంఖ్యాకాండం 26:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదావారి వంశాల్లో షేలాహీయులు షేలా వంశస్థులు, పెరెసీయులు పెరెసు వంశస్థులు, జెరహీయులు జెరహు వంశస్థులు,

సంఖ్యాకాండం 26:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పెరెసీయుల్లో హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు, హామూలీయులు హామూలు వంశస్థులు.

సంఖ్యాకాండం 26:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వీరు యూదా వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 76, 500 మంది పురుషులు.

సంఖ్యాకాండం 26:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్శాఖారు కొడుకుల వంశస్థుల్లో తోలాహీయులు తోలా వంశస్థులు, పువ్వీయులు పువ్వా వంశస్థులు, యాషూబీయులు యాషూబు వంశస్థులు, షిమ్రోనీయులు షిమ్రోను వంశస్థులు. వీరు ఇశ్శాఖారీయుల వంశస్థులు.

సంఖ్యాకాండం 26:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రాసిన వారి లెక్క ప్రకారం వీరు 64, 300 మంది పురుషులు.

సంఖ్యాకాండం 26:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జెబూలూను కొడుకుల వంశస్థుల్లో సెరెదీయులు సెరెదు వంశస్థులు,

సంఖ్యాకాండం 26:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏలోనీయులు ఏలోను వంశస్థులు, యహలేలీయులు యహలేలు వంశస్థులు.

సంఖ్యాకాండం 26:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రాసిన వారి లెక్క ప్రకారం వీరు 60, 500 మంది పురుషులు.

సంఖ్యాకాండం 26:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోసేపు వంశస్థులు అతని కొడుకులు మనష్షే, ఎఫ్రాయిము.

సంఖ్యాకాండం 26:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనష్షే కొడుకుల్లో మాకీరీయులు మాకీరు వంశస్థులు. మాకీరు గిలాదుకు తండ్రి. గిలాదీయులు గిలాదు వంశస్థులు. వీరు గిలాదు కొడుకులు.

సంఖ్యాకాండం 26:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈజరీయులు ఈజరు వంశస్థులు, హెలకీయులు హెలకు వంశస్థులు,

సంఖ్యాకాండం 26:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అశ్రీయేలీయులు అశ్రీయేలు వంశస్థులు, షెకెమీయులు షెకెము వంశస్థులు,

సంఖ్యాకాండం 26:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షెమీదాయీయులు షెమీదా వంశస్థులు, హెపెరీయులు హెపెరు వంశస్థులు.

సంఖ్యాకాండం 26:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హెపెరు కొడుకు సెలోపెహాదుకు కూతుళ్ళేగాని కొడుకులు పుట్టలేదు. సెలోపెహాదు కూతుళ్ళ పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా.

సంఖ్యాకాండం 26:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వీరు మనష్షీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 52, 700 మంది పురుషులు.

సంఖ్యాకాండం 26:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇవి ఎఫ్రాయిము కొడుకుల వంశాలు-షూతలహీయులు షూతలహు వంశస్థులు, బేకరీయులు బేకరు వంశస్థులు, తహనీయులు తహను వంశస్థులు.

సంఖ్యాకాండం 26:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షూతలహు వంశస్థుడు ఏరాను. అతని వంశం ఏరాను వంశం.

సంఖ్యాకాండం 26:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వీరు ఎఫ్రాయిమీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 32, 500 మంది పురుషులు. వీరు యోసేపు కొడుకుల వంశస్థులు.

సంఖ్యాకాండం 26:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బెన్యామీను కొడుకుల వంశాల్లో బెలీయులు బెల వంశస్థులు, అష్బేలీయులు అష్బేల వంశస్థులు,

సంఖ్యాకాండం 26:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అహీరామీయులు అహీరాము వంశస్థులు,

సంఖ్యాకాండం 26:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షూఫామీయులు షూపఫాము వంశస్థులు. బెల కొడుకులు ఆర్దు, నయమాను. ఆర్దీయులు ఆర్దు వంశస్థులు, నయమానీయులు నయమాను వంశస్థులు.

సంఖ్యాకాండం 26:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వీరు బెన్యామీనీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 45, 600 మంది పురుషులు.

సంఖ్యాకాండం 26:42 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దాను కొడుకుల వంశాల్లో షూహామీయులు షూహాము వంశస్థులు.

సంఖ్యాకాండం 26:43 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రాసిన వారి లెక్క ప్రకారం వీరు 64, 400 మంది పురుషులు.

సంఖ్యాకాండం 26:44 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆషేరు కొడుకుల వంశాల్లో యిమ్నీయులు యిమ్నా వంశస్థులు, ఇష్వీయులు ఇష్వీ వంశస్థులు, బెరీయులు బెరీయా వంశస్థులు.

సంఖ్యాకాండం 26:45 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బెరీయానీయుల్లో హెబెరీయులు హెబెరు వంశస్థులు, మల్కీయేలీయులు మల్కీయేలు వంశస్థులు.

సంఖ్యాకాండం 26:46 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆషేరు కూతురు పేరు శెరహు.

సంఖ్యాకాండం 26:47 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రాసిన వారి లెక్క ప్రకారం వీరు 53, 400 మంది పురుషులు.

సంఖ్యాకాండం 26:48 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నఫ్తాలీ కొడుకుల వంశాల్లో యహసయేలీయులు యహసయేలు వంశస్థులు, గూనీయులు గూనీ వంశస్థులు,

సంఖ్యాకాండం 26:49 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యేసెరీయులు యేసెరు వంశస్థులు, షిల్లేమీయులు షిల్లేము వంశస్థులు.

సంఖ్యాకాండం 26:50 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వీరు నఫ్తాలీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 45, 400 మంది పురుషులు.

సంఖ్యాకాండం 26:51 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలీయుల్లో లెక్కకు వచ్చినవారు 6,01,730 మంది పురుషులు.

సంఖ్యాకాండం 26:52 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మోషేతో “వీళ్ళ పేర్ల లెక్క ప్రకారం ఆ దేశాన్ని వీళ్ళకు స్వాస్థ్యంగా పంచిపెట్టాలి.

సంఖ్యాకాండం 26:53 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తమ తమ లెక్క ప్రకారం ఆ స్వాస్థ్యం వాళ్లకు ఇవ్వాలి.

సంఖ్యాకాండం 26:54 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎక్కువమంది ఉన్న వంశాలకు ఎక్కువ స్వాస్థ్యం, తక్కువమంది ఉన్నవారికి తక్కువ స్వాస్థ్యం ఇవ్వాలి. తమ తమ లెక్కను బట్టి వివిధ గోత్రాలకు స్వాస్థ్యం ఇవ్వాలి.

సంఖ్యాకాండం 26:55 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చీటీలు వేసి ఆ భూమిని పంచిపెట్టాలి. వారు తమ తమ పితరుల గోత్రాల జనాభా లెక్క ప్రకారం స్వాస్థ్యం పొందాలి.

సంఖ్యాకాండం 26:56 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎక్కువ మందికైనా తక్కువ మందికైనా చీటీలు వేసి, ఎవరి స్వాస్థ్యం వారికి పంచిపెట్టాలి.”

సంఖ్యాకాండం 26:57 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వీరు తమ తమ వంశాల్లో లెక్కకు వచ్చిన లేవీయులు. గెర్షోనీయులు గెర్షోను వంశస్థులు, కహాతీయులు కహాతు వంశస్థులు, మెరారీయులు మెరారి వంశస్థులు.

సంఖ్యాకాండం 26:58 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
లేవీయుల వంశాలు ఏవంటే, లిబ్నీయుల వంశం, హెబ్రోనీయుల వంశం, మహలీయుల వంశం, మూషీయుల వంశం, కోరహీయుల వంశం.

సంఖ్యాకాండం 26:59 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కహాతు అమ్రాము తండ్రి. అమ్రాము భార్య పేరు యోకెబెదు. ఆమె లేవీ కూతురు. ఆమె ఐగుప్తులో లేవీకి పుట్టింది. ఆమె అమ్రామువల్ల అహరోను, మోషే, వీళ్ళ సహోదరి మిర్యాములను కన్నది.

సంఖ్యాకాండం 26:60 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అహరోనుకు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు పుట్టారు.

సంఖ్యాకాండం 26:61 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నాదాబు అబీహులు యెహోవా సన్నిధిలో అంగీకారం కాని అగ్ని అర్పణ చేసినప్పుడు చనిపోయారు.

సంఖ్యాకాండం 26:62 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారిల్లో నెల మొదలుకొని పై వయస్సు కలిగి లెక్కకు వచ్చిన వాళ్లందరూ 23,000 మంది పురుషులు. వారు ఇశ్రాయేలీయుల్లో లెక్కకు రాని వారు గనక ఇశ్రాయేలీయుల్లో వాళ్లకు స్వాస్థ్యం దక్కలేదు.

సంఖ్యాకాండం 26:63 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెరికో ప్రాంతాల్లో యొర్దాను దగ్గరున్న మోయాబు మైదానాల్లో మోషే, యాజకుడైన ఎలియాజరు, ఇశ్రాయేలీయుల జనాభా లెక్కపెట్టినప్పుడు లెక్కకు వచ్చిన వారు వీరు.

సంఖ్యాకాండం 26:64 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే అహరోనులు సీనాయి ఎడారిలో ఇశ్రాయేలీయుల జనాభా లెక్కపెట్టినప్పుడు లెక్కకు వచ్చిన వారిలో ఒక్కడైనా వీళ్ళల్లో లేడు.

సంఖ్యాకాండం 26:65 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే వారు కచ్చితంగా ఎడారిలో చనిపోతారని యెహోవా వారి గురించి చెప్పాడు. యెపున్నె కొడుకు కాలేబు, నూను కొడుకు యెహోషువ తప్ప వారిల్లో ఒక్కడైనా మిగల్లేదు.

Available Bible Translations

American Standard Version
Numbers 26 (ASV) »
King James Version
Numbers 26 (KJV) »
GOD’S WORD® (GW)
Numbers 26 (GW) »
World English Bible
Numbers 26 (WEB) »
Louis Segond 1910
Nombres 26 (LSG) »
Luther Bibel 1912
Numeri 26 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
गिनती 26 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਗਿਣਤੀ 26 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
গননা 26 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எண்ணாகமம் 26 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
गणना 26 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ગણના 26 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಅರಣ್ಯಕಾಂಡ 26 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْعَدَد 26 (AVD) »
תנ ך עברי מודרני
במדבר 26 (HEB) »
Bíblia Sagrada Português
Números 26 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Dân Số 26 (VIE) »
Reina Valera Antigua
Números 26 (RVA) »
La Sacra Bibbia
Numeri 26 (RIV) »
圣 经 简体中文和合本
民 数 记 26 (CUVS) »
聖 經 繁體中文和合本
民 數 記 26 (CUVT) »
Bibla e Shenjtë
Numrat 26 (ALB) »
Svenska Bibeln 1917
4 Mosebok 26 (SV1917) »
Библия на русском
Числа 26 (RUSV) »
Українська Біблія
Числа 26 (UKR) »
Szent Biblia - Magyar
4 Mózes 26 (KAR) »
Българска Библия
Числа 26 (BULG) »
聖書 日本語
民数記 26 (JPN) »
Biblia Takatifu
Hesabu 26 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Tirintii 26 (SOM) »
De Heilige Schrift
Numberi 26 (NLD) »

సంఖ్యాకాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List