1 తిమోతి పత్రిక Chapter 1 TELIRV Bible Verse Images

1 తిమోతి పత్రిక 1 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 1 తిమోతి పత్రిక 1 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


1 తిమోతి పత్రిక 1:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
విశ్వాస విషయంలో నా నిజ కుమారుడు తిమోతికి మన రక్షకుడైన దేవుని సంకల్పానుసారం, మన ఆశాభావం అయిన క్రీస్తు యేసు ఆజ్ఞ ప్రకారం అపొస్తలుడైన పౌలు రాస్తున్న సంగతులు.

1 తిమోతి పత్రిక 1:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తండ్రి అయిన దేవుని నుండీ మన ప్రభువైన క్రీస్తు యేసు నుండీ కృప, కనికరం, సమాధానం నీకు కలుగు గాక.

1 తిమోతి పత్రిక 1:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను మాసిదోనియ వెళ్తున్నపుడు నీకు చెప్పినట్టుగా నువ్వు ఎఫెసులోనే ఉండు. భిన్నమైన సిద్ధాంతాలను బోధించే వారిని అలా చేయవద్దని నువ్వు ఆజ్ఞాపించాలి.

1 తిమోతి పత్రిక 1:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అంత మాత్రమే కాక కల్పనా కథలను, అంతూ పొంతూ లేని వంశావళులను పట్టించుకోవద్దని వారికి ఆజ్ఞాపించు. ఎందుకంటే అవి వివాదాలకు కారణమౌతాయే గాని విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుకు ఎంత మాత్రమూ తోడ్పడవు.

1 తిమోతి పత్రిక 1:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ హెచ్చరికలోని ఉద్దేశం పవిత్ర హృదయం నుండీ మంచి మనస్సాక్షి నుండీ యథార్థమైన విశ్వాసం నుండీ వచ్చే ప్రేమే.

1 తిమోతి పత్రిక 1:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కొంతమంది వీటి నుండి తొలగిపోయి పనికిమాలిన కబుర్లకు దిగారు.

1 తిమోతి పత్రిక 1:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు మాట్లాడేవీ నొక్కి చెప్పేవీ వారికే అర్థం కాకపోయినా, ధర్మశాస్త్ర ఉపదేశకులుగా ఉండాలనుకుంటారు.

1 తిమోతి పత్రిక 1:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయినప్పటికీ ధర్మశాస్త్రాన్ని తగిన విధంగా ఉపయోగిస్తే అది మేలైనదే అని మనకు తెలుసు.

1 తిమోతి పత్రిక 1:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుడు నాకు అప్పగించిన ఈ గొప్ప సువార్త ప్రకారం ధర్మశాస్త్రం ఉన్నది నీతిమంతుల కోసం కాదు. ధర్మ విరోధులూ తిరుగుబాటు చేసేవారూ భక్తిహీనులూ పాపులూ దుర్మార్గులూ భక్తిహీనులూ చెడిపోయిన వారూ తల్లిదండ్రులను చంపేవారూ హంతకులూ

1 తిమోతి పత్రిక 1:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వ్యభిచారులూ స్వలింగ సంపర్కులూ బానిస వ్యాపారులూ అబద్ధికులూ అబద్ధ సాక్ష్యం చెప్పేవారూ నిజమైన బోధకు వ్యతిరేకంగా నడచుకొనేవారూ ఇలాటివారి కోసమే ధర్మశాస్త్రం ఉంది అని మనకు తెలుసు.

1 తిమోతి పత్రిక 1:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ మహిమగల సువార్తను మహిమగల దివ్య ప్రభువు నాకు అప్పగించాడు.

1 తిమోతి పత్రిక 1:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నన్ను బలపరచి, నమ్మకమైన వాడుగా ఎంచి తన సేవకు నియమించిన మన యేసు క్రీస్తు ప్రభువుకి కృతజ్ఞుణ్ణి.

1 తిమోతి పత్రిక 1:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అంతకు ముందు దేవ దూషకుణ్ణి, హింసించేవాణ్ణి, హానికరుణ్ణి. అయితే తెలియక అవిశ్వాసం వలన చేశాను కాబట్టి కనికరం పొందాను.

1 తిమోతి పత్రిక 1:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మన ప్రభువు తన ధారాళమైన కృపను నాపై కుమ్మరించి, యేసుక్రీస్తులో ఉన్న ప్రేమ విశ్వాసాలను అనుగ్రహించాడు.

1 తిమోతి పత్రిక 1:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడనే సందేశం నమ్మదగినదీ, సంపూర్ణంగా అంగీకరించదగినదీ. అలాంటి పాపుల్లో నేను మొదటి వాణ్ణి.

1 తిమోతి పత్రిక 1:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయినా నిత్యజీవం కోసం తనపై విశ్వాసముంచబోయే వారికి నేను ఒక నమూనాగా ఉండేలా యేసు క్రీస్తు తన పరిపూర్ణమైన ఓర్పును నాలో కనుపరచేలా నన్ను కరుణించాడు.

1 తిమోతి పత్రిక 1:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అన్ని యుగాల్లో రాజూ, అమర్త్యుడూ, అదృశ్యుడూ అయిన ఏకైక దేవునికి ఘనత, మహిమ యుగయుగాలు కలగాలి. ఆమేన్‌.

1 తిమోతి పత్రిక 1:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తిమోతీ, నా కుమారా, గతంలో నిన్ను గూర్చి చెప్పిన ప్రవచనాలకు అనుగుణంగానే ఈ సూచనలు నీకు ఇస్తున్నాను. వాటిని పాటిస్తే నీవు మంచి పోరాటం చేయగలుగుతావు.

1 తిమోతి పత్రిక 1:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలాటి మనస్సాక్షిని కొందరు నిరాకరించి, విశ్వాస విషయంలో ఓడ బద్దలై పోయినట్టుగా ఉన్నారు.

1 తిమోతి పత్రిక 1:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారిలో హుమెనై, అలెగ్జాండర్ ఉన్నారు. వీరు దేవదూషణ మానుకొనేలా వీరిని సాతానుకు అప్పగించాను.

Available Bible Translations

American Standard Version
1 Timothy 1 (ASV) »
King James Version
1 Timothy 1 (KJV) »
GOD’S WORD® (GW)
1 Timothy 1 (GW) »
World English Bible
1 Timothy 1 (WEB) »
Louis Segond 1910
1 Timothée 1 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
1 तीमुथियुस 1 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
1 ਤਿਮੋਥਿਉਸ 1 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
1 তীমথিয় 1 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
1 தீமோத்தேயு 1 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
1 तीमथ्याला 1 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
1 તિમોથીને 1 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
1 ತಿಮೊಥೆಯನಿಗೆ 1 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
١ تيموثاوس 1 (AVD) »
Bíblia Sagrada Português
1 Timóteo 1 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
1 Ti-mô-thê 1 (VIE) »
Reina Valera Antigua
1 Timoteo 1 (RVA) »
La Sacra Bibbia
1 Timoteo 1 (RIV) »
圣 经 简体中文和合本
提 摩 太 前 书 1 (CUVS) »
聖 經 繁體中文和合本
提 摩 太 前 書 1 (CUVT) »
Bibla e Shenjtë
1 Timoteut 1 (ALB) »
Библия на русском
1 Тимофею 1 (RUSV) »
Українська Біблія
1 Тимофію 1 (UKR) »
Szent Biblia - Magyar
1 Timóteus 1 (KAR) »
Българска Библия
1 Тимотей 1 (BULG) »
Kitaabka Quduuska Ah
1 Timoteyos 1 (SOM) »
De Heilige Schrift
1 Timotheüs 1 (NLD) »

1 తిమోతి పత్రిక (TELIRV) Chapter Selection

1 2 3 4 5 6

TELIRV Book Selection List