2 దినవృత్తాంతాలు Chapter 25 TELIRV Bible Verse Images

2 దినవృత్తాంతాలు 25 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 2 దినవృత్తాంతాలు 25 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


2 దినవృత్తాంతాలు 25:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అమజ్యా పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు 25 ఏళ్లవాడు. అతడు 29 ఏళ్ళు యెరూషలేములో పాలించాడు. అతని తల్లి యెరూషలేము నివాసి. ఆమె పేరు యెహోయద్దాను.

2 దినవృత్తాంతాలు 25:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు యెహోవా దృష్టికి యథార్ధంగా ప్రవర్తించాడు గాని పూర్ణహృదయంతో ఆయన్ని అనుసరించలేదు.

2 దినవృత్తాంతాలు 25:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రాజ్యం తనకు సుస్థిరం అయ్యాక అతడు రాజైన తన తండ్రిని చంపిన రాజసేవకులను చంపించాడు.

2 దినవృత్తాంతాలు 25:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే “తండ్రులు పిల్లల కోసం, పిల్లలు తండ్రులకోసం చావకూడదు, ప్రతి మనిషి తన పాపం కోసం తానే చావాలి” అని మోషే గ్రంథం అయిన ధర్మశాస్త్రంలో రాసి ఉన్న యెహోవా ఆజ్ఞ ప్రకారం అతడు వారి పిల్లలను చంపలేదు.

2 దినవృత్తాంతాలు 25:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అమజ్యా యూదావారందరినీ సమకూర్చి యూదా దేశమంతటా బెన్యామీనీయుల దేశమంతటా వారి వారి పూర్వీకుల వంశాల ప్రకారం సహస్రాధిపతులనూ, శతాధిపతులనూ నియమించాడు. అతడు 20 ఏళ్ళు మొదలు అంతకన్నా ఎక్కువ వయసున్న వారిని లెక్కిస్తే, ఈటెను డాళ్లను పట్టుకుని యుద్ధానికి వెళ్ళగలిగిన యోధులు మూడు లక్షల మంది అయ్యారు.

2 దినవృత్తాంతాలు 25:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు ఇంకా లక్ష మందిని మూడు వేల నాలుగు వందల కిలోల వెండి ఇచ్చి జీతానికి కుదుర్చుకున్నాడు.

2 దినవృత్తాంతాలు 25:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుని మనిషి ఒకడు అతని దగ్గరికి వచ్చి “రాజా, ఇశ్రాయేలు సైన్యాన్ని నీతో తీసుకు పోవద్దు, యెహోవా ఇశ్రాయేలువారైన ఎఫ్రాయిమీయుల్లో ఎవరికీ తోడుగా ఉండడు.

2 దినవృత్తాంతాలు 25:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆలా వెళ్లాలని నీకుంటే వెళ్ళు. యుద్ధం బలంగా చేసినా దేవుడు నీ శత్రువు ఎదుట నిన్ను పడగొడతాడు. సహాయం చేయడానికీ పడవేయడానికీ దేవుడు సమర్దుడే గదా” అని చెప్పాడు.

2 దినవృత్తాంతాలు 25:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అమజ్యా అతనితో “ఇశ్రాయేలువారి సైన్యానికి నేనిచ్చిన 3, 500 కిలోల వెండి సంగతి ఏం చేద్దాం” అని అడిగాడు. దానికతడు “దీనికంటే ఇంకా ఎక్కువ యెహోవా నీకు ఇవ్వగలడు” అని జవాబిచ్చాడు.

2 దినవృత్తాంతాలు 25:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు అమజ్యా ఎఫ్రాయిములోనుంచి తన దగ్గరికి వచ్చిన సైన్యాన్ని వేరుపరచి “మీ ఇళ్ళకు తిరిగి వెళ్ళండి” అని వారికి చెప్పాడు. అందుకు వారికి యూదావారి మీద తీవ్ర కోపం వచ్చింది. వారు మండిపడుతూ తమ ఇళ్ళకు తిరిగి వెళ్ళిపోయారు.

2 దినవృత్తాంతాలు 25:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అమజ్యా ధైర్యం తెచ్చుకుని తన ప్రజలతో బయలుదేరి, ఉప్పు లోయ స్థలానికి పోయి శేయీరువారిలో 10,000 మందిని హతమార్చాడు.

2 దినవృత్తాంతాలు 25:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రాణాలతో ఉన్న మరొక 10,000 మందిని యూదావారు చెరపట్టుకుని, వారిని ఒక కొండ అంచుకు తీసుకుపోయి అక్కడనుంచి వారిని పడవేస్తే వారు ముక్కలైపోయారు.

2 దినవృత్తాంతాలు 25:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే తనతో యుద్ధానికి రావద్దని అమజ్యా తిరిగి పంపివేసిన సైనికులు షోమ్రోను మొదలు బేత్‌హోరోను వరకూ ఉన్న యూదా పట్టణాల మీద పడి వారిలో 3,000 మందిని చంపి విస్తారమైన దోపిడీ సొమ్ము పట్టుకు పోయారు.

2 దినవృత్తాంతాలు 25:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అమజ్యా ఎదోమీయులను ఓడించి తిరిగి వచ్చిన తరువాత అతడు శేయీరు ప్రజల దేవుళ్ళను తీసుకువచ్చి తనకు దేవుళ్ళుగా నిలిపి వాటికి నమస్కరించి ధూపం వేశాడు.

2 దినవృత్తాంతాలు 25:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందువలన యెహోవా కోపం అమజ్యా మీద రగులుకుంది. ఆయన అతని దగ్గరికి ఒక ప్రవక్తను పంపాడు. అతడు “నీ చేతిలోనుంచి తమ ప్రజలను విడిపించే శక్తి లేని దేవుళ్ళ దగ్గర నీవెందుకు విచారణ చేస్తావు?” అని అమజ్యాతో అన్నాడు.

2 దినవృత్తాంతాలు 25:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు అమజ్యాతో మాటలాడుతుంటే, రాజు అతనితో “మేము నిన్ను రాజుకు సలహాదారునిగా చేశామా? ఆగు. ప్రాణాల మీదికి ఎందుకు తెచ్చుకుంటావు?” అన్నాడు. ఆ ప్రవక్త ఆగి “దేవుడు నిన్ను నాశనం చేయడానికి నిర్ణయించాడు. ఎందుకంటే నీవు నా సలహా పాటించ లేదు” అన్నాడు.

2 దినవృత్తాంతాలు 25:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు యూదారాజు అమజ్యా తన సలహాదారులతో ఆలోచన చేసి “రండి, మనం యుద్ధంలో ఒకరికొకరం తలపడదాం” అని యెహూకు పుట్టిన యెహోయాహాజు కొడుకూ, ఇశ్రాయేలు రాజూ అయిన యెహోయాషుకు కబురు పంపాడు.

2 దినవృత్తాంతాలు 25:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాగా ఇశ్రాయేలు రాజు యెహోయాషు యూదారాజు అమజ్యాకు ఇలా తిరుగు సందేశం పంపాడు. “‘నీ కూతుర్ని నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చెయ్యి’ అని లెబానోనులో ఉన్న ముళ్ళ చెట్టు లెబానోనులో ఉన్న దేవదారు వృక్షానికి సందేశం పంపితే లెబానోనులో తిరిగే ఒక అడవి జంతువు ఆ ముళ్ళచెట్టును తొక్కివేసింది.

2 దినవృత్తాంతాలు 25:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
‘నేను ఎదోమీయులను ఓడించాను’ అని నీవనుకుంటున్నావు. నీ హృదయం నీవు గర్వించి ప్రగల్భాలాడేలా చేస్తున్నది. ఇంటి దగ్గరే ఉండు. నీవు నా జోలికి వచ్చి కీడు తెచ్చుకోవడం ఎందుకు? నువ్వూ నీతో పాటు యూదావారూ ఓడిపోవడం ఎందుకు?”

2 దినవృత్తాంతాలు 25:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రజలు ఎదోమీయుల దేవుళ్ళ దగ్గర విచారణ చేస్తున్నారు కాబట్టి వారి శత్రువుల చేతికి వారు చిక్కేలా దేవుని ప్రేరణ వలన అమజ్యా ఆ సందేశాన్ని అంగీకరించ లేదు.

2 దినవృత్తాంతాలు 25:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలు రాజు యెహోయాషు బయలుదేరాడు. యూదాకు చెందిన బేత్షెమెషులో అతడూ యూదా రాజు అమజ్యా ఒకరినొకరు ఎదుర్కొన్నారు.

2 దినవృత్తాంతాలు 25:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదావారు ఇశ్రాయేలువారి ముందు నిలవలేక ఓడిపోయారు. ప్రతివాడూ తన గుడారానికి పారిపోయాడు.

2 దినవృత్తాంతాలు 25:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోయాషు యెహోయాహాజుకు పుట్టిన యోవాషు కొడుకూ, యూదారాజూ అయిన అమజ్యాను బేత్షెమెషులో పట్టుకుని యెరూషలేముకు తీసుకు వచ్చి, యెరూషలేము ప్రాకారాన్ని ఎఫ్రాయిము గుమ్మం మొదలు మూల గుమ్మం వరకూ 400 మూరల పొడుగున పడగొట్టాడు.

2 దినవృత్తాంతాలు 25:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు దేవుని మందిరంలో ఓబేదెదోము దగ్గర ఉన్న మొత్తం వెండి, బంగారం పాత్రలన్నీ రాజభవనంలో ఉన్న సొమ్మంతా తీసుకు షోమ్రోనుకు తిరిగి వెళ్లి పోయాడు.

2 దినవృత్తాంతాలు 25:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలు రాజూ యెహోయాహాజు కొడుకూ అయిన యెహోయాషు చనిపోయిన తరువాత యూదా రాజూ, యోవాషు కొడుకూ అయిన అమజ్యా 15 ఏళ్ళు బతికాడు.

2 దినవృత్తాంతాలు 25:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అమజ్యా గురించిన ఇతర విషయాలు యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో రాసివున్నాయి.

2 దినవృత్తాంతాలు 25:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అమజ్యా యెహోవాను అనుసరించడం మానివేసిన తరువాత ప్రజలు యెరూషలేములో అతని మీద కుట్ర చేశారు. అతడు లాకీషుకు పారిపోయాడు.

2 దినవృత్తాంతాలు 25:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే వారు అతని వెనుక లాకీషుకు మనుష్యులను పంపి అతణ్ణి అక్కడ చంపి, గుర్రాల మీద అతని శవాన్ని ఎక్కించి తీసుకువచ్చి యూదా పట్టణంలో అతని పూర్వీకుల దగ్గర పాతిపెట్టారు.

Available Bible Translations

American Standard Version (ASV)
2 Chronicles 25 (ASV) »
King James Version (KJV)
2 Chronicles 25 (KJV) »
GOD’S WORD® (GW)
2 Chronicles 25 (GW) »
Berean Bible (BSB)
2 Chronicles 25 (BSB) »
World English Bible (WEB)
2 Chronicles 25 (WEB) »
French Bible (LSG)
2 Chroniques 25 (LSG) »
German Bible (LUTH1912)
2 Chronik 25 (LUTH1912) »
Arabic Bible (AVD)
٢ أخبار 25 (AVD) »
Portuguese Bible (BSL)
2 Crônicas 25 (BSL) »
Vietnamese Bible (VIE)
2 Sử Ký 25 (VIE) »
Spanish Bible (RVA)
2 Crónicas 25 (RVA) »
Italian Bible (RIV)
2 Cronache 25 (RIV) »
Chinese Simplified (CUVS)
历 代 志 下 25 (CUVS) »
Chinese Traditional (CUVT)
歷 代 志 下 25 (CUVT) »
Albanian Bible (ALB)
2 Kronikave 25 (ALB) »
Swedish Bible (SV1917)
2 Krönikeboken 25 (SV1917) »
Ukrainian Bible (UKR)
2 хроніки 25 (UKR) »
Hungarian Bible (KAR)
2 Krónika 25 (KAR) »
Bulgarian Bible (BULG)
2 Летописи 25 (BULG) »
Japanese Bible (JPN)
歴代志下 25 (JPN) »
Norwegian Bible (NORSK)
2 Krønikebok 25 (NORSK) »

2 దినవృత్తాంతాలు (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List