గలతీ పత్రిక Chapter 1 TELIRV Bible Verse Images

గలతీ పత్రిక 1 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share గలతీ పత్రిక 1 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


గలతీ పత్రిక 1:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనుషుల ద్వారా కాకుండా ఏ వ్యక్తి వలనా కాకుండా కేవలం యేసుక్రీస్తు ద్వారానూ, ఆయనను చనిపోయిన వారిలోనుంచి సజీవుడిగా లేపిన తండ్రి అయిన దేవుని ద్వారానూ అపొస్తలుడుగా నియమితుడైన పౌలు అనే నేనూ,

గలతీ పత్రిక 1:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నాతో ఉన్న సోదరులంతా గలతీయ ప్రాంతంలో ఉన్న సంఘాలకు శుభాకాంక్షలతో రాస్తున్న విషయాలు.

గలతీ పత్రిక 1:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తండ్రి అయిన దేవుని నుండీ మన ప్రభు యేసు క్రీస్తు నుండీ మీకు కృప, శాంతి కలుగు గాక.

గలతీ పత్రిక 1:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలం నుంచి విమోచించాలని మన పాపాల కోసం తనను తాను అప్పగించుకున్నాడు.

గలతీ పత్రిక 1:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నిరంతరమూ దేవునికి మహిమ కలుగు గాక. ఆమేన్‌.

గలతీ పత్రిక 1:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచినవాణ్ణి విడిచిపెట్టి, భిన్నమైన సువార్త వైపు మీరింత త్వరగా తిరిగిపోవడం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది.

గలతీ పత్రిక 1:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అసలు వేరే సువార్త అనేది లేదు. క్రీస్తు సువార్తను వక్రీకరించి మిమ్మల్ని కలవరపరచే వారు కొంతమంది ఉన్నారు.

గలతీ పత్రిక 1:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మేము మీకు ప్రకటించిన సువార్త గాక వేరొక సువార్తను మేము అయినా లేక పరలోకం నుంచి వచ్చిన ఒక దూత అయినా సరే మీకు ప్రకటిస్తే, అతడు దేవుని శాపానికి గురౌతాడు గాక.

గలతీ పత్రిక 1:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మేము ఇంతకు ముందు చెప్పినట్టు ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాము. మీరు అంగీకరించిన సువార్త గాక వేరొకటి ఎవరైనా మీకు ప్రకటిస్తే, వాణ్ణి దేవుడు శపిస్తాడు గాక.

గలతీ పత్రిక 1:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇప్పుడు నేను మనుషుల ఆమోదం కోరుతున్నానా? లేకపోతే దేవుని ఆమోదం కోరుతున్నానా? నేను మనుషులను తృప్తి పరచాలనుకుంటున్నానా? నేనింకా మనుషులను తృప్తి పరచాలనుకుంటుంటే క్రీస్తు సేవకుణ్ణి కానే కాదు.

గలతీ పత్రిక 1:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సోదరులారా, నేను ప్రకటించిన సువార్త మానవమాత్రుని నుంచి వచ్చింది కాదని మీకు తెలియాలి.

గలతీ పత్రిక 1:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనిషి నుంచి నేను దాన్ని పొందలేదు, నాకెవరూ దాన్ని బోధించ లేదు, యేసు క్రీస్తు స్వయంగా నాకు వెల్లడి పరిచాడు.

గలతీ పత్రిక 1:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా గత యూదామత జీవితం గురించి మీరు విన్నారు. నేను దేవుని సంఘాన్ని తీవ్రంగా హింసిస్తూ నాశనం చేస్తూ ఉండేవాణ్ణి.

గలతీ పత్రిక 1:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు నాకు నా పూర్వీకుల సంప్రదాయాలంటే ఎంతో ఆసక్తి ఉండేది. యూదా మత నిష్ఠ విషయంలో నా స్వజాతీయుల్లో నా వయసు గల అనేకులను మించిపోయాను.

గలతీ పత్రిక 1:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయినా తల్లిగర్భంలోనే నన్ను ప్రత్యేకపరచుకుని, తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను యూదేతరులకు తన కుమారుణ్ణి ప్రకటించాలని

గలతీ పత్రిక 1:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయనను నాలో వెల్లడి చేయడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు వెంటనే నేను మనుషులతో సంప్రదించలేదు.

గలతీ పత్రిక 1:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నాకంటే ముందు అపొస్తలులైన వారి దగ్గరికి గానీ, యెరూషలేముకు గానీ వెళ్ళలేదు, అరేబియా దేశానికి వెళ్ళి ఆ తరువాత దమస్కు పట్టణానికి తిరిగి వచ్చాను.

గలతీ పత్రిక 1:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మూడు సంవత్సరాలైన తరవాత కేఫాను పరిచయం చేసుకోవాలని యెరూషలేము వెళ్లి అతనితో పదిహేను రోజులున్నాను.

గలతీ పత్రిక 1:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతనిని తప్ప అపొస్తలుల్లో మరి ఎవరినీ నేను చూడలేదు, ప్రభువు సోదరుడు యాకోబును మాత్రం చూశాను.

గలతీ పత్రిక 1:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను మీకు రాస్తున్న ఈ విషయాల గురించి దేవుని ముందు నేను చెపుతున్నాను.

గలతీ పత్రిక 1:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ తరువాత సిరియా, కిలికియ ప్రాంతాలకు వచ్చాను.

గలతీ పత్రిక 1:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
క్రీస్తులో ఉన్న యూదయ సంఘాల వారికి నా ముఖ పరిచయం లేదు గానీ

గలతీ పత్రిక 1:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“మునుపు మనలను హింసించిన వాడు తాను గతంలో నాశనం చేస్తూ వచ్చిన విశ్వాసాన్ని తానే ప్రకటిస్తున్నాడు” అనే విషయం మాత్రమే విని,

గలతీ పత్రిక 1:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమ పరిచారు.

Available Bible Translations

American Standard Version
Galatians 1 (ASV) »
King James Version
Galatians 1 (KJV) »
GOD’S WORD® (GW)
Galatians 1 (GW) »
World English Bible
Galatians 1 (WEB) »
Louis Segond 1910
Galates 1 (LSG) »
Luther Bibel 1912
Galater 1 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
गलातियों 1 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਗਲਾਤਿਯਾ 1 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
গালাতীয়া 1 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
கலாத்தியர் 1 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
गलतीकरांस 1 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ગલાતીઓને 1 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಗಲಾತ್ಯದವರಿಗೆ 1 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
غَلاطِيَّة 1 (AVD) »
Bíblia Sagrada Português
Gálatas 1 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ga-la-ti 1 (VIE) »
Reina Valera Antigua
Gálatas 1 (RVA) »
La Sacra Bibbia
Galati 1 (RIV) »
圣 经 简体中文和合本
加 拉 太 书 1 (CUVS) »
聖 經 繁體中文和合本
加 拉 太 書 1 (CUVT) »
Bibla e Shenjtë
Galatasve 1 (ALB) »
Svenska Bibeln 1917
Galaterbrevet 1 (SV1917) »
Библия на русском
Галатам 1 (RUSV) »
Українська Біблія
галатів 1 (UKR) »
Szent Biblia - Magyar
Galátzia 1 (KAR) »
Българска Библия
Галатяни 1 (BULG) »
Kitaabka Quduuska Ah
Galatiya 1 (SOM) »
De Heilige Schrift
Galaten 1 (NLD) »
Dansk Bibel 1871
Galaterne 1 (DA1871) »

గలతీ పత్రిక (TELIRV) Chapter Selection

1 2 3 4 5 6

TELIRV Book Selection List