1 కొరింథీయులకు Chapter 12 TELIRV Bible Verse Images

1 కొరింథీయులకు 12 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 1 కొరింథీయులకు 12 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


1 కొరింథీయులకు 12:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సోదరీ సోదరులారా, ఆత్మవరాలను గూర్చి మీకు తెలియకుండా ఉండడం నాకిష్టం లేదు.

1 కొరింథీయులకు 12:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పూర్వం మీరు అవిశ్వాసులుగా ఉన్నప్పుడు ఎటుబడితే అటు కొట్టుకుపోతూ మూగవిగ్రహాలను ఆరాధించేవారని మీకు తెలుసు.

1 కొరింథీయులకు 12:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుచేత నేను మీతో చెప్పేదేమంటే, దేవుని ఆత్మ వలన మాట్లాడే వారెవరూ, “యేసు శాపగ్రస్తుడు” అని చెప్పరు. అలాగే పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవరూ, “యేసే ప్రభువు” అని చెప్పలేరు.

1 కొరింథీయులకు 12:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుని ఆత్మ ఒక్కడే గాని ఆయన అనుగ్రహించే కృపావరాలు వేరు వేరు.

1 కొరింథీయులకు 12:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలాగే ప్రభువు ఒక్కడే గాని పరిచర్యలు వేరు వేరు విధాలు.

1 కొరింథీయులకు 12:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వేరు వేరు కార్యాలు ఉన్నాయి గాని అందరిలో, అన్నిటినీ జరిగించే దేవుడు ఒక్కడే.

1 కొరింథీయులకు 12:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందరి ప్రయోజనం కోసం ప్రతి ఒక్కడికీ ఆత్మ తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తున్నాడు.

1 కొరింథీయులకు 12:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎలా అంటే, ఒకే ఆత్మ ఒకడికి బుద్ధి వాక్కు, ఒకడికి జ్ఞాన వాక్కు,

1 కొరింథీయులకు 12:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మరొకడికి విశ్వాసం, మరొకడికి స్వస్థత వరం ఇస్తాడు.

1 కొరింథీయులకు 12:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ ఆత్మే ఒకడికి అద్భుతాలు చేసే శక్తి, మరొకడికి ప్రవచనాలు పలికే శక్తి, మరొకడికి ఆత్మలను గుర్తించే శక్తి, మరొకడికి వివిధ రకాల భాషలు మాట్లాడే సామర్ధ్యం, మరొకడికి ఆ భాషల అర్థం చెప్పే శక్తి అనుగ్రహిస్తున్నాడు.

1 కొరింథీయులకు 12:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ ఆత్మ ఒక్కడే ఇవన్నీ చేస్తూ తనకు నచ్చినట్టు ఒక్కొక్కరికి ప్రత్యేకంగా పంచిపెడుతున్నాడు.

1 కొరింథీయులకు 12:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
శరీరం ఒక్కటే, అందులో అనేక అవయవాలు ఉన్నాయి. అవన్నీ ఒకే శరీరంలో అవయవాలైనా శరీరం ఒకటే. క్రీస్తు కూడా అలానే ఉన్నాడు.

1 కొరింథీయులకు 12:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎలాగంటే, యూదులైనా, గ్రీకులైనా, దాసులైనా, స్వతంత్రులైనా, మనమంతా ఒక్క శరీరంలోకి ఒక్క ఆత్మలోనే బాప్తిసం పొందాం. మనమంతా ఒకే ఆత్మను పానం చేశాం.

1 కొరింథీయులకు 12:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
శరీరం అంటే ఒక్క అవయవమే కాదు, అది అనేక అవయవాలతో ఉంది.

1 కొరింథీయులకు 12:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పాదం ‘నేను చేతిని కాదు కాబట్టి శరీరంతో నాకు సంబంధం లేదు’ అని చెప్పినంత మాత్రాన అది శరీరంలో భాగం కాకుండా పోదు.

1 కొరింథీయులకు 12:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలాగే చెవి ‘నేను కన్ను కాదు కాబట్టి శరీరంతో నాకు సంబంధం లేదు’ అని చెప్పినంత మాత్రాన అది శరీరంలో భాగం కాకుండా పోదు.

1 కొరింథీయులకు 12:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
శరీరమంతా ఒక్క కన్నే ఉంటే ఇక వినడం ఎలా? శరీరమంతా ఒక్క చెవే అయితే వాసన ఎలా చూడాలి?

1 కొరింథీయులకు 12:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకే దేవుడు ప్రతి అవయవాన్నీ తన ఇష్టం ప్రకారం శరీరంలో ఉంచాడు.

1 కొరింథీయులకు 12:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అవన్నీ ఒకే అవయవం అయితే శరీరమేది?

1 కొరింథీయులకు 12:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే ఇప్పుడు అవయవాలు అనేకం, శరీరం మాత్రం ఒక్కటే.

1 కొరింథీయులకు 12:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి కన్ను చేతితో, “నీవు నాకక్కర లేదు” అనీ, తల పాదాలతో, “మీరు నాకక్కర లేదు” అనీ చెప్పడానికి వీలు లేదు.

1 కొరింథీయులకు 12:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అంతేకాక, శరీరంలో బలహీనంగా కనిపించే అవయవాలు ఎక్కువ అవసరమైనవి.

1 కొరింథీయులకు 12:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
శరీరంలో ఘనత లేనివని తలంచే అవయవాలను మరి ఎక్కువగా ఘనపరుస్తాం. అందం లేదని తలచే అవయవాలకు ఎక్కువ అందాన్ని కలిగిస్తాం.

1 కొరింథీయులకు 12:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందమైన అవయవాలకు మరింత అందం అక్కర లేదు. ఆ విధంగా దేవుడు శరీరంలో వివాదాలు రాకుండా అవయవాలన్నీ ఒకదాని పట్ల మరొకటి శ్రద్ధ వహించేలాగా, తక్కువ దానికే ఎక్కువ ఘనత కలిగించి, శరీరాన్ని అమర్చాడు.

1 కొరింథీయులకు 12:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందమైన అవయవాలకు మరింత అందం అక్కర లేదు. ఆ విధంగా దేవుడు శరీరంలో వివాదాలు రాకుండా అవయవాలన్నీ ఒకదాని పట్ల మరొకటి శ్రద్ధ వహించేలాగా, తక్కువ దానికే ఎక్కువ ఘనత కలిగించి, శరీరాన్ని అమర్చాడు.

1 కొరింథీయులకు 12:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి ఒక అవయవం బాధపడితే మిగిలిన అవయవాలన్నీ దానితో కలిసి బాధపడతాయి. ఒకటి ఘనత పొందితే అవయవాలన్నీ దానితో కలిసి సంతోషిస్తాయి.

1 కొరింథీయులకు 12:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు క్రీస్తు శరీరం. మీలో ప్రతి ఒక్కరూ ఆ శరీరానికి చెందిన భాగాలు.

1 కొరింథీయులకు 12:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుడు సంఘంలో మొదటి స్థానంలో అపొస్తలులను, రెండవ స్థానంలో ప్రవక్తలను, మూడవ స్థానంలో ఉపదేశకులను, ఆ తర్వాత అద్భుతాలు చేసేవారిని, ఆ తర్వాత స్వస్థత వరం గలవారిని, ఉపకారాలు చేసేవారిని, కార్యాలు పర్యవేక్షించేవారిని, వివిధ భాషలు మాట్లాడేవారిని నియమించాడు.

1 కొరింథీయులకు 12:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందరూ అపొస్తలులు కారు, అందరూ ప్రవక్తలు కారు, అందరూ బోధకులు కారు, అందరూ అద్భుతాలు చేయరు.

1 కొరింథీయులకు 12:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందరికీ స్వస్థత వరం లేదు. అందరూ భాషలతో మాట్లాడరు, అందరూ భాషల అర్థం చెప్పలేరు.

1 కొరింథీయులకు 12:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కృపావరాల్లో శ్రేష్ఠమైన వాటిని ఆసక్తితో కోరుకోండి. అయితే నేను వీటన్నిటికీ మించిన సర్వ శ్రేష్ఠ మార్గాన్ని మీకు చూపిస్తాను.

Available Bible Translations

American Standard Version
1 Corinthians 12 (ASV) »
King James Version
1 Corinthians 12 (KJV) »
GOD’S WORD® (GW)
1 Corinthians 12 (GW) »
World English Bible
1 Corinthians 12 (WEB) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
1 कुरिन्थियों 12 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
1 ਕੁਰਿੰਥੀਆਂ 12 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
1 কৰিন্থীয়া 12 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
1 கொரிந்தியர் 12 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
1 करिंथकरांस 12 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
1 કરિંથીઓને 12 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
1 ಕೊರಿಂಥದವರಿಗೆ 12 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
١ كورنثوس 12 (AVD) »
Bíblia Sagrada Português
1 Coríntios 12 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
1 Cô-rinh-tô 12 (VIE) »
Reina Valera Antigua
1 Corintios 12 (RVA) »
La Sacra Bibbia
1 Corinzi 12 (RIV) »
圣 经 简体中文和合本
哥 林 多 前 书 12 (CUVS) »
聖 經 繁體中文和合本
歌 林 多 前 書 12 (CUVT) »
Библия на русском
1 Коринфянам 12 (RUSV) »
Українська Біблія
1 коринтян 12 (UKR) »
Szent Biblia - Magyar
1 Korinthus 12 (KAR) »
Българска Библия
1 Коринтяни 12 (BULG) »
Kitaabka Quduuska Ah
1 Korintos 12 (SOM) »
De Heilige Schrift
1 Corinthiërs 12 (NLD) »

1 కొరింథీయులకు (TELIRV) Chapter Selection

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

TELIRV Book Selection List