మార్కు Chapter 15 TELIRV Bible Verse Images

మార్కు 15 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share మార్కు 15 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


మార్కు 15:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తెల్లవారు జామున ముఖ్య యాజకులు, పెద్దలు, ధర్మశాస్త్ర పండితులు, యూదుల మహాసభకు చెందిన సభ్యులు కలసి సమాలోచన చేశారు. తరువాత వారు యేసును బంధించి తీసుకువెళ్ళి రోమా గవర్నర్ పిలాతుకు అప్పగించారు.

మార్కు 15:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పిలాతు యేసును, “నీవు యూదుల రాజువా?” అని ప్రశ్నించాడు. అందుకు యేసు, “నువ్వే అంటున్నావుగా” అని అతనికి జవాబిచ్చాడు.

మార్కు 15:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ముఖ్య యాజకులు ఆయన మీద చాలా నేరాలు మోపారు.

మార్కు 15:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కనుక పిలాతు మరొకసారి ఆయనను ప్రశ్నిస్తూ, “వీళ్ళు నీకు వ్యతిరేకంగా ఎన్ని నేరారోపణలు చేస్తున్నారో చూడు! నీవేమీ జవాబు చెప్పవా?” అన్నాడు.

మార్కు 15:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయినా యేసు మారు పలకలేదు. ఇది చూసి పిలాతుకు చాలా ఆశ్చర్యం వేసింది.

మార్కు 15:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పండగ రోజున ప్రజల కోరిక ప్రకారం ఒక ఖైదీని విడుదల చేయడం పిలాతుకు ఆనవాయితీ.

మార్కు 15:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బరబ్బ అనే ఒక ఖైదీ హంతకులైన తన తోటి తిరుగుబాటుదారులతో ఖైదులో ఉన్నాడు.

మార్కు 15:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జన సమూహం ప్రతి సంవత్సరం విడుదల చేసినట్టే ఆ సంవత్సరం కూడా ఒకరిని విడుదల చేయమని పిలాతును కోరారు.

మార్కు 15:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పిలాతు, “యూదుల రాజును మీకు విడుదల చేయాలని కోరుతున్నారా?” అని అన్నాడు.

మార్కు 15:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే ముఖ్య యాజకులు కేవలం అసూయ చేతనే యేసును తనకు అప్పగించారని అతడు గ్రహించాడు.

మార్కు 15:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాని ముఖ్య యాజకులు, యేసుకు బదులుగా బరబ్బను విడుదల చెయ్యాలని కోరమని ప్రజలను పురికొల్పారు.

మార్కు 15:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పిలాతు, “అలాగైతే ‘యూదుల రాజు’ అని పిలిచే ఈ యేసును ఏమి చేయమంటారు?” అని అడిగాడు.

మార్కు 15:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు కేకలు వేస్తూ, “సిలువ వేయండి” అన్నారు.

మార్కు 15:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పిలాతు, “ఎందుకు? అతడు చేసిన నేరమేంటి?” అన్నాడు. జనసమూహం, “సిలువ వేయండి” అంటూ ఇంకా ఎక్కువగా కేకలు వేశారు.

మార్కు 15:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ జనసమూహన్ని సంతోషపెట్టాలని పిలాతు వారు అడిగినట్టు బరబ్బను విడుదల చేసి, యేసును కొరడా దెబ్బలు కొట్టించి. సిలువ వేయడానికి అప్పగించాడు.

మార్కు 15:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సైనికులు యేసును అధికార భవనంలోకి తీసుకు వెళ్ళి మిగిలిన సైనికులందర్నీ అక్కడికి పిలిచారు.

మార్కు 15:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారాయనకు ఊదా రంగు బట్టలు తొడిగి, ముళ్ళతో ఒక కిరీటం అల్లి ఆయన తలపై పెట్టారు.

మార్కు 15:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ తరువాత, “యూదుల రాజా, జయం!” అంటూ ఆయనకు వందనం చేయసాగారు.

మార్కు 15:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రెల్లు కర్రతో తలపై కొట్టి ఆయన మీద ఉమ్మి వేశారు. ఆయన ముందు మోకరించి నమస్కరించారు.

మార్కు 15:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ విధంగా ఆయనను అవహేళన చేసిన తరువాత ఆ ఊదా రంగు అంగీ తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగి సిలువ వేయడానికి తీసుకు వెళ్ళారు.

మార్కు 15:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కురేనే ప్రాంతానికి చెందిన సీమోను (ఇతడు అలెగ్జాండర్, రూఫస్ అనే వారి తండ్రి) ఆ దారిలో నడిచి వస్తూ ఉండగా చూసి, సైనికులు అతనితో బలవంతంగా యేసు సిలువను మోయించారు.

మార్కు 15:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు యేసును, “గొల్గొతా” అనే చోటికి తీసుకు వచ్చారు, గొల్గొతా అంటే, “కపాల స్థలం” అని అర్థం.

మార్కు 15:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు వారు ద్రాక్షారసంలో బోళం కలిపి ఆయనకు తాగడానికి ఇచ్చారు. కాని యేసు తాగలేదు.

మార్కు 15:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ తరువాత వారు ఆయనను సిలువ వేశారు. ఆయన బట్టలు పంచుకోవడానికి చీట్లు వేసి, ఎవరికి వచ్చినవి వారు తీసుకున్నారు.

మార్కు 15:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయనను సిలువ వేసిన సమయం ఉదయం తొమ్మిది గంటలు.

మార్కు 15:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“యూదుల రాజు” అని ఆయన మీద మోపిన నేరం ఒక పలక మీద రాసి తగిలించారు.

మార్కు 15:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయనతో ఇద్దరు బందిపోటు దొంగలను ఒకణ్ణి కుడి వైపు, మరొకణ్ణి ఎడమవైపు సిలువ వేశారు.

మార్కు 15:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
‘ఆయనను అక్రమకారుల్లో ఒకడిగా ఎంచారు’ అని లేఖనాల్లో రాసిన వాక్కు దీని వలన నెరవేరింది.

మార్కు 15:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ దారిన వెళ్ళే వారు ఆయనను దూషిస్తూ తలలాడిస్తూ, “దేవాలయాన్ని కూలదోసి మూడు రోజుల్లో మళ్ళీ కట్టిస్తానన్నావు కదా!

మార్కు 15:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ముందు సిలువ నుండి కిందికి దిగి నిన్ను నువ్వే రక్షించుకో!” అన్నారు.

మార్కు 15:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులు కూడా ఆయనను హేళన చేస్తూ, “వీడు ఇతరులను రక్షించాడు. తనను తాను రక్షించుకోలేడు!

మార్కు 15:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
‘క్రీస్తు’ అనే ఈ ‘ఇశ్రాయేలు రాజు’ సిలువ మీద నుండి కిందికి దిగి వస్తే అప్పుడు నమ్ముతాం!” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. యేసుతో పాటు సిలువ వేసినవారు కూడా ఆయనను నిందించారు.

మార్కు 15:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకూ దేశమంతా చీకటి కమ్మింది.

మార్కు 15:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మూడు గంటలకు యేసు, “ఏలీ! ఏలీ! లామా సబక్తానీ!” అని గావుకేక పెట్టాడు. ఆ మాటలకు, “నా దేవా! నా దేవా! నా చెయ్యి విడిచిపెట్టావెందుకు?” అని అర్థం.

మార్కు 15:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దగ్గర నిలుచున్న కొందరు అది విని, “ఇదిగో, ఇతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అన్నారు.

మార్కు 15:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒకడు పరుగెత్తుకుంటూ వెళ్ళి స్పాంజ్ ని పులిసిన ద్రాక్షారసంలో ముంచి రెల్లు కర్రకు తగిలించి యేసుకు తాగడానికి అందించాడు. “ఏలీయా వచ్చి ఇతన్ని కిందికి దించుతాడేమో చూద్దాం” అని అతడు అన్నాడు.

మార్కు 15:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు యేసు పెద్ద కేక వేసి ప్రాణం విడిచాడు.

మార్కు 15:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ వెంటనే దేవాలయంలో తెర పైనుండి కింది వరకూ రెండుగా చినిగిపోయింది.

మార్కు 15:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యేసు ఎదుట నిలబడి ఉన్న శతాధిపతి ఆయన చనిపోయిన విధానం అంతా గమనించి, “నిజంగా ఈయన దేవుని కుమారుడు” అన్నాడు.

మార్కు 15:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కొందరు స్త్రీలు దూరం నుండి చూస్తున్నారు. వారిలో మగ్దలేనే మరియ, చిన్న యాకోబు, యోసేల తల్లి మరియ, సలోమి ఉన్నారు.

మార్కు 15:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యేసు గలిలయలో ఉన్నపుడు వీరు ఆయనను వెంబడిస్తూ ఆయనకు సేవ చేసేవారు. వీరే కాక ఆయన వెంట యెరూషలేముకు వచ్చిన స్త్రీలు కూడా అక్కడ ఉన్నారు.

మార్కు 15:42 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అది విశ్రాంతి దినానికి ముందు రోజు, సిద్ధపడే రోజు.

మార్కు 15:43 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదుల మహా సభలో పేరు పొందిన ఒక సభ్యుడు, అరిమతయి వాడైన యోసేపు అక్కడికి వచ్చాడు. అతడు దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నవాడు. అతడు ధైర్యంగా పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహాన్ని తనకు ఇమ్మని అడిగాడు.

మార్కు 15:44 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యేసు అంత త్వరగా చనిపోయాడని పిలాతు ఆశ్చర్యపోయి, శతాధిపతిని పిలిచి, “యేసు అప్పుడే చనిపోయాడా?” అని అడిగాడు.

మార్కు 15:45 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన చనిపోయాడని శతాధిపతి ద్వారా తెలుసుకుని ఆయన దేహాన్ని యోసేపుకు అప్పగించాడు.

మార్కు 15:46 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోసేపు సన్న నారబట్ట కొని యేసును కిందికి దింపి ఆ బట్టలో చుట్టాడు. ఆ తరువాత రాతిలో తొలిపించిన సమాధిలో ఆయనను పెట్టాడు. ఒక రాయిని అడ్డంగా దొర్లించి ఆ సమాధిని మూసివేశాడు.

మార్కు 15:47 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మగ్దలేనే మరియ, యేసు తల్లి అయిన మరియ ఆయనను ఉంచిన చోటును చూశారు.

Available Bible Translations

American Standard Version
Mark 15 (ASV) »
King James Version
Mark 15 (KJV) »
GOD’S WORD® (GW)
Mark 15 (GW) »
Berean Bible
Mark 15 (BSB) »
World English Bible
Mark 15 (WEB) »
Louis Segond 1910
Marc 15 (LSG) »
Luther Bibel 1912
Markus 15 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
मरकुस 15 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਮਰਕੁਸ 15 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
মার্ক 15 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
மாற்கு 15 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
मार्क 15 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
માર્ક 15 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಮಾರ್ಕನು 15 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
مَرْقُس 15 (AVD) »
Bíblia Sagrada Português
Marcos 15 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Mác 15 (VIE) »
Reina Valera Antigua
Marcos 15 (RVA) »
La Sacra Bibbia
Marco 15 (RIV) »
圣 经 简体中文和合本
马 可 福 音 15 (CUVS) »
聖 經 繁體中文和合本
馬 可 福 音 15 (CUVT) »
Bibla e Shenjtë
Marku 15 (ALB) »
Svenska Bibeln 1917
Markus 15 (SV1917) »
Библия на русском
Марка 15 (RUSV) »
Українська Біблія
Марка 15 (UKR) »
Szent Biblia - Magyar
Márk 15 (KAR) »
Българска Библия
Марко 15 (BULG) »
Det Norsk Bibel
Markus 15 (NORSK) »
Biblia Takatifu
Marko 15 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Markos 15 (SOM) »
De Heilige Schrift
Markus 15 (NLD) »
Dansk Bibel 1871
Markus 15 (DA1871) »

మార్కు (TELIRV) Chapter Selection

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

TELIRV Book Selection List