ప్రకటన గ్రంథం Chapter 19 TELIRV Bible Verse Images

ప్రకటన గ్రంథం 19 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ప్రకటన గ్రంథం 19 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


ప్రకటన గ్రంథం 19:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ విషయాలు జరిగిన తరువాత అనేకమంది మాట్లాడుతున్నట్టు పరలోకంలో నుండి ఒక పెద్ద శబ్దం నేను విన్నాను. “హల్లెలూయ! రక్షణ, యశస్సు, బల ప్రభావాలు మన దేవునివే.

ప్రకటన గ్రంథం 19:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన తీర్పులు సత్యంగా న్యాయంగా ఉన్నాయి. తన లైంగిక అవినీతితో భూలోకాన్ని భ్రష్టత్వంలోకి నెట్టిన మహా వేశ్యను ఆయన శిక్షించాడు. ఆమె ఒలికించిన తన సేవకుల రక్తానికి ఆయన ప్రతీకారం తీర్చాడు.”

ప్రకటన గ్రంథం 19:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రెండోసారి వారంతా, “హల్లెలూయ! ఆ నగరం నుండి పొగ కలకాలం పైకి లేస్తూనే ఉంటుంది” అన్నారు.

ప్రకటన గ్రంథం 19:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ఆ ఇరవై నలుగురు పెద్దలూ ఆ నాలుగు ప్రాణులూ సాష్టాంగపడి సింహాసనంపై కూర్చున్న దేవునికి, “ఆమెన్, హల్లెలూయ!” అని చెబుతూ ఆయనను పూజించారు.

ప్రకటన గ్రంథం 19:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు, “దేవుని దాసులు, ఆయనకు భయపడే వారు, గొప్పవారైనా అనామకులైనా అందరూ మన దేవుణ్ణి స్తుతించండి” అంటూ ఒక స్వరం సింహాసనం నుండి వినిపించింది.

ప్రకటన గ్రంథం 19:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత అనేకమంది మాట్లాడుతున్నట్టు, అనేక జలపాతాల గర్జనలా, బలమైన ఉరుముల ధ్వనిలా ఒక స్వరం ఇలా వినిపించింది. “హల్లెలూయ! సర్వ శక్తిశాలి, మన ప్రభువు అయిన దేవుడు పరిపాలిస్తున్నాడు.”

ప్రకటన గ్రంథం 19:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చింది. పెండ్లికుమార్తె సిద్ధపడి ఉంది. కాబట్టి మనం సంతోషించి ఆనందించుదాం. ఆయనకు మహిమ ఆపాదించుదాం.”

ప్రకటన గ్రంథం 19:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆమె ధరించుకోడానికి మెరిసిపోయే, పరిశుభ్రమైన శ్రేష్ఠవస్త్రాలు ఇచ్చారు. ఈ శ్రేష్ఠవస్త్రాలు పరిశుద్ధుల నీతి కార్యాలు.

ప్రకటన గ్రంథం 19:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ఆ దూత నాతో ఇలా అన్నాడు, “గొర్రెపిల్ల పెళ్ళి విందుకు ఆహ్వానం అందినవారు ధన్యులు అని రాయి.” అతడే ఇంకా, “ఇవి నిజంగా దేవుని మాటలు” అన్నాడు.

ప్రకటన గ్రంథం 19:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు నేను అతణ్ణి పూజించడానికి అతని ముందు సాష్టాంగపడబోయాను. కానీ అతడు, “అలా చేయకు! యేసుకు సాక్షులుగా ఉన్న నీకూ నీ సోదరులకూ నేను తోటి దాసుణ్ణి మాత్రమే” అన్నాడు.

ప్రకటన గ్రంథం 19:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత పరలోకం తెరుచుకుని ఉండడం చూశాను. అప్పుడు చూడండి! తెల్లని గుర్రం ఒకటి నాకు కనిపించింది. దానిమీద కూర్చున్న వ్యక్తి పేరు ‘నమ్మకమైన వాడు, సత్యవంతుడు.’ ఆయన న్యాయంగా తీర్పు చెబుతూ యుద్ధం చేస్తాడు.

ప్రకటన గ్రంథం 19:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన నేత్రాలు అగ్నిజ్వాలల్లా ఉన్నాయి. ఆయన తలపై అనేక కిరీటాలున్నాయి. ఆయనపై ఒక పేరు రాసి ఉంది. అది ఆయనకు తప్ప వేరెవరికీ తెలియదు.

ప్రకటన గ్రంథం 19:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన ధరించిన దుస్తులు రక్తంలో ముంచి తీసినవి. ‘దేవుని వాక్కు’ అనే పేరు ఆయనకుంది.

ప్రకటన గ్రంథం 19:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన వెనకే పరలోక సేనలు తెల్లని నార బట్టలు వేసుకుని తెల్ల గుర్రాలపై ఎక్కి వెళ్తున్నారు.

ప్రకటన గ్రంథం 19:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వివిధ జాతి ప్రజలను కొట్టడానికి ఆయన నోటి నుండి పదునైన కత్తి బయటకు వస్తూ ఉంది. ఆయన ఇనుప లాఠీతో వారిని పరిపాలిస్తాడు. సర్వాధికారి అయిన దేవుని తీక్షణమైన ఆగ్రహపు ద్రాక్ష గానుగ తొట్టిని ఆయనే తొక్కుతాడు.

ప్రకటన గ్రంథం 19:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన బట్టల మీదా, తొడ మీదా ‘రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు’ అనే పేరు రాసి ఉంది.

ప్రకటన గ్రంథం 19:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ఒక దూత సూర్యబింబంలో నిలబడి ఉండడం నేను చూశాను. అతడు బిగ్గరగా కేక వేసి పైన ఎగిరే పక్షులను పిలిచాడు, “రండి, దేవుడు ఏర్పాటు చేసిన మహా విందును ఆరగించండి.

ప్రకటన గ్రంథం 19:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రాజుల మాంసం, సైన్యాధిపతుల మాంసం, బలవంతుల మాంసం, గుర్రాల మాంసం, వాటిపై స్వారీ చేసేవారి మాంసం, స్వతంత్రులూ, బానిసలూ, పలుకుబడి లేనివారూ, గొప్పవారూ అయిన మనుషులందరి మాంసం, వచ్చి తినండి” అన్నాడు.

ప్రకటన గ్రంథం 19:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
క్రూరమృగం, భూమి మీదనున్న రాజులందరూ తమ సైన్యాలతో వ్యూహం తీరి ఉండడం నేను చూశాను. వారు ఆ గుర్రం మీద కూర్చున్న వ్యక్తితోనూ ఆయన సైన్యంతోనూ యుద్ధం చేయడానికి సిద్ధం అవుతున్నారు.

ప్రకటన గ్రంథం 19:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడా మృగమూ, వాడి ముందు అద్భుతాలు చేసిన అబద్ధ ప్రవక్తా పట్టుబడ్డారు. ఈ అద్భుతాలతోనే వీడు మృగం ముద్ర వేయించుకున్న వారిని, ఆ విగ్రహాన్ని పూజించిన వారిని మోసం చేశాడు. ఈ ఇద్దరినీ గంధకంతో మండుతున్న అగ్ని సరస్సులో ప్రాణాలతోనే పడవేశారు.

ప్రకటన గ్రంథం 19:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మిగిలిన వారు గుర్రం మీద కూర్చున్న వ్యక్తి నోటి నుండి వస్తున్న కత్తివాత పడి చచ్చిపోయారు. వారి మాంసాన్ని పక్షులు కడుపారా ఆరగించాయి.

Available Bible Translations

American Standard Version
Revelation 19 (ASV) »
King James Version
Revelation 19 (KJV) »
GOD’S WORD® (GW)
Revelation 19 (GW) »
World English Bible
Revelation 19 (WEB) »
Louis Segond 1910
Apocalypse 19 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
प्रकाशितवाक्य 19 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਪਰਕਾਸ਼ ਦੀ ਪੋਥੀ 19 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
पপ্রত্যাদেশ 19 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
வெளிப்படுத்தின விசேஷம் 19 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
प्रकटीकरण 19 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
પ્રકટીકરણ 19 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಪ್ರಕಟಣೆ 19 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
رُؤيا 19 (AVD) »
תנ ך עברי מודרני
ההתגלות 19 (HEB) »
Bíblia Sagrada Português
Apocalipse 19 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Khải Huyền 19 (VIE) »
Reina Valera Antigua
Apocalipsis 19 (RVA) »
圣 经 简体中文和合本
启 示 录 19 (CUVS) »
聖 經 繁體中文和合本
启 示 录 19 (CUVT) »
Bibla e Shenjtë
Zbulesa 19 (ALB) »
Библия на русском
Откровение 19 (RUSV) »
Українська Біблія
Об'явлення 19 (UKR) »
Szent Biblia - Magyar
Jelenések 19 (KAR) »
Българска Библия
Откровение 19 (BULG) »
Biblia Takatifu
Ufunuo 19 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Muujintii 19 (SOM) »
De Heilige Schrift
Openbaring 19 (NLD) »

ప్రకటన గ్రంథం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List