యెహెజ్కేలు Chapter 27 TELIRV Bible Verse Images

యెహెజ్కేలు 27 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share యెహెజ్కేలు 27 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


యెహెజ్కేలు 27:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా నాకు ఈ విషయం మళ్ళీ తెలియజేశాడు.

యెహెజ్కేలు 27:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నరపుత్రుడా, తూరు పట్టణం గురించి శోకగీతం మొదలు పెట్టి దానికిలా చెప్పు.

యెహెజ్కేలు 27:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సముద్రపు రేవుల మధ్య నువ్వు నివసిస్తున్నావు. అనేక తీరప్రాంతాల ప్రజలతో నువ్వు వ్యాపారం చేస్తున్నావు. యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, తూరూ “నేను అతిలోక సుందరిని” అని నువ్వనుకుంటున్నావు.

యెహెజ్కేలు 27:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ సరిహద్దులు సముద్రంలో ఉన్నాయి. నీ భవన నిర్మాతలు నీ అందాన్ని లోపరహితంగా చేశారు.

యెహెజ్కేలు 27:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ ఓడలను హెర్మోను పర్వత సరళ వృక్షం కలపతో కట్టారు. లెబానోను దేవదారు మ్రాను తెప్పించి నీ ఓడ దూలం చేశారు.

యెహెజ్కేలు 27:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బాషాను సింధూర చెక్కతో నీ తెడ్లు చేశారు. కుప్ర ద్వీపం నుంచి వచ్చిన కలపతో దంతపు పని పొదిగిన నీ ఓడ పైభాగం చేశారు.

యెహెజ్కేలు 27:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీకు జెండాలుగా ఉండడానికి నీ తెరచాపలు ఐగుప్తులో తయారై బుట్టా వేసిన శ్రేష్ఠమైన నారతో చేశారు!

యెహెజ్కేలు 27:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సీదోను నివాసులు, అర్వదు నివాసులు నీ తెడ్లు వేసేవాళ్ళు. నీ పౌరుల్లో ఆరితేరినవాళ్ళు నీకు ఓడ నాయకులుగా ఉన్నారు.

యెహెజ్కేలు 27:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బిబ్లోసుకు చెందిన నిపుణులు నీ ఓడలను బాగుచేసేవాళ్ళు. సముద్రంలో నీ సరకులు కొనడానికి సముద్ర ప్రయాణం చేసే నావికుల ఓడలన్నీ నీ రేవుల్లో ఉన్నాయి.

యెహెజ్కేలు 27:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పారసీక దేశస్థులు, లూదు వాళ్ళు, పూతు వాళ్ళు నీ సైన్యంలో చేరి నీకు సిపాయిలుగా ఉన్నారు. వాళ్ళు నీ డాళ్లనూ శిరస్త్రాణాలనూ నీలో వేలాడదీశారు. వాళ్ళు నీకు శోభ తెచ్చారు.

యెహెజ్కేలు 27:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అర్వదు వాళ్ళు, హెలెక్ వాళ్ళు, నీ సైన్యంలో చేరి అన్ని వైపులా నీ గోడల మీద ఉన్నారు. గమ్మాదు వాళ్ళు నీ ప్రాకారాల్లో ఉన్నారు. వీరంతా తమ డాళ్లు నీ గోడల మీద, చుట్టూ తగిలించారు. నీ సౌందర్యాన్ని లోపం లేనిదిగా చేశారు.

యెహెజ్కేలు 27:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రకరకాల సరకులు నీ దగ్గర చాలా ఎక్కువగా ఉండడం వలన తర్షీషు వాళ్ళు నీతో వ్యాపారం చేశారు. వెండి, ఇనుము, తగరం, సీసం ఇచ్చి నీ సరకులు కొన్నారు.

యెహెజ్కేలు 27:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యావాను, తుబాలు, మెషెకు ప్రాంతాలవాళ్ళు నీతో వ్యాపారం చేశారు. బానిసలనూ ఇత్తడి వస్తువులనూ ఇచ్చి నీ సరకులు కొన్నారు.

యెహెజ్కేలు 27:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బేత్ తోగర్మా వాళ్ళు గుర్రాలను యుద్ధాశ్వాలనూ కంచరగాడిదలనూ ఇచ్చి నీ సరకులు కొన్నారు.

యెహెజ్కేలు 27:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దదాను వాళ్ళు నీతో వ్యాపారం చేశారు. అనేక సముద్ర తీరాల ప్రజలు నీ సరుకులు కొన్నారు. వాళ్ళు దంతం, నల్లచేవ మాను తెచ్చి ఇచ్చారు.

యెహెజ్కేలు 27:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నువ్వు చేసిన వివిధ వస్తువులను కొనుక్కోడానికి సిరియనులు నీతో వ్యాపారం చేశారు. వాళ్ళు పచ్చలు, ఊదా రంగు, అద్దకం వేసిన బట్ట, నునుపైన బట్ట, ముత్యాలు, రత్నాలు ఇచ్చి నీ సరుకులు కొన్నారు.

యెహెజ్కేలు 27:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదావారూ ఇశ్రాయేలు వారూ నీతో వ్యాపారం చేశారు. మిన్నీతు నుంచి గోదుమలు, చిరు ధాన్యాలు, తేనె, నూనె, గుగ్గిలం తెచ్చి నీ సరుకులు కొన్నారు.

యెహెజ్కేలు 27:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దమస్కు వాళ్ళు హెల్బోను ద్రాక్షారసం, జహారు ప్రాంతం ఉన్ని తెచ్చి నీతో వ్యాపారం చేశారు.

యెహెజ్కేలు 27:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఉజ్జాలు నుంచి దాను, యావాను వాళ్ళు ఇనప పనిముట్లు, దాల్చిన చెక్క, వాము తెచ్చి నీ సరుకులు కొన్నారు.

యెహెజ్కేలు 27:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దెదాను వాళ్ళు గుర్రపు జీనుల కోసం వాడే బట్టలు తెచ్చి నీ సరుకులు కొన్నారు.

యెహెజ్కేలు 27:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అరేబియా వాళ్ళు, కేదారు నాయకులంతా నీతో వ్యాపారం చేశారు. వాళ్ళు గొర్రె పిల్లలను, పొట్టేళ్లను, మేకలను తెచ్చి నీ సరుకులు కొన్నారు.

యెహెజ్కేలు 27:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షేబ వ్యాపారులు రమా వ్యాపారులు నీతో వ్యాపారం చేశారు. వాళ్ళు అతి ప్రశస్తమైన గంధవర్గాలనూ విలువగల నానా విధమైన రత్నాలనూ బంగారాన్నీ ఇచ్చి నీ సరుకులు కొనుక్కుంటారు.

యెహెజ్కేలు 27:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హారాను వాళ్ళు, కన్నే వాళ్ళు, ఏదెను వాళ్ళు, షేబ వ్యాపారులు, అష్షూరు వ్యాపారులు, కిల్మదు వ్యాపారులు నీతో వ్యాపారం చేశారు.

యెహెజ్కేలు 27:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వీళ్ళు నీ బజారుల్లో అందమైన దుస్తులూ ఊదారంగు కుట్టుపనితో చేసిన బట్టలూ రంగు రంగుల తివాచీలు, గట్టిగా పేనిన తాళ్ళు తెచ్చి నీ సరుకులు కొన్నారు.

యెహెజ్కేలు 27:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తర్షీషు ఓడలు నీ సరుకులను వేర్వేరు స్థలాలకు తీసుకుపోయేవి. నువ్వు విస్తారమైన నీ సరుకులతో సముద్రం మధ్యలో కూర్చున్నావు.

యెహెజ్కేలు 27:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తెడ్లతో ఓడ నడిపేవాళ్ళు నిన్ను మహాసముద్రం లోకి తీసుకుపోయారు. అయితే తూర్పు గాలి సముద్ర మధ్యలో నీ మీద విరుచుకు పడింది.

యెహెజ్కేలు 27:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నువ్వు పతనమయ్యే రోజున నీ సంపద, నీ సరుకులు, నువ్వు మార్పిడి చేసుకునే వస్తువులు, నీ నావికులు, నీ ఓడ నాయకులు, నీ ఓడలు బాగు చేసే వాళ్ళు, నీతో వ్యాపారం చేసే వాళ్ళు, నీ సిపాయిలంతా, నీలో ఉన్న వాళ్ళంతా సముద్రం మధ్యలో మునిగిపోతారు.

యెహెజ్కేలు 27:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ ఓడ నాయకులు వేసిన కేకల వలన సముద్ర తీర పట్టణాలు కంపిస్తాయి.

యెహెజ్కేలు 27:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తెడ్లు పట్టుకునే వాళ్ళంతా తమ ఓడలనుంచి దిగిపోతారు. నావికులూ ఓడనాయకులూ ఒడ్డున నిలబడతారు.

యెహెజ్కేలు 27:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తమ స్వరం మీరు వినేలా చేసి, వెక్కి వెక్కి ఏడుస్తారు. తమ తలల మీద దుమ్ము పోసుకుని బూడిదలో పొర్లుతారు.

యెహెజ్కేలు 27:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీకోసం తమ తలలు బోడి చేసుకుని మొలకు గోనె పట్టా కట్టుకుని మనో వేదనతో నీ కోసం ఎంతో దుఖిస్తారు.

యెహెజ్కేలు 27:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాళ్ళు నీ గురించి శోకగీతం మొదలుపెట్టి నీమీద మృత్యు గీతాలు ఇలా ఆలపిస్తారు, తూరు లాంటి పట్టణం ఎక్కడుంది? ఇప్పుడు సముద్రంలో మునిగిపోయి మౌనంగా ఉండిపోయింది.

యెహెజ్కేలు 27:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సముద్రం మీద నీ సరుకులు తీసుకు పోతూ అది అనేకమందికి తృప్తినిచ్చింది. నీ గొప్ప సంపద, వ్యాపారంతో భూరాజులు ధనికులయ్యారు.

యెహెజ్కేలు 27:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే నువ్వు అగాధజలాల్లో మునిగి సముద్ర బలంతో బద్దలయ్యావు. నీ వ్యాపారం, నీ బలగమంతా మునిగిపోయింది.

యెహెజ్కేలు 27:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నిన్ను బట్టి సముద్ర తీరప్రాంత ప్రజలంతా నిర్ఘాంతపోయారు. వాళ్ళ రాజులు భయాందోళనతో వణికారు. వాళ్ళ ముఖాలు చిన్నబోయాయి.

యెహెజ్కేలు 27:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రజల్లోని వ్యాపారులు నిన్నుహేళన చేస్తారు. నువ్వు భయభ్రాంతులు చెందావు. నీవిక ఎంత మాత్రం ఉనికిలో ఉండవు.

Available Bible Translations

American Standard Version
Ezekiel 27 (ASV) »
King James Version
Ezekiel 27 (KJV) »
GOD’S WORD® (GW)
Ezekiel 27 (GW) »
World English Bible
Ezekiel 27 (WEB) »
Louis Segond 1910
Ézéchiel 27 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यहेजकेल 27 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਹਿਜ਼ਕੀਏਲ 27 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিহিষ্কেল 27 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எசேக்கியேல் 27 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यहेज्केल 27 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
હઝકિયેલ 27 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆಹೆಜ್ಕೇಲನು 27 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
حِزْقِيَال 27 (AVD) »
תנ ך עברי מודרני
יחזקאל 27 (HEB) »
Bíblia Sagrada Português
Ezequiel 27 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ê-xê-ki-ên 27 (VIE) »
Reina Valera Antigua
Ezequiel 27 (RVA) »
La Sacra Bibbia
Ezechiele 27 (RIV) »
圣 经 简体中文和合本
以 西 结 书 27 (CUVS) »
聖 經 繁體中文和合本
以 西 結 書 27 (CUVT) »
Bibla e Shenjtë
Ezekieli 27 (ALB) »
Svenska Bibeln 1917
Hesekiel 27 (SV1917) »
Библия на русском
Иезекииль 27 (RUSV) »
Українська Біблія
Єзекіїль 27 (UKR) »
Szent Biblia - Magyar
Ezékiel 27 (KAR) »
Българска Библия
Езекил 27 (BULG) »
Det Norsk Bibel
Esekiel 27 (NORSK) »
Kitaabka Quduuska Ah
Yexesqeel 27 (SOM) »
De Heilige Schrift
Ezechiël 27 (NLD) »
Dansk Bibel 1871
Ezekiel 27 (DA1871) »

యెహెజ్కేలు (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List