యెహెజ్కేలు Chapter 32 TELIRV Bible Verse Images

యెహెజ్కేలు 32 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share యెహెజ్కేలు 32 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


యెహెజ్కేలు 32:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బబులోను చెరలో ఉన్న కాలంలో, పన్నెండవ నెల మొదటి రోజు యెహోవా నాకీ విషయం తెలియచేశాడు.

యెహెజ్కేలు 32:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నరపుత్రుడా, ఐగుప్తురాజు ఫరో గురించి ఏడుపు పాట ఎత్తి అతనికి ఈ మాట చెప్పు. “రాజ్యాల్లో నువ్వు కొదమ సింహం వంటి వాడివి. నదిలో మొసలివంటి వాడివి. నీ కాళ్లతో నీళ్లు కలియబెడుతూ వాటిని బురదగా చేశావు.”

యెహెజ్కేలు 32:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, “నేను, నా వల నీ మీద వేస్తే వాళ్ళు నిన్ను నా వలలో నుంచి అనేక ప్రజల మధ్య బయటికి లాగుతారు.

యెహెజ్కేలు 32:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను నిన్ను నేల మీద పడేస్తాను. బయటి పొలంలో పారేస్తాను. గాలిలో ఎగిరే అన్ని రకాల పిట్టలు నీ మీద వాలేలా చేస్తాను. భూమి మీద ఉన్న అన్ని రకాల జంతువులు నీ మాంసాన్ని కడుపారా తింటాయి.

యెహెజ్కేలు 32:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ మాంసాన్ని పర్వతాల మీద వేస్తాను. పురుగులు పట్టిన నీ కళేబరంతో లోయలను నింపుతాను.

యెహెజ్కేలు 32:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ రక్తాన్ని పర్వతాల మీద పోస్తాను. వాగులు రక్తంతో నిండుతాయి.

యెహెజ్కేలు 32:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను నీ దీపాన్ని ఆర్పివేసినప్పుడు ఆకాశాన్ని మూసేసి, నక్షత్రాలను చీకటి చేస్తాను. సూర్యుణ్ణి మబ్బుతో కమ్ముతాను. చంద్రుడు వెన్నెల ఇవ్వడు.

యెహెజ్కేలు 32:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నిన్నుబట్టి ఆకాశంలో ప్రకాశించే జ్యోతులన్నిటినీ చీకటి చేస్తాను. నీ దేశం మీద చీకటి కమ్ముతుంది.” ఇదే యెహోవా ప్రభువు సందేశం.

యెహెజ్కేలు 32:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“నువ్వు ఎరగని దేశాల్లోకి నేను నిన్ను వెళ్లగొట్టి, నిన్ను నాశనం చేసేటప్పుడు అనేక మందికి కోపం పుట్టిస్తాను.

యెహెజ్కేలు 32:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా కత్తి రాజుల ఎదుట ఆడించేటప్పుడు నీ కారణంగా చాలామంది దిగ్భ్రాంతి చెందుతారు. నువ్వు పడిపోయే రోజున వాళ్ళంతా ఎడతెరిపి లేకుండా ప్రాణభయంతో వణకుతారు.”

యెహెజ్కేలు 32:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే “బబులోను రాజు కత్తి నీ మీదికి వస్తుంది!

యెహెజ్కేలు 32:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
శూరుల కత్తితో నేను నీ సేనను కూలుస్తాను. వాళ్ళలో ప్రతి శూరుడూ రాజ్యాలను వణికిస్తాడు. వాళ్ళు ఐగుప్తీయుల గర్వం అణచివేస్తారు. దాని సైన్యాన్నంతా నాశనం చేస్తారు.

యెహెజ్కేలు 32:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సమృద్ధిగా ఉన్న నీళ్ల దగ్గరున్న పశువులన్నిటినీ నేను నాశనం చేస్తాను. ప్రజల కాళ్ళు గానీ పశువుల కాళ్ళు గానీ ఆ నీటిని కదిలించలేవు.

యెహెజ్కేలు 32:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు నేను వాటి నీళ్లు ఆపి, నూనె పారేలా వాళ్ళ నదులు పారేలా చేస్తాను.” ఇదే యెహోవా ప్రభువు సందేశం.

యెహెజ్కేలు 32:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“నేను ఐగుప్తు దేశాన్ని పాడు చేసి అందులో ఉన్నదంతా నాశనం చేసి దాని నివాసులందరినీ నిర్మూలం చేస్తుంటే నేను యెహోవానని వాళ్ళు తెలుసుకుంటారు.

యెహెజ్కేలు 32:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇది శోకగీతం. రాజ్యాల కూతుర్లు ఈ పాట ఎత్తి పాడతారు. వాళ్ళు ఐగుప్తు మీదా, దాని సమూహమంతటి మీదా ఆ పాట పాడతారు. ఇదే యెహోవా ప్రభువు సందేశం.

యెహెజ్కేలు 32:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పన్నెండవ సంవత్సరం అదే నెల పదిహేనవ రోజు యెహోవా నాకు ఈ విషయం తెలియచేశాడు.

యెహెజ్కేలు 32:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నరపుత్రుడా, ఐగుప్తీయుల సమూహం గురించి విలపించు. భూమి కిందికి పాతాళానికి దిగిపోయిన వాళ్ళ దగ్గరికి, ఆమెనూ గొప్ప రాజ్యాల కూతుళ్ళనూ తోసి వెయ్యి.

యెహెజ్కేలు 32:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాళ్ళతో ఇలా అను, ‘మిగతావాళ్ళకంటే నువ్వు నిజంగా అందగత్తెవా? సున్నతిలేని వాళ్ళ దగ్గరికి దిగి వెళ్లి పడుకో’

యెహెజ్కేలు 32:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కత్తితో చచ్చిన వాళ్ళతోబాటు వాళ్ళు కూలుతారు. అది కత్తిపాలవుతుంది. ఆమె విరోధులు ఆమెనూ ఆమె సేవకులనూ ఈడ్చుకుపోతారు.

యెహెజ్కేలు 32:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పాతాళంలోని గొప్ప యోధులు ఐగుప్తు గురించీ దాని మిత్రుల గురించీ ఇలా చెబుతారు, ‘వీళ్లిక్కడికి దిగి వచ్చేశారు! కత్తితో చచ్చిన సున్నతిలేని వాళ్ళ దగ్గర వీరు పడుకుంటారు’

యెహెజ్కేలు 32:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అష్షూరు, దాని గుంపంతా అక్కడే ఉంది! దాని చుట్టూ వాళ్ళ సమాధులున్నాయి. వాళ్ళంతా కత్తితో చచ్చారు.

యెహెజ్కేలు 32:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దాని సమాధులు పాతాళాగాధంలో ఉన్నాయి. దాని గుంపులు దాని సమాధి చుట్టూ ఉన్నాయి. వాళ్ళంతా సజీవుల లోకంలో ఉగ్రత తెచ్చిన వాళ్ళు. వాళ్ళంతా కత్తితో చచ్చిన వాళ్ళు.

యెహెజ్కేలు 32:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏలాము, దాని గుంపంతా అక్కడే ఉంది! దాని చుట్టూ వాళ్ళ సమాధులున్నాయి. వాళ్ళంతా కత్తితో చచ్చారు. వాళ్ళంతా సజీవుల లోకంలో ఉగ్రత తెచ్చిన వాళ్ళు. వాళ్ళు సున్నతి లేకుండా పాతాళంలోకి దిగిపోయారు. వాళ్ళు సిగ్గు పాలవుతారు.

యెహెజ్కేలు 32:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చచ్చిన వాళ్ళ మధ్య దానికీ దాని సమూహానికీ ఒక పరుపు సిద్ధం చేశారు. దాని చుట్టూ వాళ్ళ సమాధులున్నాయి. వాళ్ళంతా సున్నతి లేకుండా చచ్చారు. వాళ్ళు సజీవుల లోకంలో ఉగ్రత తెచ్చినవాళ్ళు. పాతాళం లోకి దిగిపోయిన వాళ్ళతో పాటు వాళ్ళు కూడా సిగ్గు పాలవుతారు. చచ్చిన వాళ్ళ మధ్య ఏలాము ఉంది.

యెహెజ్కేలు 32:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అక్కడ మెషెకు తుబాలు దాని గుంపంతా ఉన్నాయి. దాని సమాధులు దాని చుట్టూ ఉన్నాయి. వాళ్ళంతా సున్నతి లేని వాళ్ళు. వాళ్ళు సజీవుల లోకంలో ఉగ్రత తెచ్చిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు కత్తిపాలయ్యారు.

యెహెజ్కేలు 32:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వీళ్ళు సున్నతి లేని వాళ్ళలో పడిపోయిన శూరుల దగ్గర పడుకోరు. వాళ్ళు తమ యుద్ధాయుధాలన్నిటితో పాతాళంలోకి దిగిపోయి, తమ కత్తులను తమ తలల కింద ఉంచుకుని పడుకుంటారు. తమ డాళ్ళను తమతో ఉంచుకుంటారు. వాళ్ళు సజీవుల లోకంలో ఉగ్రత తెచ్చినవాళ్ళు.

యెహెజ్కేలు 32:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి, ఐగుప్తు, నువ్వు సున్నతి లేని వాళ్ళ మధ్య నాశనమై, కత్తి పాలైన వాళ్ళ దగ్గర పడుకుంటావు.

యెహెజ్కేలు 32:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అక్కడ ఎదోము, దాని రాజులు దాని అధిపతులంతా ఉన్నారు. వాళ్ళు పరాక్రమవంతులైనా కత్తి పాలైన వాళ్ళ దగ్గర ఉన్నారు. సున్నతి లేని వాళ్ళ దగ్గర పాతాళంలోకి దిగిపోయిన వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా పడుకున్నారు.

యెహెజ్కేలు 32:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అక్కడ ఉత్తర దేశపు అధిపతులంతా, చచ్చిన వాళ్ళతో దిగిపోయిన సీదోనీయులంతా ఉన్నారు. వాళ్ళు పరాక్రమవంతులై భయం పుట్టించినా సిగ్గు పాలయ్యారు. సున్నతి లేకుండా కత్తి పాలైన వాళ్ళ మధ్య పడుకున్నారు. గోతిలోకి దిగిపోయిన వాళ్ళతో పాటు సిగ్గుపాలయ్యారు.

యెహెజ్కేలు 32:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కత్తి పాలైన ఫరో, అతని వాళ్ళంతా వాళ్ళను చూచి తమ సమూహమంతటిని గురించి ఓదార్పు తెచ్చుకుంటారు.” ఇదే యెహోవా ప్రభువు సందేశం.

యెహెజ్కేలు 32:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“సజీవుల లోకంలో వాళ్ళతో నేను ఉగ్రత తెప్పించాను. అయితే సున్నతి లేనివాళ్ళతో కత్తి పాలైనవాళ్ళతో పడుకుంటారు.” ఇదే యెహోవా ప్రభువు సందేశం.

Available Bible Translations

American Standard Version
Ezekiel 32 (ASV) »
King James Version
Ezekiel 32 (KJV) »
GOD’S WORD® (GW)
Ezekiel 32 (GW) »
World English Bible
Ezekiel 32 (WEB) »
Louis Segond 1910
Ézéchiel 32 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यहेजकेल 32 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਹਿਜ਼ਕੀਏਲ 32 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিহিষ্কেল 32 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எசேக்கியேல் 32 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यहेज्केल 32 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
હઝકિયેલ 32 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆಹೆಜ್ಕೇಲನು 32 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
حِزْقِيَال 32 (AVD) »
תנ ך עברי מודרני
יחזקאל 32 (HEB) »
Bíblia Sagrada Português
Ezequiel 32 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ê-xê-ki-ên 32 (VIE) »
Reina Valera Antigua
Ezequiel 32 (RVA) »
La Sacra Bibbia
Ezechiele 32 (RIV) »
圣 经 简体中文和合本
以 西 结 书 32 (CUVS) »
聖 經 繁體中文和合本
以 西 結 書 32 (CUVT) »
Bibla e Shenjtë
Ezekieli 32 (ALB) »
Svenska Bibeln 1917
Hesekiel 32 (SV1917) »
Библия на русском
Иезекииль 32 (RUSV) »
Українська Біблія
Єзекіїль 32 (UKR) »
Szent Biblia - Magyar
Ezékiel 32 (KAR) »
Българска Библия
Езекил 32 (BULG) »
Det Norsk Bibel
Esekiel 32 (NORSK) »
Kitaabka Quduuska Ah
Yexesqeel 32 (SOM) »
De Heilige Schrift
Ezechiël 32 (NLD) »
Dansk Bibel 1871
Ezekiel 32 (DA1871) »

యెహెజ్కేలు (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List