యెహెజ్కేలు Chapter 7 TELIRV Bible Verse Images

యెహెజ్కేలు 7 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share యెహెజ్కేలు 7 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


యెహెజ్కేలు 7:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా వాక్కు నా దగ్గరికి వచ్చింది. ఆయన నాకు ఇలా చెప్పాడు.

యెహెజ్కేలు 7:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“నరపుత్రుడా, ప్రభువైన యెహోవా ఇశ్రాయేలు దేశానికిలా ప్రకటిస్తున్నాడు. అంతం! ఇశ్రాయేలు దేశం నాలుగు సరిహద్దులకు అంతం వచ్చేసింది.

యెహెజ్కేలు 7:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇప్పుడు అంతం మీ పైకి వచ్చింది. ఎందుకంటే నా తీవ్ర కోపాన్ని మీ పైకి పంపుతున్నాను. మీ ప్రవర్తనను బట్టి మీకు తీర్పు తీరుస్తాను. తరువాత అసహ్యకరమైన మీ పనుల ఫలితాన్ని మీపైకి పంపుతాను.

యెహెజ్కేలు 7:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా దృష్టిలో మీ పట్ల ఎలాంటి కనికరమూ చూపను. నేనే యెహోవాను అని మీకు తెలిసే విధంగా నీచమైన వాటిని మీ మధ్యే ఉండనిస్తాను!

యెహెజ్కేలు 7:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. వినాశనం! వినాశనం వెనుకే మరో వినాశనం. చూడండి! అది వచ్చేస్తూ ఉంది.

యెహెజ్కేలు 7:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అంతం వచ్చేస్తూ ఉంది. అంతం నీకు విరోధంగా కళ్ళు తెరిచింది. చూడండి. అది వచ్చేస్తూ ఉంది.

యెహెజ్కేలు 7:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేశవాసులారా, మీ నాశనం మిమ్మల్ని సమీపిస్తుంది. సమయం వచ్చేసింది. నాశన దినం దగ్గరలోనే ఉంది. పర్వతాలు ఇకమీదట ఆనందంగా ఉండవు.

యెహెజ్కేలు 7:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
త్వరలోనే నా క్రోధాన్ని మీమీద కుమ్మరించబోతున్నాను. నా తీవ్రమైన కోపాన్ని మీమీద చూపించ బోతున్నాను. మీ ప్రవర్తనను బట్టి మీకు శిక్ష విధిస్తాను. మీ నీచమైన పనుల ఫలాన్ని మీ పైకి తీసుకు వస్తాను.

యెహెజ్కేలు 7:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నాకు మీ పట్ల కనికరం లేదు. నేను మిమ్మల్ని వదలను. మీరు చేసినట్టే నేనూ మీకు చేస్తాను. మిమ్మల్ని శిక్షించే యెహోవాను నేనే అని మీకు తెలిసే విధంగా నీచమైన వాటిని మీ మధ్యే ఉండనిస్తాను!

యెహెజ్కేలు 7:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చూడండి! ఆ రోజు వచ్చేస్తుంది. నాశనం బయలు దేరింది. ఆ దండం పుట్టింది. దానికి గర్వం వికసించింది.

యెహెజ్కేలు 7:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బలాత్కారం ప్రారంభం అయి దుర్మార్గులను శిక్షించే దండం అయింది. వాళ్ళలో గానీ, వాళ్ళ మూకలో గానీ ఎవరూ మిగలరు. వాళ్ళ సంపదలో గానీ, వాళ్ళ ప్రాముఖ్యతలో గానీ ఏదీ మిగలదు.

యెహెజ్కేలు 7:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ సమయం వచ్చేస్తుంది. ఆ రోజు దగ్గర పడింది. నా కోపం ప్రజలందరి పైనా ఉంది కనుక కొనేవాడు సంతోషించకూడదు.

యెహెజ్కేలు 7:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అమ్మినవాడు వాళ్ళు బ్రతికి ఉన్నంత కాలం తాను అమ్మిన భూమికి తిరిగి రాడు. ఎందుకంటే ఈ దర్శనం ప్రజలందరికీ విరోధంగా ఉంది. పాపంలో నివసించే ఏ మనిషీ ధైర్యంగా తన ప్రాణాన్ని దక్కించుకోలేడు. అందుకే వాళ్ళెవ్వరూ తిరిగిరారు.

యెహెజ్కేలు 7:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాళ్ళు సర్వసన్నద్ధులై బాకా ఊదారు. కానీ యుద్ధానికి బయల్దేరే వాడు ఎవడూ లేడు.

యెహెజ్కేలు 7:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఖడ్గం బయట ఉంది. లోపలేమో కరవూ, తెగులూ ఉన్నాయి. బయట ఉన్నవాళ్ళు ఖడ్గం వాతపడతారు. పట్టణంలో ఉన్నవాళ్ళని కరవూ, తెగులూ మింగివేస్తాయి.

యెహెజ్కేలు 7:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే వాళ్ళలో కొంతమంది తప్పించుకుని పర్వతాల పైకి పారిపోతారు. వాళ్ళు అందరూ లోయలో ఉండే గువ్వల్లాగా మూలుగుతారు.

యెహెజ్కేలు 7:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాళ్ళందరి చేతులూ తడబడతాయి. మోకాళ్ళు నీళ్ళలా బలహీనం అవుతాయి.

యెహెజ్కేలు 7:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు గోనెపట్ట ధరిస్తారు. తీవ్రమైన భయం వాళ్ళని కమ్ముకుంటుంది. ప్రతి ఒక్కరి ముఖం పైనా అవమానం ఉంటుంది. బోడితనం వాళ్ళ తలల మీద కనిపిస్తుంది.

యెహెజ్కేలు 7:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాళ్ళు తమ దగ్గర ఉన్న వెండిని వీధుల్లో పారేస్తారు. బంగారం వాళ్లకి వ్యర్ధపదార్ధంలా ఉంటుంది. యెహోవా కోప దినాన వెండిబంగారాలు వాళ్ళను కాపాడలేవు. వాళ్ళ దోషం పెను ఆటంకంగా ఉంటుంది గనక వాళ్ళ జీవితాలకు రక్షణ ఉండదు. వాళ్ళ కడుపులకు పోషణ ఉండదు.

యెహెజ్కేలు 7:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాళ్ళు అహంకరించి రత్నభరితమైన ఆభరణాలు చేయించారు. అవి వాళ్ళ నీచమైన పనులను వర్ణించే విగ్రహ ఆకారాలుగా ఏర్పడ్డాయి. వాటితో వాళ్ళు అసహ్యకరమైన తమ పనులను సాగించారు. కాబట్టి ఆ ఆభరణాలు వాళ్లకి అసహ్యం పుట్టేలా నేను చేస్తాను.

యెహెజ్కేలు 7:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాటిని ఇతర దేశస్తుల చేతికి అప్పగిస్తాను. దుర్మార్గుల చేతికి దోపిడీ సొమ్ముగా ఇస్తాను. వాళ్ళు వాటిని అపవిత్రం చేస్తారు.

యెహెజ్కేలు 7:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాళ్ళు నా ఖజానాను అపవిత్రం చేస్తుంటే చూడకుండా నా ముఖం తిప్పుకుంటాను. బందిపోట్లు దానిలో ప్రవేశించి దాన్ని అపవిత్రం చేస్తారు.

యెహెజ్కేలు 7:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తీర్పుని బట్టి దేశం రక్తంతోనూ, పట్టణం హింసతోనూ నిండిపోయింది. అందుకే సంకెళ్ళు సిద్ధం చేయండి.

యెహెజ్కేలు 7:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జాతుల్లోకెల్లా అత్యంత దుర్మార్గమైన జాతిని నేను పంపుతాను. వాళ్ళు వచ్చి ఇళ్ళను స్వాధీనం చేసుకుంటారు. వాళ్ళ పవిత్ర స్థలాలను అపవిత్రం చేసి బలశూరుల అహంకారానికి స్వస్తి చెపుతాను!

యెహెజ్కేలు 7:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
భయం కలుగుతుంది! వాళ్ళు శాంతిని వాంచిస్తారు కానీ అది వారికి దొరకదు.

యెహెజ్కేలు 7:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నాశనం తరువాత నాశనం కలుగుతుంది. పుకార్ల తరువాత పుకార్లు పుట్టుకొస్తాయి. వాళ్ళు ప్రవక్తల దగ్గరికి దర్శనం కోసం వెళ్తారు. యాజకులకు ధర్మశాస్త్ర జ్ఞానం లేకుండా పోతుంది. సలహా ఇచ్చే పెద్దలకు తెలివి ఉండదు.

యెహెజ్కేలు 7:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రాజు విచారంగా ఉంటాడు. యువరాజు నిస్పృహలో సామాన్య వస్త్రాలు ధరిస్తాడు. దేశ ప్రజల చేతులు భయంతో వణకుతాయి. వాళ్ళ విధానంలోనే నేను వాళ్లకి ఇలా చేస్తాను. నేనే యెహోవానని వాళ్ళు తెలుసుకునే వరకూ వాళ్ళ ప్రమాణాలను బట్టే వాళ్ళకి తీర్పు తీరుస్తాను.”

Available Bible Translations

American Standard Version
Ezekiel 7 (ASV) »
King James Version
Ezekiel 7 (KJV) »
GOD’S WORD® (GW)
Ezekiel 7 (GW) »
World English Bible
Ezekiel 7 (WEB) »
Louis Segond 1910
Ézéchiel 7 (LSG) »
Luther Bibel 1912
Hesekiel 7 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यहेजकेल 7 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਹਿਜ਼ਕੀਏਲ 7 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিহিষ্কেল 7 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எசேக்கியேல் 7 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यहेज्केल 7 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
હઝકિયેલ 7 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆಹೆಜ್ಕೇಲನು 7 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
حِزْقِيَال 7 (AVD) »
תנ ך עברי מודרני
יחזקאל 7 (HEB) »
Bíblia Sagrada Português
Ezequiel 7 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ê-xê-ki-ên 7 (VIE) »
Reina Valera Antigua
Ezequiel 7 (RVA) »
La Sacra Bibbia
Ezechiele 7 (RIV) »
圣 经 简体中文和合本
以 西 结 书 7 (CUVS) »
聖 經 繁體中文和合本
以 西 結 書 7 (CUVT) »
Bibla e Shenjtë
Ezekieli 7 (ALB) »
Svenska Bibeln 1917
Hesekiel 7 (SV1917) »
Библия на русском
Иезекииль 7 (RUSV) »
Українська Біблія
Єзекіїль 7 (UKR) »
Szent Biblia - Magyar
Ezékiel 7 (KAR) »
Българска Библия
Езекил 7 (BULG) »
Det Norsk Bibel
Esekiel 7 (NORSK) »
Kitaabka Quduuska Ah
Yexesqeel 7 (SOM) »
De Heilige Schrift
Ezechiël 7 (NLD) »
Dansk Bibel 1871
Ezekiel 7 (DA1871) »

యెహెజ్కేలు (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List