మత్తయి Chapter 10 TELIRV Bible Verse Images

మత్తయి 10 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share మత్తయి 10 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


మత్తయి 10:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి, అన్నిరకాల రోగాలనూ వ్యాధులనూ బాగుచేయడానికి వారికి అధికారం ఇచ్చాడు.

మత్తయి 10:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ పన్నెండు మంది అపొస్తలుల పేర్లు ఇవి. మొట్ట మొదటిగా పేతురు అనే సీమోను, అతని సోదరుడు అంద్రెయ, జెబెదయి కొడుకు యాకోబు, అతని సోదరుడు యోహాను.

మత్తయి 10:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఫిలిప్పు, బర్తొలొమయి, తోమా, సుంకరి మత్తయి, అల్ఫయి కొడుకు యాకోబు, తద్దయి,

మత్తయి 10:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కనానీయుడు సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా.

మత్తయి 10:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యేసు ఆ పన్నెండు మందిని పంపుతూ వారికి ఆజ్ఞాపించింది ఏమిటంటే, “మీరు యూదేతరుల ప్రాంతాల్లోకి వెళ్ళొద్దు. సమరయ ప్రాంతంలోని ఏ ఊరిలోకీ వెళ్ళొద్దు.

మత్తయి 10:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలు వంశంలో దారి తప్పిన గొర్రెల దగ్గరకే వెళ్ళండి.

మత్తయి 10:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వెళుతూ, ‘పరలోకరాజ్యం దగ్గర్లో ఉంది’ అని ప్రకటించండి.

మత్తయి 10:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రోగులను బాగుచేయండి, చనిపోయిన వారిని లేపండి, కుష్టురోగులను శుద్ధి చెయ్యండి, దయ్యాలను వెళ్ళగొట్టండి. ఉచితంగా పొందారు, ఉచితంగానే ఇవ్వండి.

మత్తయి 10:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బంగారం, వెండి, ఇత్తడి, ప్రయాణం కోసం పెట్టె, రెండు అంగీలు, చెప్పులు, చేతికర్ర, ఇవేవీ మీ సంచిలో ఉంచుకోవద్దు. ఎందుకంటే పనివాడు తన ఆహారానికి అర్హుడు.

మత్తయి 10:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బంగారం, వెండి, ఇత్తడి, ప్రయాణం కోసం పెట్టె, రెండు అంగీలు, చెప్పులు, చేతికర్ర, ఇవేవీ మీ సంచిలో ఉంచుకోవద్దు. ఎందుకంటే పనివాడు తన ఆహారానికి అర్హుడు.

మత్తయి 10:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు ఏదైనా పట్టణంలో లేదా ఊరిలో ప్రవేశించినప్పుడు దానిలో యోగ్యులెవరో అడిగి తెలుసుకోండి. అక్కడ నుండి వెళ్ళే వరకూ అతని ఇంట్లోనే అతిథిగా ఉండిపొండి.

మత్తయి 10:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ ఇంట్లో ప్రవేశిస్తూ ఇంటివారికి శుభం పలకండి.

మత్తయి 10:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ శాంతి దాని పైకి వస్తుంది. దానిలో యోగ్యత లేకపోతే మీ శాంతి మీకు తిరిగి వచ్చేస్తుంది.

మత్తయి 10:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే మీ మాటలు వినకపోతే మీరు ఆ ఇంటిని గానీ ఆ ఊరిని గానీ, విడిచి వెళ్ళిపోయేటపుడు మీ పాదధూళి దులిపి వేయండి.

మత్తయి 10:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తీర్పు దినాన ఆ పట్టణానికి పట్టే గతి కంటే సొదొమ గొమొర్రా నగరాల గతి నయంగా ఉంటుందని మీతో కచ్చితంగా చెబుతున్నాను.

మత్తయి 10:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను. కాబట్టి పాముల్లాగా వివేకంగా, పావురాల్లాగా కపటం లేకుండా ఉండండి.

మత్తయి 10:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనుషుల గురించి జాగ్రత్తగా ఉండండి. వారు మిమ్మల్ని న్యాయస్థానాలకు అప్పగించి, తమ సమాజ మందిరాల్లో మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తారు.

మత్తయి 10:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వీరికీ యూదేతరులకూ సాక్షార్థంగా నాకోసం మిమ్మల్ని అధిపతుల దగ్గరకీ రాజుల దగ్గరకీ తెస్తారు.

మత్తయి 10:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు మిమ్మల్ని అప్పగించేటపుడు, ‘ఎలా మాట్లాడాలి? ఏమి చెప్పాలి?’ అని ఆందోళన పడవద్దు. మీరేమి చెప్పాలో అది ఆ సమయంలోనే దేవుడు మీకు తెలియజేస్తాడు.

మత్తయి 10:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మాట్లాడేది మీరు కాదు, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడతాడు.

మత్తయి 10:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సోదరుడు సోదరుణ్ణి, తండ్రి కొడుకునూ చావుకు అప్పగిస్తారు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపిస్తారు.

మత్తయి 10:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా నామాన్ని బట్టి అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు. చివరి వరకూ సహించే వారిని దేవుడు రక్షిస్తాడు.

మత్తయి 10:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసిస్తుంటే వేరే పట్టణానికి పారిపొండి. మనుష్య కుమారుడు వచ్చేలోగా మీరు ఇశ్రాయేలు పట్టణాలు అన్నిటికీ వెళ్ళి ఉండరు అని మీతో కచ్చితంగా చెబుతున్నాను.

మత్తయి 10:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గురువు కంటే శిష్యుడూ యజమాని కంటే పనివాడూ గొప్పవారేమీ కాదు.

మత్తయి 10:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
శిష్యుడు తన గురువు లాగా, పనివాడు తన యజమానిలాగా ఉంటే చాలు. ఇంటి యజమానికి బయెల్జెబూలు అని వారు పేరు పెట్టి ఉంటే అతని ఇంటివారిని మరి ఇంకెంతగా అంటారు గదా!

మత్తయి 10:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి మీరు వారికి భయపడవద్దు. కప్పిపెట్టింది ఏదీ బట్టబయలు కాకుండా ఉండదు. రహస్యంగా ఉంచింది ఏదీ తెలియకుండా ఉండదు.

మత్తయి 10:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీతో నేను చీకట్లో చెప్పేది వెలుగులో చెప్పండి. మీ చెవిలో వినిపించేది మేడలమీద చాటించండి.

మత్తయి 10:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“ఆత్మను చంపలేక శరీరాన్నే చంపేవారికి భయపడవద్దు. ఆత్మనూ శరీరాన్నీ నరకంలో పడేసి నాశనం చేయగల వాడికే భయపడండి.

మత్తయి 10:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రెండు పిచ్చుకలు ఒక చిన్న నాణేనికి అమ్ముడవుతాయి గదా. అయినా మీ తండ్రి అనుమతి లేకుండా వాటిలో ఒకటి కూడా నేల కూలదు.

మత్తయి 10:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ తల వెంట్రుకలెన్నో ఆ లెక్క ఆయనకు తెలుసు.

మత్తయి 10:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి భయపడవద్దు. మీరు అనేక పిచ్చుకల కంటే ఎంతో విలువైన వారు.

మత్తయి 10:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనుషుల ముందు నన్ను ఒప్పుకొనే వాణ్ణి పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు నేనూ ఒప్పుకుంటాను.

మత్తయి 10:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రజల ముందు ఎవడు నన్ను తెలియదంటాడో వాణ్ణి పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు నేనూ తెలియదంటాను.

మత్తయి 10:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“నేను భూమి మీదికి శాంతి తేవడానికి వచ్చాననుకోవద్దు. కత్తిని తేవడానికే వచ్చాను గానీ శాంతిని కాదు.

మత్తయి 10:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అంటే ఒక మనిషికి అతని తండ్రితో, కూతురికి తన తల్లితో, కోడలికి తన అత్తతో విరోధం కలిగించడానికే వచ్చాను.

మత్తయి 10:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒక వ్యక్తి స్వంత ఇంటివాళ్ళే అతనికి శత్రువులుగా తయారవుతారు.

మత్తయి 10:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా కంటే ఎక్కువగా తండ్రినిగానీ తల్లినిగానీ ప్రేమించే వాడు నాకు తగినవాడు కాడు. అలాగే నాకంటే ఎక్కువగా కొడుకునుగానీ కూతురునుగానీ ప్రేమించేవాడు నాకు తగినవాడు కాడు.

మత్తయి 10:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన సిలువను భుజాన వేసుకుని నావెంట రాని వాడు నాకు తగినవాడు కాడు.

మత్తయి 10:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన ప్రాణం దక్కించుకొనేవాడు దాన్ని పోగొట్టుకొంటాడు. నా కోసం తన ప్రాణం పోగొట్టుకొనేవాడు దాన్ని దక్కించుకుంటాడు.

మత్తయి 10:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మిమ్మల్ని చేర్చుకొనేవాడు నన్ను చేర్చుకొంటాడు. నన్ను చేర్చుకొనేవాడు నన్ను పంపిన ఆయనను చేర్చుకొంటాడు.

మత్తయి 10:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రవక్త అని ఒక ప్రవక్తను చేర్చుకొనేవాడు ప్రవక్తకు దక్కే ప్రతిఫలం పొందుతాడు. నీతిమంతుడని ఒక నీతిమంతుణ్ణి చేర్చుకొనేవాడు నీతిమంతుని ప్రతిఫలం పొందుతాడు.

మత్తయి 10:42 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
శిష్యుడని గౌరవించి ఎవరైతే ఈ సాధారణ వ్యక్తుల్లో ఎవరికైనా గిన్నెడు చన్నీళ్ళు తాగడానికి ఇస్తాడో అతడు తన ప్రతిఫలం పోగొట్టుకోడని కచ్చితంగా చెబుతున్నాను.”

Available Bible Translations

American Standard Version
Matthew 10 (ASV) »
King James Version
Matthew 10 (KJV) »
GOD’S WORD® (GW)
Matthew 10 (GW) »
World English Bible
Matthew 10 (WEB) »
Louis Segond 1910
Matthieu 10 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
मत्ती 10 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਮੱਤੀ 10 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
মথি 10 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
மத்தேயு 10 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
मत्तय 10 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
માથ્થી 10 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಮತ್ತಾಯನು 10 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
مَتَّى 10 (AVD) »
תנ ך עברי מודרני
הבשורה על־פי מתי 10 (HEB) »
Bíblia Sagrada Português
Mateus 10 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ma-thi-ơ 10 (VIE) »
Reina Valera Antigua
Mateo 10 (RVA) »
La Sacra Bibbia
Matteo 10 (RIV) »
圣 经 简体中文和合本
马 太 福 音 10 (CUVS) »
聖 經 繁體中文和合本
馬 太 福 音 10 (CUVT) »
Bibla e Shenjtë
Mateu 10 (ALB) »
Svenska Bibeln 1917
Matteus 10 (SV1917) »
Библия на русском
Матфея 10 (RUSV) »
Українська Біблія
Матвія 10 (UKR) »
Szent Biblia - Magyar
Máté 10 (KAR) »
Българска Библия
Матей 10 (BULG) »
Det Norsk Bibel
Matteus 10 (NORSK) »
Kitaabka Quduuska Ah
Matayos 10 (SOM) »
De Heilige Schrift
Mattheüs 10 (NLD) »

మత్తయి (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List