మత్తయి Chapter 27 TELIRV Bible Verse Images

మత్తయి 27 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share మత్తయి 27 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


మత్తయి 27:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తెల్లవారింది. ముఖ్య యాజకులు, ప్రజల పెద్దలందరు యేసును చంపించాలని ఆయనపై కుట్ర చేశారు.

మత్తయి 27:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయనను బంధించి, తీసుకెళ్ళి రోమ్ గవర్నర్ పిలాతుకు అప్పగించారు.

మత్తయి 27:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ఆయనను వారికి పట్టించి ఇచ్చిన యూదా, వారు ఆయనకు శిక్ష విధించడం చూసి పశ్చాత్తాపపడి, ఆ ముప్ఫై వెండి నాణాలు ప్రధాన యాజకుల, పెద్దల దగ్గరికి తీసుకొచ్చి,

మత్తయి 27:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“నేను నిరపరాధి రక్తాన్ని మీకు అప్పగించి పాపం చేశాను” అని చెప్పాడు. అందుకు వారు, “ఐతే మాకేంటి? దాని సంగతి నువ్వే చూసుకో” అని చెప్పారు.

మత్తయి 27:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడతడు ఆ వెండి నాణాలు దేవాలయంలో విసిరేసి, వెళ్ళి ఉరి వేసుకున్నాడు.

మత్తయి 27:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ముఖ్య యాజకులు ఆ వెండి నాణాలు తీసుకుని “ఇది రక్తం కొన్న డబ్బు. కాబట్టి దీన్ని కానుక పెట్టెలో వేయడం ధర్మశాస్త్ర విరుద్ధం” అని చెప్పుకున్నారు.

మత్తయి 27:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు ఆలోచించి ఆ సొమ్ముతో పరదేశులను పాతిపెట్టడం కోసం ఒక కుమ్మరి వాడి పొలం కున్నారు.

మత్తయి 27:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ పొలాన్ని నేటివరకూ “రక్త పొలం” అని పిలుస్తున్నారు.

మత్తయి 27:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దీనితో, “ఇశ్రాయేలు ప్రజలు ఆయనకు కట్టిన వెల, క్రయధనం ముప్ఫై వెండి నాణాలు.

మత్తయి 27:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు ప్రభువు నాకు నియమించిన ప్రకారం కుమ్మరి వాడి పొలం కోసం ఇచ్చారు” అని దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా చెప్పిన మాట నెరవేరింది.

మత్తయి 27:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యేసు పిలాతు ఎదుట నిలబడ్డాడు. అప్పుడు పిలాతు, “నీవు యూదుల రాజువా?” అని ఆయనను అడిగాడు. యేసు, “నీవే అంటున్నావు గదా” అన్నాడు.

మత్తయి 27:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ముఖ్య యాజకులు, పెద్దలు ఆయన మీద నేరాలు మోపుతున్నప్పుడు ఆయన వాటికి ఏమీ జవాబు చెప్పలేదు.

మత్తయి 27:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి పిలాతు, “నీ మీద వీరు ఎన్ని నేరాలు మోపుతున్నారో నీవు వినడం లేదా?” అని ఆయనను అడిగాడు.

మత్తయి 27:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే ఆయన ఒక్క మాటకైనా అతనికి జవాబు చెప్పకపోవడం పిలాతుకి చాలా ఆశ్చర్యం కలిగించింది.

మత్తయి 27:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ పండగలో ప్రజలు కోరుకొనే ఒక ఖైదీని విడుదల చేయడం గవర్నరుకు వాడుక.

మత్తయి 27:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ కాలంలో బరబ్బా అనే పేరు మోసిన ఒక బందిపోటు చెరసాలలో ఉన్నాడు.

మత్తయి 27:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి ప్రజలు తన దగ్గరికి వచ్చినప్పుడు పిలాతు వారిని ఇలా అడిగాడు, “నేను మీకు ఎవరిని విడుదల చేయాలి? బరబ్బనా లేక క్రీస్తు అని పిలిచే యేసునా?”

మత్తయి 27:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే వారు కేవలం అసూయతోనే ఆయనను అప్పగించారని అతనికి తెలుసు.

మత్తయి 27:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు అతని భార్య, “నీవు ఆ నిర్దోషి జోలికి పోవద్దు. ఈ రోజు నేను ఆయన గురించి కలలో బహు బాధపడ్డాను” అని అతనికి కబురు పంపింది.

మత్తయి 27:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ముఖ్య యాజకులు, పెద్దలు బరబ్బనే విడిపించమనీ యేసును చంపించాలని అడగమని జనసమూహాలను రెచ్చగొట్టారు.

మత్తయి 27:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పిలాతు, “ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయాలని మీరు కోరుతున్నారు?” అని అడగగా వారు, “బరబ్బనే” అని అరిచారు.

మత్తయి 27:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు పిలాతు, “మరి క్రీస్తు అని పిలిచే ఈ యేసును ఏమి చెయ్యమంటారు?” అన్నాడు. వారంతా, “అతణ్ణి సిలువ వేయండి” అని కేకలు వేశారు.

మత్తయి 27:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పిలాతు, “ఎందుకు? ఇతడు ఏం నేరం చేశాడు?” అని అడిగినప్పుడు, వారు, “సిలువ వేయండి” అని ఇంకా ఎక్కువగా కేకలు వేశారు.

మత్తయి 27:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అల్లరి ఎక్కువౌతుందే గాని తన ప్రయత్నాలేమీ ఫలించడం లేదని గ్రహించి, పిలాతు నీళ్ళు తీసుకుని ఆ జనసమూహం ఎదుట చేతులు కడుక్కుని, “ఈ నీతిపరుని రక్తం విషయంలో నేను నిరపరాధిని, దీన్ని మీరే చూసుకోవాలి” అని చెప్పాడు.

మత్తయి 27:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు ప్రజలంతా, “అతడి రక్తం మా మీదా, మా పిల్లల మీదా ఉండుగాక” అన్నారు.

మత్తయి 27:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు పిలాతు వారు కోరినట్టే బరబ్బను విడుదల చేసి, యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయడానికి అప్పగించాడు.

మత్తయి 27:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు సైనికులు యేసును అధికార మందిరంలోకి తీసుకుపోయి, ఆయన ముందు సైనికులందరినీ పోగుచేశారు.

మత్తయి 27:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు ఆయన వస్త్రాలు తీసేసి, ఆయనకు ఎర్రని అంగీ తొడిగించారు.

మత్తయి 27:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ముళ్ళతో ఒక కిరీటం అల్లి ఆయన తలమీద పెట్టారు. ఆయన కుడి చేతిలో ఒక రెల్లు కర్ర ఉంచారు. అప్పుడు ఆయన ముందు మోకరించి, “యూదుల రాజా, నీకు శుభం!” అంటూ ఎగతాళి చేశారు.

మత్తయి 27:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన మీద ఉమ్మి వేసి, ఆ రెల్లు కర్రతో ఆయన తలమీద కొట్టారు.

మత్తయి 27:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అదంతా అయిన తరువాత ఆయనకు వేసిన అంగీ తీసివేసి ఆయన వస్త్రాలు ఆయనకు తొడిగించి, సిలువ వేయడానికి తీసుకు వెళ్ళారు.

మత్తయి 27:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు బయటికి వస్తూ ఉండగా కురేనే ప్రాంతానికి చెందిన సీమోను అనే వ్యక్తి కనిపించాడు. వారు బలవంతంగా అతని చేత ఆయన సిలువను మోయించారు.

మత్తయి 27:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు, “కపాల స్థలం” అని అర్థమిచ్చే ‘గొల్గొతా’ అనే చోటికి వచ్చారు.

మత్తయి 27:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అక్కడ చేదు కలిపిన ద్రాక్షారసాన్ని తాగడానికి ఆయనకు అందించారు గాని ఆయన దాన్ని రుచి చూసి తాగలేక నిరాకరించాడు.

మత్తయి 27:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు ఆయనను సిలువ వేసిన తరవాత చీట్లు వేసి ఆయన బట్టలు పంచుకున్నారు.

మత్తయి 27:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అక్కడే ఆయనకు కావలిగా కూర్చున్నారు.

మత్తయి 27:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“ఇతడు యూదుల రాజైన యేసు’’ అని ఆయన మీద మోపిన నేరం రాసి ఉన్న ప్రకటన ఒకటి ఆయన తలకు పైన ఉంచారు.

మత్తయి 27:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు ఇద్దరు బందిపోటు దొంగలను కూడా సిలువవేశారు.

మత్తయి 27:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ దారిన వెళ్ళేవారు తలలూపుతూ,

మత్తయి 27:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో కట్టేవాడా, నిన్ను నీవే రక్షించుకో. నీవు దేవుని కుమారుడివైతే సిలువ మీద నుండి దిగిరా!” అంటూ ఆయనను తిట్టారు.

మత్తయి 27:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలాగే ధర్మశాస్త్ర పండితులూ, పెద్దలూ, ప్రధాన యాజకులూ ఆయనను వెక్కిరిస్తూ,

మత్తయి 27:42 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“ఇతడు ఇతరులను రక్షించాడు గానీ తనను రక్షించుకోలేడు. ఇశ్రాయేలు రాజు గదా, అతడిప్పుడు సిలువ మీద నుండి దిగి వస్తే అతణ్ణి నమ్ముతాం.

మత్తయి 27:43 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇతడు దేవునిలో విశ్వాసం ఉన్నవాడు గదా, తాను దేవుని కుమారుణ్ణి అని చెప్పాడు గదా. కాబట్టి ఆయనకిష్టమైతే దేవుడే ఇతన్ని తప్పిస్తాడు” అని హేళనగా మాట్లాడారు.

మత్తయి 27:44 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయనతోబాటు సిలువ వేసిన దోపిడీ దొంగలు కూడా ఆయనను అలాగే నిందించారు.

మత్తయి 27:45 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకూ దేశమంతా చీకటి కమ్మింది.

మత్తయి 27:46 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సుమారు మూడు గంటలప్పుడు యేసు, “ఏలీ, ఏలీ, లామా సబక్తానీ” అని పెద్దగా కేక వేశాడు. ఆ మాటకు, “నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు?” అని అర్థం.

మత్తయి 27:47 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అక్కడ నిలబడిన వారిలో కొందరు ఆ మాట విని, “అతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అన్నారు.

మత్తయి 27:48 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్ళి, స్పాంజ్ తెచ్చి పులిసిన ద్రాక్షరసంలో ముంచి, రెల్లు కర్రకు తగిలించి ఆయనకు తాగడానికి అందించాడు.

మత్తయి 27:49 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మిగిలిన వారు, “ఉండండి, ఏలీయా వచ్చి ఇతణ్ణి రక్షిస్తాడేమో చూద్దాం” అన్నారు.

మత్తయి 27:50 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యేసు మళ్ళీ పెద్దగా కేక వేసి ప్రాణం విడిచాడు.

మత్తయి 27:51 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు దేవాలయంలోని తెర పైనుండి కింది వరకూ రెండుగా చినిగింది. భూమి కంపించింది, బండలు బద్దలయ్యాయి.

మత్తయి 27:52 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సమాధులు తెరుచుకున్నాయి. కన్ను మూసిన అనేక మంది పరిశుద్ధుల శరీరాలు సజీవంగా లేచాయి.

మత్తయి 27:53 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన పునరుత్థానం చెందిన తరువాత పవిత్ర నగరంలో ప్రవేశించి చాలామందికి కనిపించారు.

మత్తయి 27:54 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రోమా శతాధిపతి, అతనితో యేసుకు కావలి ఉన్నవారు, భూకంపాన్ని, జరిగిన సంఘటనలను చూసి చాలా భయపడ్డారు. “ఈయన నిజంగా దేవుని కుమారుడే” అని వారు చెప్పుకున్నారు.

మత్తయి 27:55 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యేసుకు ఉపచారం చేయడానికి గలిలయ నుండి ఆయన వెంట వచ్చిన అనేకమంది స్త్రీలు అక్కడ దూరంగా నిలబడి చూస్తున్నారు.

మత్తయి 27:56 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారిలో మగ్దలేనే మరియ, యాకోబు, యోసేపు అనే వారి తల్లి అయిన మరియ, జెబెదయి కుమారుల తల్లి ఉన్నారు.

మత్తయి 27:57 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ సాయంకాలం అప్పటికే యేసు శిష్యుడుగా ఉండిన అరిమతయి యోసేపు అనే ఒక ధనవంతుడు వచ్చాడు.

మత్తయి 27:58 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు పిలాతు దగ్గరికి వెళ్ళి, యేసు దేహాన్ని తనకు ఇప్పించమని విన్నవించుకున్నాడు. పిలాతు దాన్ని అతనికి అప్పగించమని ఆజ్ఞాపించాడు.

మత్తయి 27:59 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోసేపు ఆ దేహాన్ని తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టాడు.

మత్తయి 27:60 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తాను రాతిలో తొలిపించుకున్న తన కొత్త సమాధిలో దాన్ని పెట్టాడు. తరువాత పెద్ద రాయితో సమాధి ద్వారాన్ని మూసివేసి వెళ్ళిపోయాడు.

మత్తయి 27:61 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మగ్దలేనే మరియ, వేరొక మరియ అక్కడే సమాధికి ఎదురుగా కూర్చుని ఉన్నారు.

మత్తయి 27:62 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ తరువాతి రోజు, అంటే విశ్రాంతి దినానికి సిద్ధపడే రోజుకు తరువాతి రోజు ముఖ్య యాజకులు, పరిసయ్యులు పిలాతు దగ్గరికి వెళ్ళి,

మత్తయి 27:63 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“అయ్యా, ఆ మోసగాడు జీవించి ఉన్నప్పుడు ‘మూడు రోజుల తరువాత నేను సజీవంగా తిరిగి లేస్తాను’ అని చెప్పిన మాట మాకు జ్ఞాపకం ఉంది.

మత్తయి 27:64 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి మూడవ రోజు వరకూ సమాధిని భద్రం చేయమని ఆజ్ఞాపించండి. ఒకవేళ అతని శిష్యులు అతణ్ణి ఎత్తుకుపోయి ‘ఆయన మృతుల్లో నుండి సజీవంగా లేచాడు’ అని ప్రజల్లో ప్రచారం చేస్తారేమో. అదే జరిగితే మొదటి వంచన కంటే చివరి వంచన మరింత చెడ్డదౌతుంది” అన్నారు.

మత్తయి 27:65 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు పిలాతు, “కావలి వారున్నారు గదా, మీరు వెళ్ళి మీ శక్తి మేర సమాధిని భద్రం చేయండి” అని వారితో చెప్పాడు.

మత్తయి 27:66 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు వెళ్ళి రాతికి ముద్ర వేసి సమాధికి కావలి వారిని ఏర్పాటు చేశారు.

Available Bible Translations

American Standard Version
Matthew 27 (ASV) »
King James Version
Matthew 27 (KJV) »
GOD’S WORD® (GW)
Matthew 27 (GW) »
World English Bible
Matthew 27 (WEB) »
Louis Segond 1910
Matthieu 27 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
मत्ती 27 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਮੱਤੀ 27 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
মথি 27 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
மத்தேயு 27 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
मत्तय 27 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
માથ્થી 27 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಮತ್ತಾಯನು 27 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
مَتَّى 27 (AVD) »
תנ ך עברי מודרני
הבשורה על־פי מתי 27 (HEB) »
Bíblia Sagrada Português
Mateus 27 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ma-thi-ơ 27 (VIE) »
Reina Valera Antigua
Mateo 27 (RVA) »
La Sacra Bibbia
Matteo 27 (RIV) »
圣 经 简体中文和合本
马 太 福 音 27 (CUVS) »
聖 經 繁體中文和合本
馬 太 福 音 27 (CUVT) »
Bibla e Shenjtë
Mateu 27 (ALB) »
Svenska Bibeln 1917
Matteus 27 (SV1917) »
Библия на русском
Матфея 27 (RUSV) »
Українська Біблія
Матвія 27 (UKR) »
Szent Biblia - Magyar
Máté 27 (KAR) »
Българска Библия
Матей 27 (BULG) »
Det Norsk Bibel
Matteus 27 (NORSK) »
Kitaabka Quduuska Ah
Matayos 27 (SOM) »
De Heilige Schrift
Mattheüs 27 (NLD) »

మత్తయి (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List