సంఖ్యాకాండం Chapter 1 TELIRV Bible Verse Images

సంఖ్యాకాండం 1 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share సంఖ్యాకాండం 1 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


సంఖ్యాకాండం 1:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా సీనాయి అరణ్యంలో ఉన్న సన్నిధి గుడారంలో నుండి మోషేతో మాట్లాడాడు. ఇది ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన రెండో సంవత్సరం రెండో నెల మొదటి తేదీన జరిగింది. యెహోవా మోషేతో ఇలా చెప్పాడు.

సంఖ్యాకాండం 1:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“ఇశ్రాయేలు ప్రజల జనాభా లెక్కలు వారి వారి వంశాల ప్రకారం, పూర్వీకుల కుటుంబాల ప్రకారం రాయించు. వారి పేర్లు రాయించు.

సంఖ్యాకాండం 1:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలు రాజ్యం కోసం సైనికులుగా యుద్ధానికి వెళ్ళగలిగిన వారు, ఇరవై ఇంకా ఆ పై వయసున్న పురుషులందరినీ లెక్కపెట్టు. ఒక్కో దళంలో ఎంతమంది పురుషులున్నారో నువ్వూ, అహరోనూ కలసి నమోదు చేయాలి.

సంఖ్యాకాండం 1:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీతో కలసి సేవ చేయడానికి ఒక్కో గోత్రం నుండి ఒక వ్యక్తి గోత్ర నాయకుడిగా ఉండాలి. అతడు తన తెగలో ప్రముఖుడై ఉండాలి.

సంఖ్యాకాండం 1:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీతో కలసి పోరాటాల్లో పాల్గొనే నాయకులు వీరు. రూబేను గోత్రం నుండి షెదేయూరు కొడుకు ఏలీసూరు,

సంఖ్యాకాండం 1:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షిమ్యోను గోత్రం నుండి సూరీషద్దాయి కొడుకు షెలుమీయేలు,

సంఖ్యాకాండం 1:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదా గోత్రం నుండి అమ్మీనాదాబు కొడుకు నయస్సోను,

సంఖ్యాకాండం 1:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్శాఖారు గోత్రం నుండి సూయారు కొడుకు నెతనేలు

సంఖ్యాకాండం 1:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జెబూలూను గోత్రం నుండి హేలోను కొడుకు ఏలీయాబు.

సంఖ్యాకాండం 1:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోసేపు సంతానమైన ఎఫ్రాయిము గోత్రం నుండి అమీహూదు కొడుకు ఎలీషామాయు, మనష్షే గోత్రం నుండి పెదాసూరు కొడుకు గమలీయేలు,

సంఖ్యాకాండం 1:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బెన్యామీను గోత్రం నుండి గిద్యోనీ కొడుకు అబీదాను,

సంఖ్యాకాండం 1:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దాను గోత్రం నుండి అమీషద్దాయి కొడుకు అహీయెజెరు,

సంఖ్యాకాండం 1:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆషేరు గోత్రం నుండి ఒక్రాను కొడుకు పగీయేలు,

సంఖ్యాకాండం 1:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గాదు గోత్రం నుండి దెయూవేలు కొడుకు ఎలాసాపు

సంఖ్యాకాండం 1:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నఫ్తాలి గోత్రం నుండి ఏనాను కొడుకు అహీర.”

సంఖ్యాకాండం 1:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వీళ్ళంతా ప్రజల్లోనుండి నియమితులయ్యారు. వీరు తమ పూర్వీకుల గోత్రాలకు నాయకులుగానూ, ఇశ్రాయేలు ప్రజల తెగలకు పెద్దలుగానూ ఉన్నారు.

సంఖ్యాకాండం 1:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ పేర్లతో ఉన్న వ్యక్తులను మోషే అహరోనులు పిలిచారు.

సంఖ్యాకాండం 1:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వీళ్ళతో పాటు ఇశ్రాయేలు ప్రజల్లో పురుషులందరినీ రెండో నెల మొదటి రోజున సమావేశపర్చారు. ఇరవై ఏళ్ళూ ఆ పై వయసున్న వారు తమ తమ వంశాలనూ, పూర్వీకుల కుటుంబాలనూ తమ తెగల పెద్దల పేర్లనూ తెలియజేసారు.

సంఖ్యాకాండం 1:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు యెహోవా తనకాజ్ఞాపించినట్టుగా సీనాయి అరణ్యంలో మోషే వారి సంఖ్య నమోదు చేశాడు.

సంఖ్యాకాండం 1:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలు మొదటి కొడుకు రూబేను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.

సంఖ్యాకాండం 1:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలా రూబేను గోత్రం నుండి 46, 500 మందిని లెక్కించారు.

సంఖ్యాకాండం 1:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షిమ్యోను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.

సంఖ్యాకాండం 1:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలా షిమ్యోను గోత్రం నుండి 59, 300 మందిని లెక్కించారు.

సంఖ్యాకాండం 1:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గాదు సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.

సంఖ్యాకాండం 1:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలా గాదు గోత్రం నుండి 45, 650 మందిని లెక్కించారు.

సంఖ్యాకాండం 1:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదా సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.

సంఖ్యాకాండం 1:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలా యూదా గోత్రం నుండి 74, 600 మందిని లెక్కించారు.

సంఖ్యాకాండం 1:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్శాఖారు సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.

సంఖ్యాకాండం 1:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలా ఇశ్శాఖారు గోత్రం నుండి 54, 400 మందిని లెక్కించారు.

సంఖ్యాకాండం 1:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జెబూలూను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.

సంఖ్యాకాండం 1:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలా జెబూలూను గోత్రం నుండి 57, 400 మందిని లెక్కించారు.

సంఖ్యాకాండం 1:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోసేపు కొడుకుల్లో ఒకడైన ఎఫ్రాయిము సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.

సంఖ్యాకాండం 1:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలా ఎఫ్రాయిము గోత్రం నుండి 40, 500 మందిని లెక్కించారు.

సంఖ్యాకాండం 1:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనష్షే సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.

సంఖ్యాకాండం 1:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలా మనష్షే గోత్రం నుండి 32, 200 మందిని లెక్కించారు.

సంఖ్యాకాండం 1:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బెన్యామీను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.

సంఖ్యాకాండం 1:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలా బెన్యామీను గోత్రం నుండి 35, 400 మందిని లెక్కించారు.

సంఖ్యాకాండం 1:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దాను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.

సంఖ్యాకాండం 1:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలా దాను గోత్రం నుండి 62, 700 మందిని లెక్కించారు.

సంఖ్యాకాండం 1:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆషేరు సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.

సంఖ్యాకాండం 1:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలా ఆషేరు గోత్రం నుండి 41, 500 మందిని లెక్కించారు.

సంఖ్యాకాండం 1:42 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నఫ్తాలి సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.

సంఖ్యాకాండం 1:43 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలా నఫ్తాలి గోత్రం నుండి 53, 400 మందిని లెక్కించారు.

సంఖ్యాకాండం 1:44 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలులోని పన్నెండు గోత్రాలకు నాయకత్వం వహించిన వారితో పాటు వీరందర్నీ మోషే అహరోనులు లెక్కించారు.

సంఖ్యాకాండం 1:45 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజల్లో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధాలకు వెళ్ళగలిగే వారిందర్నీ వారి వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం లెక్కించారు.

సంఖ్యాకాండం 1:46 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారింతా కలసి 6,03,550 మంది అయ్యారు.

సంఖ్యాకాండం 1:47 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాని లేవీ వారసులను వారు లెక్కించలేదు.

సంఖ్యాకాండం 1:48 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే యెహోవా మోషేకి ఇంతకు ముందే ఆజ్ఞాపించాడు.

సంఖ్యాకాండం 1:49 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“లేవీ గోత్రికులను ఇశ్రాయేలు జనసంఖ్యలో చేర్చకూడదు. వారిని నమోదు చేయవద్దు.

సంఖ్యాకాండం 1:50 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాళ్లకు నిబంధన శాసనాల గుడారం బాధ్యతలు అప్పగించు. శాసనాల గుడారం లోని అలంకరణలూ, వస్తువులన్నిటినీ వారు చూసుకోవాలి. లేవీయులే గుడారాన్ని మోసుకుంటూ వెళ్ళాలి. దానిలో ఉన్న వస్తువులను వారే మోయాలి. దాని చుట్టూ వారు తమ గుడారాలు వేసుకోవాలి.

సంఖ్యాకాండం 1:51 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గుడారాన్ని మరో స్థలానికి తరలించాల్సి వస్తే లేవీయులే దాన్ని ఊడదీయాలి. తిరిగి గుడారాన్ని నిలపాలన్నా లేవీయులే దాన్ని నిలపాలి. ఎవరన్నా పరాయి వ్యక్తి గుడారాన్ని సమీపిస్తే వాడికి మరణ శిక్ష విధించాలి.

సంఖ్యాకాండం 1:52 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలు ప్రజలు వారి వారి సైనిక దళానికి చెందిన జెండా ఎక్కడ నాటారో అక్కడే తమ గుడారాలు వేసుకోవాలి.

సంఖ్యాకాండం 1:53 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా కోపం ఇశ్రాయేలు ప్రజలపైకి రాకుండా ఉండాలంటే లేవీయులు నిబంధన శాసనాల గుడారం చుట్టూ తమ నివాసాలు ఏర్పాటు చేసుకోవాలి. నిబంధన శాసనాల గుడారాన్ని వారే జాగ్రత్తగా చూసుకోవాలి.”

సంఖ్యాకాండం 1:54 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలు ప్రజలు ఈ ఆజ్ఞల ప్రకారం అన్నీ చేసారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ ఇశ్రాయేలు ప్రజలు నెరవేర్చారు.

Available Bible Translations

American Standard Version
Numbers 1 (ASV) »
King James Version
Numbers 1 (KJV) »
GOD’S WORD® (GW)
Numbers 1 (GW) »
World English Bible
Numbers 1 (WEB) »
Louis Segond 1910
Nombres 1 (LSG) »
Luther Bibel 1912
Numeri 1 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
गिनती 1 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਗਿਣਤੀ 1 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
গননা 1 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எண்ணாகமம் 1 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
गणना 1 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ગણના 1 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಅರಣ್ಯಕಾಂಡ 1 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْعَدَد 1 (AVD) »
תנ ך עברי מודרני
במדבר 1 (HEB) »
Bíblia Sagrada Português
Números 1 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Dân Số 1 (VIE) »
Reina Valera Antigua
Números 1 (RVA) »
La Sacra Bibbia
Numeri 1 (RIV) »
圣 经 简体中文和合本
民 数 记 1 (CUVS) »
聖 經 繁體中文和合本
民 數 記 1 (CUVT) »
Bibla e Shenjtë
Numrat 1 (ALB) »
Svenska Bibeln 1917
4 Mosebok 1 (SV1917) »
Библия на русском
Числа 1 (RUSV) »
Українська Біблія
Числа 1 (UKR) »
Szent Biblia - Magyar
4 Mózes 1 (KAR) »
Българска Библия
Числа 1 (BULG) »
聖書 日本語
民数記 1 (JPN) »
Biblia Takatifu
Hesabu 1 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Tirintii 1 (SOM) »
De Heilige Schrift
Numberi 1 (NLD) »
Dansk Bibel 1871
4 Mosebog 1 (DA1871) »

సంఖ్యాకాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List