సంఖ్యాకాండం Chapter 7 TELIRV Bible Verse Images

సంఖ్యాకాండం 7 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share సంఖ్యాకాండం 7 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


సంఖ్యాకాండం 7:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే దేవుని మందిర నిర్మాణం ముగించిన రోజునే దాన్ని దానిలోని అలంకరణలతో సహా యెహోవా సేవ కోసం అభిషేకించి పవిత్ర పరిచాడు. బలిపీఠాన్ని, అక్కడ పాత్రలను అభిషేకించి పవిత్ర పరిచాడు. వాటన్నిటినీ అభిషేకించి పవిత్ర పరిచాడు.

సంఖ్యాకాండం 7:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ రోజునే ఇశ్రాయేలు ప్రజల నాయకులు, తమ పూర్వీకుల కుటుంబాల పెద్దలు బలులు అర్పించారు. వీరు తమ తమ గోత్రాల ప్రజలను నడిపిస్తున్నవారు. జనాభా లెక్కలను పర్యవేక్షించింది వీరే.

సంఖ్యాకాండం 7:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వీరు తమ అర్పణలను యెహోవా సమక్షంలోకి తీసుకు వచ్చారు. వీరు ఆరు గూడు బళ్ళూ, పన్నెండు ఎద్దులను తీసుకు వచ్చారు. ఇద్దరు నాయకులకు ఒక బండినీ, ఒక్కొక్కరికీ ఒక ఎద్దునీ తీసుకు వచ్చారు. వీటిని మందిరం ఎదుటికి వారు తీసుకు వచ్చారు.

సంఖ్యాకాండం 7:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు.

సంఖ్యాకాండం 7:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“వారి దగ్గర నుండి ఈ కానుకలు స్వీకరించు. వాటిని సన్నిధి గుడారంలో సేవకై ఉపయోగించు. ఈ కానుకలను లేవీ వారికప్పగించు. వారిలో ప్రతి వాడి సేవకు తగినట్టుగా వాటిని వాళ్లకివ్వు.”

సంఖ్యాకాండం 7:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే ఆ బళ్లనూ ఎద్దులను తీసుకుని వాటిని లేవీ వారికి ఇచ్చాడు.

సంఖ్యాకాండం 7:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాటిలో గెర్షోను వంశం వారికి వారు చేసే సేవ ప్రకారం రెండు బళ్లనూ నాలుగు ఎద్దులను ఇచ్చాడు.

సంఖ్యాకాండం 7:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యాజకుడు అహరోను కొడుకు ఈతామారు పర్యవేక్షణ లో పనిచేసే మెరారి వంశస్తులకి వారు చేసే సేవను బట్టి నాలుగు బళ్లనూ ఎనిమిది ఎద్దులనూ ఇచ్చాడు.

సంఖ్యాకాండం 7:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే కహాతు వాళ్లకి ఏమీ ఇవ్వలేదు. ఎందుకంటే వారి సేవ అంతా మందిరంలోని సామగ్రికీ వస్తువులకీ సంబంధించింది. వాటిని వారు తమ భుజాలపై మోసుకు వెళ్ళాలి. కాబట్టి వారికి బళ్ళు ఇవ్వలేదు.

సంఖ్యాకాండం 7:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే బలిపీఠాన్ని అభిషేకించిన రోజున ఆ నాయకులు బలిపీఠాన్ని ప్రతిష్టించడానికి సామగ్రిని తీసుకు వచ్చారు. బలిపీఠం ఎదుట తాము తెచ్చిన అర్పణలను సమర్పించారు.

సంఖ్యాకాండం 7:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మోషేకి “బలిపీఠం అభిషేకం కోసం అర్పణలు తీసుకు రావడానికి ప్రతి నాయకుడికీ ఒక్కో రోజు కేటాయించు” అని ఆదేశించాడు.

సంఖ్యాకాండం 7:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మొదటి రోజు అర్పణం తెచ్చింది యూదా గోత్రం వాడూ, అమ్మీనాదాబు కొడుకు నయస్సోను.

సంఖ్యాకాండం 7:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ, 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండా నూనెతో కలిపిన మెత్తని పిండిని నైవేద్య అర్పణగా ఉంచాడు.

సంఖ్యాకాండం 7:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వీటితో పాటు పది తులాల బరువున్న పాత్రను సాంబ్రాణితో నింపి అర్పించాడు.

సంఖ్యాకాండం 7:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంకా అతడు దహనబలిగా ఒక చిన్న కోడెనూ ఒక పొట్టేలునూ ఒక ఏడాది వయసున్న గొర్రె పిల్లనూ ఇచ్చాడు.

సంఖ్యాకాండం 7:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పాపం కోసం బలిగా ఒక మేక పోతును ఇచ్చాడు.

సంఖ్యాకాండం 7:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లనూ ఐదు మేకపోతులను, ఒక ఏడాది వయసున్న ఐదు గొర్రె పిల్లలను శాంతిబలిగా సమర్పించాడు. ఇవి అమ్మీనాదాబు కొడుకు నయస్సోను తెచ్చిన అర్పణం.

సంఖ్యాకాండం 7:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రెండో రోజు అర్పణం తెచ్చింది ఇశ్శాఖారు వంశంలో నాయకుడూ, సూయారు కొడుకూ అయిన నెతనేలు.

సంఖ్యాకాండం 7:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండా నూనెతో కలిపిన సన్నని పిండిని నైవేద్య అర్పణగా ఉంచాడు.

సంఖ్యాకాండం 7:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడింకా సాంబ్రాణి తో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను ఇచ్చాడు.

సంఖ్యాకాండం 7:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దహన బలిగా ఒక చిన్న కోడెనూ ఒక పొట్టేలునూ ఒక సంవత్సరం వయసున్న గొర్రె పిల్లనూ ఇచ్చాడు.

సంఖ్యాకాండం 7:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును ఇచ్చాడు.

సంఖ్యాకాండం 7:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలాగే అతడు శాంతిబలిగా రెండు ఎద్దులను, ఐదు పోట్టేళ్ళనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు గొర్రె పిల్లలను తీసుకు వచ్చాడు. ఇది సూయారు కొడుకు నెతనేలు తెచ్చిన అర్పణం.

సంఖ్యాకాండం 7:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మూడో రోజు జెబూలూను వంశస్తులకు నాయకుడూ హేలోను కొడుకూ అయిన ఏలీయాబు తన అర్పణ తీసుకు వచ్చాడు.

సంఖ్యాకాండం 7:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండుగా నైవేద్య అర్పణ కోసం నూనె కలిపిన మెత్తని గోదుమ పిండిని తెచ్చాడు.

సంఖ్యాకాండం 7:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంకా సాంబ్రాణి తో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను తీసుకువచ్చాడు.

సంఖ్యాకాండం 7:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంకా దహనబలిగా ఒక కోడెనూ ఒక పొట్టేలునూ ఒక సంవత్సరం వయసున్న ఒక మగ గొర్రెపిల్లనూ ఇచ్చాడు.

సంఖ్యాకాండం 7:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును ఇచ్చాడు.

సంఖ్యాకాండం 7:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
శాంతి బలిగా రెండు ఎద్దులను, ఐదు పోట్టేళ్ళనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను తీసుకు వచ్చాడు. ఇది హేలోను కొడుకు ఏలీయాబు తెచ్చిన అర్పణం.

సంఖ్యాకాండం 7:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నాలుగో రోజు రూబేను వంశస్తుల నాయకుడూ, షెదేయూరు కొడుకూ అయిన ఏలీసూరు తన అర్పణ తీసుకు వచ్చాడు.

సంఖ్యాకాండం 7:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండా నూనెతో కలిపిన మెత్తని పిండిని నైవేద్య అర్పణగా ఉంచాడు.

సంఖ్యాకాండం 7:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంకా సాంబ్రాణితో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను తీసుకువచ్చాడు.

సంఖ్యాకాండం 7:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు దహనబలిగా ఒక ఎద్దునూ ఒక పొట్టేలునూ ఒక సంవత్సరం వయసున్న ఒక మగ గొర్రెపిల్లనూ తీసుకువచ్చాడు.

సంఖ్యాకాండం 7:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును తీసుకువచ్చాడు.

సంఖ్యాకాండం 7:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్ళనూ ఐదు మేకపోతులను, ఐదు మగ గొర్రెపిల్లలను శాంతిబలి అర్పణగా తీసుకువచ్చాడు. ఇది షెదేయూరు కొడుకు ఏలీసూరు అర్పణం.

సంఖ్యాకాండం 7:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఐదో రోజు షిమ్యోను వంశస్తుల నాయకుడూ, సూరీషదాయి కొడుకూ అయిన షెలుమీయేలు తన అర్పణం తీసుకు వచ్చాడు.

సంఖ్యాకాండం 7:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెను, 70 తులాల బరువున్న వెండి పాత్రను, సమర్పించాడు. ఈ రెంటి నిండుగా నైవేద్య అర్పణ కోసం నూనె కలిపిన మెత్తని గోదుమ పిండిని తెచ్చాడు.

సంఖ్యాకాండం 7:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంకా సాంబ్రాణితో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను తీసుకు వచ్చాడు.

సంఖ్యాకాండం 7:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇతడు దహనబలిగా ఒక కోడెనూ ఒక పొట్టేలునూ ఒక సంవత్సరం వయసున్న ఒక గొర్రె పిల్లనూ తీసుకువచ్చాడు.

సంఖ్యాకాండం 7:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒక మేకపోతును పాపం కోసం చేసే బలిగా ఇచ్చాడు.

సంఖ్యాకాండం 7:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా ఇచ్చాడు. ఇది సూరీషదాయి కొడుకు షెలుమీయేలు అర్పణం.

సంఖ్యాకాండం 7:42 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆరో రోజు గాదు వంశస్తులకు నాయకుడూ, దెయూవేలు కొడుకు ఎలీయాసాపా తన అర్పణ తీసుకువచ్చాడు.

సంఖ్యాకాండం 7:43 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండుగా నైవేద్య అర్పణ కోసం నూనె కలిపిన మెత్తని గోదుమ పిండిని తెచ్చాడు.

సంఖ్యాకాండం 7:44 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంకా సాంబ్రాణితో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను తీసుకు వచ్చాడు.

సంఖ్యాకాండం 7:45 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు దహనబలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఒక సంవత్సరం వయసున్న ఒక గొర్రెపిల్లను తీసుకు వచ్చాడు.

సంఖ్యాకాండం 7:46 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును తెచ్చాడు.

సంఖ్యాకాండం 7:47 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా ఇచ్చాడు. ఇది దెయూవేలు కొడుకు ఎలీయాసాపా అర్పణం.

సంఖ్యాకాండం 7:48 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏడో రోజు ఎఫ్రాయిము వంశస్తులకు నాయకుడూ, అమీహూదు కొడుకూ అయిన ఎలీషామా తన అర్పణ తీసుకువచ్చాడు.

సంఖ్యాకాండం 7:49 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండుగా నైవేద్య అర్పణ కోసం నూనె కలిపిన మెత్తని గోదుమ పిండిని తెచ్చాడు.

సంఖ్యాకాండం 7:50 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంకా సాంబ్రాణి తో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను తీసుకువచ్చాడు.

సంఖ్యాకాండం 7:51 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు దహనబలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఒక సంవత్సరం వయసున్న ఒక గొర్రెపిల్లను తీసుకు వచ్చాడు.

సంఖ్యాకాండం 7:52 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును తెచ్చాడు.

సంఖ్యాకాండం 7:53 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా ఇచ్చాడు. ఇది అమీహూదు కొడుకు ఎలీషామా అర్పణం.

సంఖ్యాకాండం 7:54 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎనిమిదో రోజు మనష్శే వంశస్తుల నాయకుడూ, పెదాసూరు కొడుకూ అయిన గమలీయేలు తన అర్పణ తీసుకువచ్చాడు.

సంఖ్యాకాండం 7:55 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండుగా నైవేద్య అర్పణ కోసం నూనె కలిపిన మెత్తని గోదుమ పిండిని తెచ్చాడు.

సంఖ్యాకాండం 7:56 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంకా సాంబ్రాణి తో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్ర ఒకదాన్ని తీసుకువచ్చాడు.

సంఖ్యాకాండం 7:57 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు దహనబలిగా ఒక చిన్న కోడెనూ ఒక పొట్టేలునూ ఒక సంవత్సరం వయసున్న ఒక గొర్రెపిల్లనూ తీసుకు వచ్చాడు.

సంఖ్యాకాండం 7:58 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును తెచ్చాడు.

సంఖ్యాకాండం 7:59 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా ఇచ్చాడు. ఇది పెదాసూరు కొడుకు గమలీయేలు అర్పణం.

సంఖ్యాకాండం 7:60 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తొమ్మిదో రోజు బెన్యామీను వంశస్తులకి నాయకుడూ, గిద్యోనీ కొడుకూ అయిన అబీదాను తన అర్పణ తీసుకు వచ్చాడు.

సంఖ్యాకాండం 7:61 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండుగా నైవేద్య అర్పణ కోసం నూనె కలిపిన మెత్తని గోదుమ పిండిని తెచ్చాడు.

సంఖ్యాకాండం 7:62 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంకా సాంబ్రాణి తో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను తీసుకువచ్చాడు.

సంఖ్యాకాండం 7:63 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు దహనబలిగా ఒక చిన్న కోడెనూ ఒక పొట్టేలునూ ఒక సంవత్సరం వయసున్న ఒక గొర్రెపిల్లనూ తీసుకు వచ్చాడు.

సంఖ్యాకాండం 7:64 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును తెచ్చాడు.

సంఖ్యాకాండం 7:65 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా ఇచ్చాడు. ఇది గిద్యోనీ కొడుకు అబీదాను అర్పణం.

సంఖ్యాకాండం 7:66 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పదో రోజు దాను వంశస్తులకి నాయకుడూ, అమీషదాయి కొడుకూ అయిన అహీయెజెరు తన అర్పణ తీసుకు వచ్చాడు.

సంఖ్యాకాండం 7:67 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండుగా నైవేద్య అర్పణ కోసం నూనె కలిపిన మెత్తని గోదుమ పిండిని తెచ్చాడు.

సంఖ్యాకాండం 7:68 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంకా సాంబ్రాణి తో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను తీసుకు వచ్చాడు.

సంఖ్యాకాండం 7:69 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు దహనబలిగా ఒక చిన్న కోడెనూ ఒక పొట్టేలునూ ఒక సంవత్సరం వయసున్న ఒక గొర్రెపిల్లనూ తీసుకు వచ్చాడు.

సంఖ్యాకాండం 7:70 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును తెచ్చాడు.

సంఖ్యాకాండం 7:71 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లను, ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా ఇచ్చాడు. ఇది అమీషదాయి కొడుకు అహీయెజెరు అర్పణం.

సంఖ్యాకాండం 7:72 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పదకొండో రోజు ఆషేరు వంశస్తుల నాయకుడూ, ఒక్రాను కొడుకూ అయిన పగీయేలు తన అర్పణ తీసుకు వచ్చాడు.

సంఖ్యాకాండం 7:73 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండుగా నైవేద్య అర్పణ కోసం నూనె కలిపిన మెత్తని గోదుమ పిండిని తెచ్చాడు.

సంఖ్యాకాండం 7:74 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంకా సాంబ్రాణి తో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను తీసుకు వచ్చాడు.

సంఖ్యాకాండం 7:75 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు దహనబలిగా ఒక చిన్న కోడెనూ ఒక పొట్టేలునూ ఒక సంవత్సరం వయసున్న ఒక గొర్రెపిల్లనూ తీసుకు వచ్చాడు.

సంఖ్యాకాండం 7:76 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును తెచ్చాడు.

సంఖ్యాకాండం 7:77 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా ఇచ్చాడు. ఇది ఒక్రాను కొడుకు పగీయేలు అర్పణం.

సంఖ్యాకాండం 7:78 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పన్నెండో రోజు నఫ్తాలీ వంశస్తులకి నాయకుడూ, ఏనాను కొడుకూ అయిన అహీరా.

సంఖ్యాకాండం 7:79 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండుగా నైవేద్య అర్పణ కోసం నూనె కలిపిన మెత్తని గోదుమ పిండిని తెచ్చాడు.

సంఖ్యాకాండం 7:80 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంకా సాంబ్రాణి తో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను తీసుకువచ్చాడు.

సంఖ్యాకాండం 7:81 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు దహనబలిగా ఒక చిన్న కోడెనూ ఒక పొట్టేలునూ ఒక సంవత్సరం వయసున్న ఒక గొర్రెపిల్లనూ తీసుకు వచ్చాడు.

సంఖ్యాకాండం 7:82 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును తెచ్చాడు.

సంఖ్యాకాండం 7:83 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా ఇచ్చాడు. ఇది ఏనాను కొడుకు అహీరా అర్పణం. బలిపీఠాన్ని అభిషేకించిన రోజున ఇశ్రాయేలీయుల ప్రధానులు అర్పించిన ప్రతిష్ఠార్పణలు ఇవి. వెండి గిన్నెలు పన్నెండు, వెండి ప్రోక్షణపాత్రలు పన్నెండు, బంగారు ధూపార్తులు పన్నెండు, ప్రతి వెండి గిన్నె నూట ముప్ఫై తులాల బరువు ఉంది.

సంఖ్యాకాండం 7:84 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే బలిపీఠాన్ని అభిషేకించిన రోజున ఇశ్రాయేలు నాయకులు వీటన్నిటినీ ప్రతిష్టించారు. వారు పన్నెండు వెండి గిన్నెలను, పన్నెండు వెండి పాత్రలను, పన్నెండు బంగారు పాత్రలను ప్రతిష్టించారు. ప్రతి ప్రోక్షణపాత్ర డెబ్భై తులాల బరువున్నది. ఆ ఉపకరణాల వెండి అంతా పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం రెండు వేల నాలుగువందల తులాల బరువు.

సంఖ్యాకాండం 7:85 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రతి వెండి గిన్నే 130 తులాలు, ప్రతి పాత్రా 70 తులాల బరువైనవి. పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం మొత్తం వెండి పాత్రలన్నీ 2, 400 తులాల బరువు ఉన్నాయి.

సంఖ్యాకాండం 7:86 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సాంబ్రాణితో నిండిన బంగారు పాత్రలు పన్నెండు ఉన్నాయి. పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం ఒక్కొక్కటి పది తులాల బరువుంది. మొత్తం బంగారం 120 తులాలుంది.

సంఖ్యాకాండం 7:87 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దహనబలి కింద వారు పన్నెండు ఎద్దులను, పన్నెండు పొట్టేళ్లనూ ఒక సంవత్సరం వయసున్న పన్నెండు మగ గొర్రెలను ప్రతిష్టించారు. తమ నైవేద్య అర్పణ అర్పించారు. పాపం కోసం బలిగా పన్నెండు మేకపోతులను అర్పించారు. పశువులన్నీ పన్నెండు కోడెలు, పొట్టేళ్లు పన్నెండు, ఏడాది గొర్రెపిల్లలు పన్నెండు, వాటి నైవేద్యాలు పాపపరిహారం కోసం మగ మేక పిల్లలు పన్నెండు, సమాధానబలి పశువులు ఇరవై నాలుగు కోడెలు,

సంఖ్యాకాండం 7:88 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారి పశువులన్నిటిలో నుండి 24 ఎద్దులను, 60 పొట్టేళ్లనూ 60 మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న 60 మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా అర్పించారు.

సంఖ్యాకాండం 7:89 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవాతో మాట్లాడడానికి మోషే సన్నిధి గుడారంలోకి వెళ్ళినప్పుడు అతడు దేవుని స్వరం తనతో మాట్లాడడం విన్నాడు. నిబంధన మందసం శాసనాల పెట్టె పైన ఉన్న పరిహార స్థానం నుండి ఇద్దరు కెరూబుల మధ్యలోనుండి దేవుడు అతనితో మాట్లాడాడు. యెహోవా అతనితో మాట్లాడాడు.

Available Bible Translations

American Standard Version
Numbers 7 (ASV) »
King James Version
Numbers 7 (KJV) »
GOD’S WORD® (GW)
Numbers 7 (GW) »
World English Bible
Numbers 7 (WEB) »
Louis Segond 1910
Nombres 7 (LSG) »
Luther Bibel 1912
Numeri 7 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
गिनती 7 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਗਿਣਤੀ 7 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
গননা 7 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எண்ணாகமம் 7 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
गणना 7 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ગણના 7 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಅರಣ್ಯಕಾಂಡ 7 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْعَدَد 7 (AVD) »
תנ ך עברי מודרני
במדבר 7 (HEB) »
Bíblia Sagrada Português
Números 7 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Dân Số 7 (VIE) »
Reina Valera Antigua
Números 7 (RVA) »
La Sacra Bibbia
Numeri 7 (RIV) »
圣 经 简体中文和合本
民 数 记 7 (CUVS) »
聖 經 繁體中文和合本
民 數 記 7 (CUVT) »
Bibla e Shenjtë
Numrat 7 (ALB) »
Svenska Bibeln 1917
4 Mosebok 7 (SV1917) »
Библия на русском
Числа 7 (RUSV) »
Українська Біблія
Числа 7 (UKR) »
Szent Biblia - Magyar
4 Mózes 7 (KAR) »
Българска Библия
Числа 7 (BULG) »
聖書 日本語
民数記 7 (JPN) »
Biblia Takatifu
Hesabu 7 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Tirintii 7 (SOM) »
De Heilige Schrift
Numberi 7 (NLD) »
Dansk Bibel 1871
4 Mosebog 7 (DA1871) »

సంఖ్యాకాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List