సంఖ్యాకాండం Chapter 3 TELIRV Bible Verse Images

సంఖ్యాకాండం 3 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share సంఖ్యాకాండం 3 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


సంఖ్యాకాండం 3:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా సీనాయి కొండపైన మోషేతో మాట్లాడిన నాటికి అహరోను మోషేల సంతానం వివరాలు ఇవి.

సంఖ్యాకాండం 3:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అహరోను పెద్ద కొడుకు నాదాబు. ఆ తరువాత అబీహు, ఎలియాజరు, ఈతామారు పుట్టారు.

సంఖ్యాకాండం 3:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ పేర్లు కలిగిన అహరోను కొడుకులు యాజకులుగా పనిచేయడానికి అభిషేకం పొందారు. వారిని యాజకులుగా ప్రతిష్టించారు.

సంఖ్యాకాండం 3:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాని నాదాబు, అబీహు సీనాయి అరణ్యంలో దేవునికి అంగీకారం కాని అగ్నిని అర్పించినప్పుడు యెహోవా సమక్షంలో పడి చనిపోయారు. నాదాబు, అబీహులకు పిల్లలు లేరు. కాబట్టి ఎలియాజరు, ఈతామారు మాత్రమే తమ తండ్రి అయిన అహరోనుతో కలసి యాజక సేవ జరిగించారు.

సంఖ్యాకాండం 3:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “నువ్వు లేవీ గోత్రం వారిని తీసుకుని రా.

సంఖ్యాకాండం 3:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారిని అహరోను ఎదుట నిలబెట్టు. వారు అతనికి సహాయకులుగా ఉండాలి.

సంఖ్యాకాండం 3:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు సన్నిధి గుడారం ఎదుట అహరోను తరపునా, సమాజమంతటి తరపునా బాధ్యతలు నిర్వర్తించాలి. వారు దేవుని మందిరంలో పరిచర్య చేయాలి.

సంఖ్యాకాండం 3:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సన్నిధి గుడారంలోని అలంకరణలూ, వస్తువుల విషయమై వారు జాగ్రత్త తీసుకోవాలి. ఇశ్రాయేలు గోత్రాల ప్రజలు మందిరంలో సేవ చేస్తున్నప్పుడు వాళ్లకి సహాయం చేయాలి.

సంఖ్యాకాండం 3:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి నువ్వు లేవీయులను అహరోనుకూ అతని కొడుకులకూ అప్పగించు. ఇశ్రాయేలు ప్రజలకి సేవ చేయడంలో వారు అహరోనుకి సాయంగా ఉండాలి. వారు సంపూర్ణంగా అతనికి స్వాధీనం అయ్యారు.

సంఖ్యాకాండం 3:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నువ్వు అహరోనునూ అతని కొడుకులను యాజకులుగా నియమించు. ఆ పరిచర్య చేయడానికి పరాయి వాడు ఎవడన్నా సమీపిస్తే వాడికి మరణ శిక్ష విధించాలి.”

సంఖ్యాకాండం 3:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మోషేతో ఇంకా మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు.

సంఖ్యాకాండం 3:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“ఇశ్రాయేలు ప్రజల్లో నుండి నేను లేవీయులను ఎన్నుకున్నాను. ఇశ్రాయేలు ప్రజల్లో నుండి ప్రతి మొదటి మగ సంతానాన్ని తీసుకోడానికి బదులుగా నేను లేవీయులను తీసుకున్నాను. వారు నా వారు.

సంఖ్యాకాండం 3:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మొదటి సంతానం నాకు చెందుతుంది. ఐగుప్తు దేశంలో నేను వారి మొదటి సంతానాన్ని సంహరించినప్పుడు ఇశ్రాయేలులో మనుషుల్లోనూ, పశువుల్లోనూ మొదటి సంతానాన్ని నా కోసం నేను ప్రత్యేక పరచుకున్నాను. వారు నా వారు. అవి నావి. నేనే యెహోవాను.”

సంఖ్యాకాండం 3:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సీనాయి అరణ్యంలో యెహోవా మోషేకు ఇలా చెప్పాడు.

సంఖ్యాకాండం 3:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“లేవీ వంశానికి చెందిన వాళ్లందర్నీ లెక్కించు. వారి వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం, వారి వంశాల ప్రకారం లెక్కించు. లేవీ వంశానికి చెందిన వాళ్లందర్నీ లెక్కించు. వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం, వారి వంశాల ప్రకారం లెక్కించు. ఒక నెల వయసున్న పిల్లల నుండి పురుషులందరినీ లెక్కపెట్టు.”

సంఖ్యాకాండం 3:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే యెహోవా తనకు ఆదేశించిన ప్రకారం ఆయన చెప్పినట్టే వారిని లెక్కించాడు.

సంఖ్యాకాండం 3:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
లేవీకి గెర్షోను, కహాతు, మెరారి అనే కొడుకులున్నారు.

సంఖ్యాకాండం 3:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గెర్షోను కొడుకుల పేర్లు లిబ్నీ, షిమీ. ఈ పేర్లతో పిలిచే తెగలకు వీరే వంశకర్తలు.

సంఖ్యాకాండం 3:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కహాతు కొడుకుల పేర్లు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. ఈ పేర్లతో పిలిచే తెగలకు వీరే వంశకర్తలు.

సంఖ్యాకాండం 3:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మెరారి కొడుకుల పేర్లు మాహలి, మూషి. ఈ పేర్లతో పిలిచే తెగలకు వీరే వంశకర్తలు. ఇవి లేవీ వంశానికి చెందిన తెగలు.

సంఖ్యాకాండం 3:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గెర్షోను వంశస్తులు లిబ్నీయులు, షిమీయులు. గెర్షోనీయుల తెగలు అంటే వీరే.

సంఖ్యాకాండం 3:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వీళ్ళలో ఒక నెల వయసున్న మగ పిల్లల నుండి లెక్క పెడితే మొత్తం 7, 500 మంది ఉన్నారు.

సంఖ్యాకాండం 3:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గెర్షోనీయుల తెగలు దేవుని మందిరానికి పడమటి దిశగా అంటే వెనుక వైపున గుడారాలు వేసుకోవాలి.

సంఖ్యాకాండం 3:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గెర్షోనీయుల తెగలకు లాయేలు కుమారుడు ఎలీయాసాపు నాయకత్వం వహించాలి.

సంఖ్యాకాండం 3:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గెర్షోను వంశం వారు సన్నిధి గుడారంలో మందిరానికీ, పైకప్పుగా ఉన్న తెరలకు బాధ్యత వహించాలి. ఇంకా గుడారానికీ, పైకప్పుకీ, సన్నిధి గుడారం ప్రవేశద్వారం దగ్గర ఉండే తెరలకీ బాధ్యత వహించాలి.

సంఖ్యాకాండం 3:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మందిరమూ, బలిపీఠమూ ఉండే ఆవరణ అడ్డతెరలకూ, ఆవరణ ద్వారం దగ్గర ఉండే తెరలకూ వారు బాధ్యత వహించాలి. సన్నిధి గుడారం లోని తాళ్లకీ దానిలో ఉన్న సమస్తానికీ వారు బాధ్యత వహించాలి.

సంఖ్యాకాండం 3:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కహాతు నుండి అమ్రామీయులు, ఇస్హారీయులు, హెబ్రోనీయులు, ఉజ్జీయేలీయులు అనే తెగలు కలిగాయి. ఇవి కహాతీయుల తెగలు

సంఖ్యాకాండం 3:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వీళ్ళలో ఒక నెల వయసున్న మగ పిల్లల నుండి లెక్క పెడితే మొత్తం 8, 600 మంది ఉన్నారు. వీరు పరిశుద్ధ స్థలం బాధ్యత తీసుకోవాలి.

సంఖ్యాకాండం 3:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కహాతు వంశస్తులు మందిరం దక్షిణం వైపున తమ గుడారాలు వేసుకోవాలి.

సంఖ్యాకాండం 3:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కహాతీయుల తెగలకు ఉజ్జీయేలు కొడుకు ఎలీషాపాను నాయకత్వం వహించాలి.

సంఖ్యాకాండం 3:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వీరు మందసం, బల్ల, దీపస్తంభం, వేదికలు, పరిశుద్ధ స్థలంలోని వస్తువులు, పరిశుద్ధస్థలం తెర ఇంకా పరిశుద్ధస్థలంలో ఉన్న వాటి విషయమై బాధ్యత వహించాలి.

సంఖ్యాకాండం 3:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
లేవీయులను నడిపించే వారందరికీ యాజకుడైన అహరోను కొడుకు ఎలియాజరు నాయకత్వం వహించాలి. అతడు పరిశుద్ధస్థలం బాధ్యత తీసుకున్న వారిని పర్యవేక్షించాలి.

సంఖ్యాకాండం 3:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మెరారి నుండి రెండు తెగలు కలిగాయి. అవి మహలీయులు, మూషీయులు. ఇవి మెరారి తెగలు.

సంఖ్యాకాండం 3:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వీళ్ళలో ఒక నెల వయసున్న మగ పిల్లల నుండి లెక్క పెడితే మొత్తం 6, 200 మంది ఉన్నారు.

సంఖ్యాకాండం 3:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మెరారీ తెగలకు అబీహాయిలు కొడుకు సూరీయేలు నాయకత్వం వహించాలి. వారు మందిరానికి ఉత్తరం వైపున తమ గుడారాలు వేసుకోవాలి.

సంఖ్యాకాండం 3:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మెరారి వంశస్తులు మందిరపు పలకలకూ, దాని అడ్డకర్రలకూ, దాని స్తంభాలకూ, దాని మూలాలకూ, దాని స్థిర సామగ్రికీ, ఇంకా దానికి సంబంధిన వాటన్నిటికీ,

సంఖ్యాకాండం 3:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అంటే దాని చుట్టూ ఉన్న ఆవరణ స్తంభాలకీ, వాటి దిమ్మలకీ, మేకులకీ, తాళ్లకీ బాధ్యత వహించాలి.

సంఖ్యాకాండం 3:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే, అహరోనూ, అతని కొడుకులూ మందిరానికి తూర్పు వైపున సూర్యోదయ దిశగా సన్నిధి గుడారానికి ఎదురుగా తమ గుడారాలు వేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు చేయాల్సిన పనులకూ, పరిశుద్ధ స్థలంలో నెరవేర్చాల్సిన విధులకూ వారు బాధ్యత వహించాలి. పరాయి వాడు ఎవడైనా పరిశుద్ధ స్థలాన్ని సమీపిస్తే వాడికి మరణ శిక్ష విధించాలి.

సంఖ్యాకాండం 3:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా తమకు ఆదేశించినట్లు మోషే అహరోనులు లేవీ వంశంలో ఒక నెల వయసున్న మగ బిడ్డ నుండి అందర్నీ లెక్కించారు. వారు 22,000 మంది అయ్యారు.

సంఖ్యాకాండం 3:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత యెహోవా మోషేతో ఇలా చెప్పాడు “ఇశ్రాయేలు ప్రజల్లో మొదటి సంతానం అయిన పురుషులను ఒక నెల, ఆ పై వయసున్న వారిందర్నీ లెక్క పెట్టు. వారి పేర్లు రాయి.

సంఖ్యాకాండం 3:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేనే యెహోవాను. ఇశ్రాయేలు ప్రజల్లో మొదటి సంతానానికి బదులుగా నాకోసం లేవీ జాతి వారిని వేరు చెయ్యి. అలాగే ఇశ్రాయేలు ప్రజలకు చెందిన పశువుల్లో మొదటి సంతానానికి బదులుగా లేవీ జాతి వారి పశువులను నాకోసం తీసుకోవాలి.”

సంఖ్యాకాండం 3:42 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా తనకు ఆదేశించిన విధంగా మోషే ఇశ్రాయేలు ప్రజల్లో మొదటి సంతానాన్ని లెక్కపెట్టాడు.

సంఖ్యాకాండం 3:43 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒక నెల, ఆ పై వయసున్న మొదటి మగ సంతానాన్ని లెక్కించాడు. వారి సంఖ్య 22, 273 అయింది.

సంఖ్యాకాండం 3:44 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత యెహోవా మోషేకి ఇలా ఆదేశించాడు.

సంఖ్యాకాండం 3:45 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“ఇశ్రాయేలు ప్రజల్లో మొదటి సంతానం అయిన 22, 273 మందిలో ప్రతివాడికి బదులుగా నువ్వు లేవీ జాతి వారిని వారి పశువులకి బదులుగా లేవీ జాతి వారి పశువులను తీసుకో. లేవీ జాతి వారు నా వారుగా ఉంటారు. నేనే యెహోవాను.

సంఖ్యాకాండం 3:46 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలు ప్రజల్లో మొదటి పుట్టినవారు లేవీ జాతి వారి కంటే 273 మంది ఎక్కువ అయ్యారు. వారిని విడిపించడం కోసం ఒక్కొక్కరి దగ్గర ఐదేసి తులాల వెండి తీసుకో.

సంఖ్యాకాండం 3:47 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పరిశుద్ధ స్థలంలో ప్రమాణమైన తులం బరువులో అది ఉండాలి. ఒక తులం 20 చిన్నాలు.

సంఖ్యాకాండం 3:48 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎక్కువైన వారిని విడిపించడానికి సేకరించిన ఆ ధనాన్ని అహరోనుకూ అతని కొడుకులకూ ఇవ్వాలి.”

సంఖ్యాకాండం 3:49 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి మోషే లేవీ జాతివారి కంటే ఎక్కువగా ఉన్న వారి దగ్గర ఆ విడుదల సొమ్మును సేకరించాడు.

సంఖ్యాకాండం 3:50 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలు ప్రజల పెద్ద కొడుకుల దగ్గర ఆ సొమ్మును సేకరించాడు. పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం ప్రకారం 1, 365 తులాలు సేకరించాడు.

సంఖ్యాకాండం 3:51 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే తనకు యెహోవా ఆదేశించినట్లు ఆ విడుదల సొమ్మును అహరోనుకీ అతని కొడుకులకీ ఇచ్చాడు.

Available Bible Translations

American Standard Version
Numbers 3 (ASV) »
King James Version
Numbers 3 (KJV) »
GOD’S WORD® (GW)
Numbers 3 (GW) »
World English Bible
Numbers 3 (WEB) »
Louis Segond 1910
Nombres 3 (LSG) »
Luther Bibel 1912
Numeri 3 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
गिनती 3 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਗਿਣਤੀ 3 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
গননা 3 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எண்ணாகமம் 3 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
गणना 3 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ગણના 3 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಅರಣ್ಯಕಾಂಡ 3 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْعَدَد 3 (AVD) »
תנ ך עברי מודרני
במדבר 3 (HEB) »
Bíblia Sagrada Português
Números 3 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Dân Số 3 (VIE) »
Reina Valera Antigua
Números 3 (RVA) »
La Sacra Bibbia
Numeri 3 (RIV) »
圣 经 简体中文和合本
民 数 记 3 (CUVS) »
聖 經 繁體中文和合本
民 數 記 3 (CUVT) »
Bibla e Shenjtë
Numrat 3 (ALB) »
Svenska Bibeln 1917
4 Mosebok 3 (SV1917) »
Библия на русском
Числа 3 (RUSV) »
Українська Біблія
Числа 3 (UKR) »
Szent Biblia - Magyar
4 Mózes 3 (KAR) »
Българска Библия
Числа 3 (BULG) »
聖書 日本語
民数記 3 (JPN) »
Biblia Takatifu
Hesabu 3 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Tirintii 3 (SOM) »
De Heilige Schrift
Numberi 3 (NLD) »
Dansk Bibel 1871
4 Mosebog 3 (DA1871) »

సంఖ్యాకాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List