సంఖ్యాకాండం Chapter 31 TELIRV Bible Verse Images

సంఖ్యాకాండం 31 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share సంఖ్యాకాండం 31 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


సంఖ్యాకాండం 31:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా “మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు చేసిన దానికి ప్రతీకారం తీర్చుకోండి.

సంఖ్యాకాండం 31:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ తరవాత నీవు చనిపోయి నీ పూర్వీకుల దగ్గరికి చేరుకుంటావు” అని మోషేకు చెప్పాడు.

సంఖ్యాకాండం 31:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు మోషే “మీలో కొందరు యుద్ధానికి సిద్ధపడి మిద్యానీయుల మీదికి పోయి వారికి యెహోవా విధించిన ప్రతిదండన చేయండి.

సంఖ్యాకాండం 31:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలీయుల ప్రతి గోత్రం నుండి వెయ్యిమంది చొప్పున యుద్ధానికి పంపండి” అని ప్రజలతో అన్నాడు.

సంఖ్యాకాండం 31:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ విధంగా గోత్రానికి వెయ్యి మంది చొప్పున, ఇశ్రాయేలీయుల మొత్తం సైన్యంలో నుండి పన్నెండు వేల మంది యుద్ధ వీరులను సిద్ధం చేశారు.

సంఖ్యాకాండం 31:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే వారిని, యాజకుడైన ఎలియాజరు కుమారుడు ఫీనెహాసుతో పంపించాడు. అతనికి పరిశుద్ధమైన కొన్ని వస్తువులు, యుద్ధంలో ఊదటానికి బాకాలు పంపాడు.

సంఖ్యాకాండం 31:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే ఇశ్రాయేలీయులు మిద్యానీయులతో యుద్ధం చేసి మగవారందరినీ చంపేశారు.

సంఖ్యాకాండం 31:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు కాక మిద్యాను రాజులు, ఎవీ, రేకెము, సూరు, హూరు, రేబ అనే ఐదుగుర్ని చంపారు. బెయోరు కొడుకు బిలామును కత్తితో చంపేశారు.

సంఖ్యాకాండం 31:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు మిద్యాను స్త్రీలను, వారి చిన్నపిల్లలను చెరపట్టుకుని, వారి పశువులు, గొర్రెలు, మేకలు అన్నిటిని, వారి సమస్తాన్ని దోచుకున్నారు.

సంఖ్యాకాండం 31:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారి పట్టణాలు, కోటలు అన్నిటిని తగలబెట్టారు.

సంఖ్యాకాండం 31:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు మనుషులను గాని పశువులను గాని మిద్యానీయుల ఆస్తి అంతటినీ కొల్లగొట్టారు.

సంఖ్యాకాండం 31:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత వారు దానంతటినీ, చెరపట్టిన వారిని మోయాబు మైదానాల్లో యెరికో దగ్గర యొర్దాను పక్కన విడిది చేసి ఉన్న మోషే, యాజకుడు ఎలియాజరు దగ్గరికి, ఇశ్రాయేలీయుల సమాజం దగ్గరికి తీసుకు వచ్చారు.

సంఖ్యాకాండం 31:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు మోషే, యాజకుడు ఎలియాజరు, సమాజ నాయకులంతా విడిది బయటికి వారికి ఎదురు వెళ్ళారు.

సంఖ్యాకాండం 31:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు మోషే యుద్ధం నుండి వచ్చిన సహస్రాధిపతులు, శతాధిపతుల పైన కోపపడ్డాడు.

సంఖ్యాకాండం 31:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు వారితో “మీరు మిద్యాను స్త్రీలను ఎందుకు బతకనిచ్చారు?

సంఖ్యాకాండం 31:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బిలాము సలహా ప్రకారం పెయోరు విషయంలో ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు ఎదురు తిరిగేలా చేసింది వారే కదా! అందుచేత యెహోవా మన సమాజంలో తెగులు పుట్టించాడు కదా.

సంఖ్యాకాండం 31:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి మీరు మగ పిల్లలందరినీ మగవారితో సంబంధం ఉన్న ప్రతి స్త్రీనీ చంపండి.

సంఖ్యాకాండం 31:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మగవారితో సంబంధం లేని ప్రతి ఆడపిల్లను మీ కోసం బతకనీయండి.

సంఖ్యాకాండం 31:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు ఏడు రోజులు విడిది బయట ఉండాలి. మీలో మనిషిని చంపిన ప్రతివాడూ, చనిపోయిన వారిని తాకిన ప్రతివాడూ, మీరు, మీరు చెరగా పట్టుకొచ్చిన వారు, మూడో రోజున, ఏడో రోజున మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి.

సంఖ్యాకాండం 31:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు మీ వస్త్రాలను, చర్మంతో, మేక వెండ్రుకలతో చేసిన వస్తువులను, చెక్కతో చేసిన వస్తువులను అన్నిటినీ శుద్ధి చేయాలి.”

సంఖ్యాకాండం 31:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు యాజకుడు ఎలియాజరు యుద్ధానికి వెళ్ళిన సైనికులతో “యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు,

సంఖ్యాకాండం 31:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
‘అగ్నితో చెడిపోని బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, తగరం, సీసం, వీటితో చేసిన వస్తువులన్నిటినీ

సంఖ్యాకాండం 31:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మంటల్లో వేసి తీయడం ద్వారా శుద్ధి చేయాలి. వాటిని పాపపరిహార జలంతో కూడా శుద్ధి చేయాలి. అగ్నితో చెడిపోయే ప్రతి వస్తువును నీళ్లలో వేసి తీయాలి.

సంఖ్యాకాండం 31:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏడో రోజు మీరు మీ బట్టలు ఉతుక్కొని శుద్ధి అయిన తరవాత విడిదిలోకి రావచ్చు.’” అన్నాడు.

సంఖ్యాకాండం 31:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మోషేకు ఇంకా ఇలా ఆజ్ఞాపించాడు,

సంఖ్యాకాండం 31:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“నువ్వూ యాజకుడు ఎలియాజరు సమాజంలోని పూర్వీకుల వంశాల నాయకులు మీరు చెరగా పట్టుకున్న మనుషులను, పశువులను లెక్కబెట్టి రెండు భాగాలు చేయండి.

సంఖ్యాకాండం 31:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సైన్యంగా యుద్ధానికి వెళ్ళిన వారికి సగం, మిగిలిన సర్వసమాజానికి సగం పంచిపెట్టండి.

సంఖ్యాకాండం 31:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యుద్ధానికి వెళ్ళిన సైనికులపై యెహోవా కోసం పన్ను వేసి, ఆ మనుషుల్లో, పశువుల్లో, గాడిదల్లో, గొర్రె మేకల్లో ఐదు వందలకు ఒకటి చొప్పున వారి సగభాగంలో నుండి తీసుకుని

సంఖ్యాకాండం 31:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవాకు అర్పణగా యాజకుడు ఎలియాజరుకు ఇవ్వాలి.

సంఖ్యాకాండం 31:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అదే విధంగా మిగిలిన ఇశ్రాయేలీయుల సగంలో నుండి మనుషుల్లో, పశువుల్లో, గాడిదల్లో, గొర్రె మేకల్లో, అన్ని రకాల జంతువుల్లోనుండి 50 కి ఒకటి చొప్పున తీసుకుని యెహోవా మందిరాన్ని కాపాడే లేవీయులకు ఇవ్వాలి.”

సంఖ్యాకాండం 31:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధంగా మోషే, యాజకుడు ఎలియాజరు చేశారు.

సంఖ్యాకాండం 31:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ సైనికులు దోచుకున్నది గాక మిగిలింది

సంఖ్యాకాండం 31:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
6, 75,000 గొర్రెలు లేక మేకలు,

సంఖ్యాకాండం 31:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
72,000 పశువులు, 61,000 గాడిదలు,

సంఖ్యాకాండం 31:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
32,000 మంది మగవారితో సంబంధం లేని స్త్రీలు ఉన్నారు.

సంఖ్యాకాండం 31:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందులో సగం యుద్ధానికి వెళ్ళిన వారి వంతు, గొర్రె మేకలు 3, 37, 500. వాటిలో యెహోవాకు చెందిన పన్ను 675. పశువుల్లో సగం 36,000.

సంఖ్యాకాండం 31:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాటిలో యెహోవా పన్ను 72.

సంఖ్యాకాండం 31:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాటిలో యెహోవా పన్ను 61.

సంఖ్యాకాండం 31:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనుషుల్లో సగం 16,000 మంది. వారిలో యెహోవా పన్ను 32 మంది.

సంఖ్యాకాండం 31:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధంగా అతడు యెహోవాకు చెందాల్సిన అర్పణను యాజకుడు ఎలియాజరుకు ఇచ్చాడు.

సంఖ్యాకాండం 31:42 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే సైనికుల నుండి తీసుకుని ఇశ్రాయేలీయులకు ఇచ్చిన సగంలో నుండి లేవీయులకు ఇచ్చాడు.

సంఖ్యాకాండం 31:44 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
36,000 పశువులు, 30, 500 గాడిదలు,

సంఖ్యాకాండం 31:45 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
16,000 మంది మనుషులు సమాజానికి రావలసిన సగం.

సంఖ్యాకాండం 31:46 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే ఆ సగం నుండి మనుషుల్లో, జంతువుల్లో,

సంఖ్యాకాండం 31:47 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
50 కి ఒకటి చొప్పున తీసి, యెహోవా తనకు ఆజ్ఞాపించిన విధంగా యెహోవా మందిరాన్ని కాపాడే లేవీయులకు ఇచ్చాడు.

సంఖ్యాకాండం 31:48 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు సైన్యంలో వేలమందికి, వందల మందికి అధిపతులు మోషే దగ్గరికి వచ్చి

సంఖ్యాకాండం 31:49 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“నీ సేవకులైన మేము మా కింద ఉన్న సైనికులందరినీ లెక్కపెట్టాం. మొత్తానికి ఒక్కడు కూడా తగ్గలేదు.

సంఖ్యాకాండం 31:50 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి యెహోవా సన్నిధిలో మా కోసం ప్రాయశ్చిత్తం కలిగేలా మాలో ప్రతి ఒక్కడికి దొరికిన బంగారు నగలు, గొలుసులు, కడియాలు, ఉంగరాలు, పోగులు, పతకాలు యెహోవాకు అర్పణ తెచ్చాం” అని చెప్పారు.

సంఖ్యాకాండం 31:51 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే, యాజకుడు ఎలియాజరు ఆ బంగారు నగలను వారి నుండి తీసుకున్నారు.

సంఖ్యాకాండం 31:52 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వేలమందికి, వందల మందికి అధిపతులైన నాయకులు యెహోవాకు అర్పించిన బంగారం మొత్తం 16, 750 తులాలు.

సంఖ్యాకాండం 31:53 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ సైనికుల్లో ప్రతివాడూ తన మట్టుకు తాను దోపుడు సొమ్ము తెచ్చుకున్నాడు.

సంఖ్యాకాండం 31:54 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు మోషే, యాజకుడు ఎలియాజరు వేలమందికి, వందల మందికి అధిపతుల దగ్గర తీసుకున్న బంగారాన్ని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థంగా ప్రత్యక్ష గుడారంలో ఉంచారు.

Available Bible Translations

American Standard Version
Numbers 31 (ASV) »
King James Version
Numbers 31 (KJV) »
GOD’S WORD® (GW)
Numbers 31 (GW) »
World English Bible
Numbers 31 (WEB) »
Louis Segond 1910
Nombres 31 (LSG) »
Luther Bibel 1912
Numeri 31 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
गिनती 31 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਗਿਣਤੀ 31 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
গননা 31 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எண்ணாகமம் 31 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
गणना 31 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ગણના 31 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಅರಣ್ಯಕಾಂಡ 31 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْعَدَد 31 (AVD) »
תנ ך עברי מודרני
במדבר 31 (HEB) »
Bíblia Sagrada Português
Números 31 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Dân Số 31 (VIE) »
Reina Valera Antigua
Números 31 (RVA) »
La Sacra Bibbia
Numeri 31 (RIV) »
圣 经 简体中文和合本
民 数 记 31 (CUVS) »
聖 經 繁體中文和合本
民 數 記 31 (CUVT) »
Bibla e Shenjtë
Numrat 31 (ALB) »
Svenska Bibeln 1917
4 Mosebok 31 (SV1917) »
Библия на русском
Числа 31 (RUSV) »
Українська Біблія
Числа 31 (UKR) »
Szent Biblia - Magyar
4 Mózes 31 (KAR) »
Българска Библия
Числа 31 (BULG) »
聖書 日本語
民数記 31 (JPN) »
Biblia Takatifu
Hesabu 31 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Tirintii 31 (SOM) »
De Heilige Schrift
Numberi 31 (NLD) »

సంఖ్యాకాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List