కీర్తన Chapter 105 TELIRV Bible Verse Images

కీర్తన 105 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share కీర్తన 105 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


కీర్తన 105:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన నామాన్ని ప్రకటన చేయండి. జాతుల్లో ఆయన కార్యాలను తెలియచేయండి.

కీర్తన 105:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయనను గూర్చి పాడండి. ఆయనను కీర్తించండి. ఆయన ఆశ్చర్య కార్యాలన్నిటిని గూర్చి సంభాషణ చేయండి.

కీర్తన 105:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన పరిశుద్ధ నామాన్నిబట్టి అతిశయించండి. యెహోవాను వెతికేవారు హృదయంలో సంతోషించుదురు గాక.

కీర్తన 105:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవాను వెదకండి. ఆయన బలాన్ని వెదకండి. ఆయన సన్నిధిని నిత్యం అన్వేషించండి.

కీర్తన 105:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన సేవకుడైన అబ్రాహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతివారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోండి.

కీర్తన 105:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకోండి.

కీర్తన 105:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన మన దేవుడైన యెహోవా. ఆయన తీర్పులు భూమి అంతటా అమలు అవుతున్నాయి.

కీర్తన 105:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరాల వరకూ ఆయన గుర్తుంచుకుంటాడు. అబ్రాహాముతో తాను చేసిన నిబంధనను,

కీర్తన 105:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణాన్ని, నిత్యం ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు.

కీర్తన 105:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారి సంఖ్య కొద్దిగా ఉన్నప్పుడు, ఆ కొద్ది మంది ఆ దేశంలో పరదేశులుగా ఉన్నప్పుడు,

కీర్తన 105:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కొలిచిన వారసత్వంగా కనాను దేశం మీకిస్తానని ఆయన చెప్పాడు.

కీర్తన 105:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ మాట యాకోబుకు శాసనంగాను ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగాను స్థిరపరచాడు.

కీర్తన 105:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు జనం నుండి జనానికి, రాజ్యం నుండి రాజ్యానికి తిరుగులాడుతుండగా

కీర్తన 105:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారిని హింసించడానికి ఆయన ఎవరినీ అనుమతించలేదు. ఆయన వారి కోసం రాజులను శిక్షించాడు.

కీర్తన 105:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను అభిషేకించిన వారిని తాకవద్దు, నా ప్రవక్తలకు హాని చేయవద్దు అని ఆయన చెప్పాడు.

కీర్తన 105:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేశం మీదికి ఆయన కరువు రప్పించాడు. జీవనాధారమైన ధాన్యమంతా ధ్వంసం చేశాడు.

కీర్తన 105:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారికంటే ముందుగా ఆయన ఒకణ్ణి పంపించాడు. వారు యోసేపును బానిసగా అమ్మేశారు.

కీర్తన 105:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు సంకెళ్లతో అతని కాళ్లు నొప్పించారు. ఇనుము అతని ప్రాణాన్ని బాధించింది.

కీర్తన 105:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు చెప్పిన సంగతి నెరవేరేదాకా యెహోవా వాక్కు అతణ్ణి పరీక్షించాడు.

కీర్తన 105:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రాజు వర్తమానం పంపి అతణ్ణి విడిపించాడు. ప్రజల పాలకుడు అతణ్ణి విడుదల చేశాడు.

కీర్తన 105:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇష్టప్రకారం అతడు తన అధిపతులపై పెత్తనం చెయ్యడానికి, తన పెద్దలకు బుద్ధి చెప్పడానికి,

కీర్తన 105:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన ఇంటికి యజమానిగా, తన ఆస్తి అంతటిపై అధికారిగా అతణ్ణి నియమించాడు.

కీర్తన 105:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలు ఈజిప్టులోకి వచ్చాడు. యాకోబు హాము దేశంలో పరదేశిగా ఉన్నాడు.

కీర్తన 105:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన తన ప్రజల సంతానాన్ని వృద్ధి చేశాడు. వారి విరోధులకంటే వారికి అధికబలం దయచేశాడు.

కీర్తన 105:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన ప్రజలపై పగబట్టేలా తన సేవకుల పట్ల కుయుక్తిగా నడుచుకునేలా ఆయన వారి హృదయాలను మళ్ళించాడు.

కీర్తన 105:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన తన సేవకుడైన మోషేను, తాను ఏర్పరచుకున్న అహరోనును పంపించాడు.

కీర్తన 105:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు ఐగుప్తీయుల మధ్య ఆయన సూచక క్రియలను, హాము దేశంలో మహత్కార్యాలను జరిగించారు.

కీర్తన 105:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన అంధకారం పంపించి చీకటి కమ్మేలా చేశాడు. వారు ఆయన మాటను ఎదిరించలేదు.

కీర్తన 105:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన వారి జలాలను రక్తంగా మార్చాడు. వారి చేపలను చంపాడు.

కీర్తన 105:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారి దేశంలో కప్పలు నిండిపోయాయి. అవి వారి రాజుల గదుల్లోకి వచ్చాయి.

కీర్తన 105:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన ఆజ్ఞ ఇయ్యగా జోరీగలు పుట్టాయి. వారి ప్రాంతాలన్నిటిలోకీ దోమలు వచ్చాయి.

కీర్తన 105:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన వారిమీద వడగండ్ల వాన కురిపించాడు. వారి దేశంలో అగ్నిజ్వాలలు పుట్టించాడు.

కీర్తన 105:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారి ద్రాక్షతీగెలను, వారి అంజూరు చెట్లను పడగొట్టాడు. వారి ప్రాంతాల్లో వృక్షాలను విరగగొట్టాడు.

కీర్తన 105:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన ఆజ్ఞ ఇయ్యగా పెద్ద మిడతలు, లెక్కలేనన్ని చీడపురుగులు వచ్చాయి,

కీర్తన 105:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అవి వారి దేశంలోని కూరగాయల చెట్లన్నిటిని, వారి భూమి పంటలను తినివేశాయి.

కీర్తన 105:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారి దేశంలోని జ్యేష్ఠులను, వారి ప్రథమ సంతానాన్ని ఆయన హతం చేశాడు.

కీర్తన 105:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అక్కడనుండి తన ప్రజలను వెండి బంగారాలతో ఆయన రప్పించాడు. వారి గోత్రాల్లో నిస్సత్తువ చేత తొట్రిల్లేవాడొక్కడైనా లేడు.

కీర్తన 105:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారివలన ఐగుప్తీయులకు భయం వేసింది. వారు వెళ్లిపోయినప్పుడు ఐగుప్తీయులు సంతోషించారు.

కీర్తన 105:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారికి నీడగా ఆయన మేఘాన్ని కల్పించాడు. రాత్రి వెలుగివ్వడానికి అగ్నిని కలగజేశాడు.

కీర్తన 105:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించాడు. ఆకాశంలోనుండి ఆహారాన్నిచ్చి వారిని తృప్తి పరిచాడు.

కీర్తన 105:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
శిలను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చాయి. ఎడారుల్లో అవి ఏరులై ప్రవహించాయి.

కీర్తన 105:42 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే ఆయన తన పరిశుద్ధ వాగ్దానాన్ని, తన సేవకుడైన అబ్రాహామును జ్ఞాపకం చేసుకుని,

కీర్తన 105:43 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన ప్రజలను సంతోషంతోను, తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోను బయటికి రప్పించాడు.

కీర్తన 105:44 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అన్యజనుల భూములను ఆయన వారికప్పగించాడు. ఇతర జాతుల సౌభాగ్యాన్ని వారు స్వాధీనపరచుకున్నారు.

కీర్తన 105:45 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు తన కట్టడలను గైకొనేలా, తన ధర్మశాస్త్రవిధులను ఆచరించేలా చేయడానికి ఆయనిలా చేశాడు. యెహోవాను స్తుతించండి.

Available Bible Translations

American Standard Version
Psalms 105 (ASV) »
King James Version
Psalms 105 (KJV) »
GOD’S WORD® (GW)
Psalms 105 (GW) »
World English Bible
Psalms 105 (WEB) »
Louis Segond 1910
Psaumes 105 (LSG) »
Luther Bibel 1912
Psalm 105 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
भजन संहिता 105 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਜ਼ਬੂਰ 105 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
গীতমালা 105 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
சங்கீதங்கள் 105 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
स्तोत्रसंहिता 105 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ગીતશાસ્ત્ર 105 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಕೀರ್ತನೆಗಳು 105 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْمَزَامِيرُ 105 (AVD) »
תנ ך עברי מודרני
תהלים 105 (HEB) »
Bíblia Sagrada Português
Salmos 105 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Thánh Thi 105 (VIE) »
Reina Valera Antigua
Salmos 105 (RVA) »
La Sacra Bibbia
Salmi 105 (RIV) »
圣 经 简体中文和合本
诗 篇 105 (CUVS) »
聖 經 繁體中文和合本
詩 篇 105 (CUVT) »
Bibla e Shenjtë
Psalmet 105 (ALB) »
Svenska Bibeln 1917
Psaltaren 105 (SV1917) »
Библия на русском
Псалтирь 105 (RUSV) »
Українська Біблія
Псалми 105 (UKR) »
Szent Biblia - Magyar
Zsoltárok 105 (KAR) »
Българска Библия
Псалми 105 (BULG) »
聖書 日本語
詩篇 105 (JPN) »
Kitaabka Quduuska Ah
Sabuurradii 105 (SOM) »
De Heilige Schrift
Psalmen 105 (NLD) »
Dansk Bibel 1871
Salme 105 (DA1871) »

TELIRV Book Selection List