కీర్తన Chapter 37 TELIRV Bible Verse Images

కీర్తన 37 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share కీర్తన 37 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


కీర్తన 37:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దావీదు కీర్తన చెడ్డ వారిని చూసి నువ్వు క్షోభపడకు. అధర్మంగా ప్రవర్తించే వాళ్ళని చూసి అసూయ పడకు.

కీర్తన 37:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే వాళ్ళు గడ్డిలాగా త్వరలోనే ఎండిపోతారు. పచ్చటి మొక్కల్లా వాడి పోతారు.

కీర్తన 37:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవాలో నమ్మకం ఉంచు. ఏది మంచిదో దాన్నే చెయ్యి. దేశంలో స్థిరపడి విశ్వసనీయతను ఆచరించు.

కీర్తన 37:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తర్వాత యెహోవాలో ఆనందించు. నీ హృదయంలోని ఆశలన్నిటినీ ఆయన తీరుస్తాడు.

కీర్తన 37:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ జీవిత గమనాన్ని యెహోవాకు అప్పగించు. ఆయనలో నమ్మకముంచు. ఆయన నీ తరుపున పని చేస్తాడు.

కీర్తన 37:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పగటి వెలుగులా నీ న్యాయవర్తననూ, మధ్యాహ్నపు వెలుగులా నీ నిర్దోషత్వాన్నీ ఆయన చూపిస్తాడు.

కీర్తన 37:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా ఎదుట మౌనంగా ఉండు. సహనంతో ఆయన కోసం వేచి ఉండు. దుర్మార్గాలు చేసి ఎవరన్నా విజయం సాధిస్తే చింతించకు. ఎవరన్నా కుట్రలు చేస్తే విచారించకు.

కీర్తన 37:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కోపపడకు. నిరుత్సాహపడకు. చింతపడకు. దానివల్ల సమస్యలు కలుగుతాయి.

కీర్తన 37:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దుర్మార్గకార్యాలు చేసే వాళ్ళు నిర్మూలం అవుతారు. కానీ యెహోవా కోసం వేచి చూసే వాళ్ళు దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు.

కీర్తన 37:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇక కొద్ది కాలంలోగా దుర్మార్గుడు లేకుండా పోతాడు. అతడున్న స్థలాన్ని నువ్వు ఎంత వెదికినా అతడు కనిపించడు.

కీర్తన 37:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నమ్రత గలవాళ్ళు భూమిని స్వాధీనం చేసుకుంటారు. గొప్ప సమృద్ధి కలిగి సంతోషిస్తారు.

కీర్తన 37:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దుష్టుడు ధర్మాత్ముడికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తాడు. వాడు అతనికి విరోధంగా పళ్ళు కొరుకుతాడు.

కీర్తన 37:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాళ్ళ సమయం అయిపోవచ్చింది కాబట్టి ప్రభువు వాళ్ళను చూసి నవ్వుతాడు.

కీర్తన 37:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అణచివేతకి గురైన వాళ్ళనీ పేదలనీ నిరుత్సాహపరచడానికీ, నిజాయితీగా ఉండేవాళ్ళనీ చంపడానికీ దుష్టులు తమ కత్తులు దూశారు. తమ విల్లును వంచారు.

కీర్తన 37:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాళ్ళ కత్తులు వాళ్ళ గుండెల్నే చీల్చివేస్తాయి. వాళ్ళ విల్లులు విరిగిపోతాయి.

కీర్తన 37:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దుష్టుల దగ్గర ఉన్న సమృద్ధి కంటే ధర్మాత్ముడి దగ్గర ఉన్న కొంచెమే శ్రేష్ఠమైనది.

కీర్తన 37:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దుష్టుల చేతులు విరిగిపోతాయి. కానీ యెహోవా ధర్మాత్ములను కాపాడతాడు.

కీర్తన 37:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా నిందారహితులను ప్రతిరోజూ కనిపెట్టుకుని ఉంటాడు. వాళ్ళ వారసత్వం నిత్యమూ ఉంటుంది.

కీర్తన 37:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రోజులు బాగా లేనప్పుడు వాళ్ళకు అవమానం కలగదు. కరువు కాలంలో వాళ్ళకు చాలినంత ఆహారం ఉంటుంది.

కీర్తన 37:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే దుష్టులు నశించిపోతారు. యెహోవా విరోధుల కీర్తి పచ్చిక బయళ్ళ చందంగా ఉంటుంది. వాళ్ళు సమసిపోయి పొగలాగా కనిపించకుండా పోతారు.

కీర్తన 37:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దుష్టులు అప్పు చేస్తారు, కానీ తిరిగి చెల్లించరు. కానీ ధర్మాత్ములు దయతో దానం చేస్తారు.

కీర్తన 37:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా ఆశీర్వదించిన వాళ్ళు భూమిని స్వాధీనం చేసుకుంటారు. ఆయన ఎవరినైతే శపిస్తాడో వాళ్ళు నాశనమౌతారు.

కీర్తన 37:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుని దృష్టిలో ఏ వ్యక్తి మార్గం కొనియాడదగ్గదిగా ఉందో ఆ వ్యక్తి నడతను యెహోవా స్థిరపరుస్తాడు.

కీర్తన 37:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు కాబట్టి అతడు తన మార్గంలో తడబడినా కిందపడడు.

కీర్తన 37:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను ఒకప్పుడు చిన్నవాడిగా ఉన్నాను. ఇప్పుడు పెద్దవాణ్ణి అయ్యాను. అయితే నీతిమంతుడు అనాథ కావడం గానీ, లేదా అతడి పిల్లలు అడుక్కోవడం గానీ నేను చూడలేదు.

కీర్తన 37:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు రోజంతా దయతో అప్పులిస్తూ ఉంటాడు. అతని పిల్లలు ఆశీర్వాదంగా ఉంటారు.

కీర్తన 37:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చెడు నుండి మళ్ళుకో. ఏది మంచిదో దాన్ని చెయ్యి. అప్పుడు నువ్వు కలకాలం సురక్షితంగా ఉంటావు.

కీర్తన 37:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే యెహోవా న్యాయాన్ని ప్రేమిస్తాడు. విశ్వాసంతో తనను అనుసరించే వాళ్ళను ఆయన విడిచిపెట్టడు. వాళ్ళను శాశ్వతంగా భద్రపరుస్తాడు. అయితే దుర్మార్గుల సంతానం నాశనం అవుతుంది.

కీర్తన 37:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీతిమంతులు భూమిని స్వాధీనం చేసుకుంటారు. అక్కడ వాళ్ళు కలకాలం జీవిస్తారు.

కీర్తన 37:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీతిమంతుని నోరు జ్ఞానాన్ని పలుకుతుంది. అది న్యాయాన్ని అధికం చేస్తుంది.

కీర్తన 37:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని హృదయంలో అతని దేవుని ధర్మశాస్త్రం ఉంది. అతని అడుగులు జారవు.

కీర్తన 37:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దుర్మార్గుడు ధర్మాత్ముణ్ణి గమనిస్తూ ఉంటాడు. అతణ్ణి చంపడానికి చూస్తూ ఉంటాడు.

కీర్తన 37:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే యెహోవా అతణ్ణి దుష్టుడి చేతిలో వదిలిపెట్టడు. అతనికి తీర్పు జరిగే సమయంలో నేరం మోపడు.

కీర్తన 37:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా కోసం వేచి ఉండు. ఆయన మార్గాన్ని అనుసరించు. భూమిని స్వాధీనం చేసుకోవడానికి ఆయన నిన్ను లేపుతాడు. దుర్మార్గులు నిర్మూలమైనప్పుడు నువ్వు చూస్తావు.

కీర్తన 37:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
భీకరుడైన దుర్మార్గుడు స్వంత నేలలో పెరిగిన పెద్ద పచ్చని చెట్టులా విస్తరించడం నేను చూశాను.

కీర్తన 37:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే నేను ఆ దారిన వెళ్ళినప్పుడు నేను వాడి కోసం చూశానుగానీ వాడు నాకు కనిపించలేదు.

కీర్తన 37:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చిత్తశుద్ధి కలిగిన వ్యక్తిని గమనించు. యథార్ధంగా ఉండే వాణ్ణి కనిపెట్టు. శాంతి కోసం జీవించేవాడికి మంచి భవిష్యత్తు ఉంటుంది.

కీర్తన 37:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పాపులు సమూలంగా నాశనం అవుతారు. దుర్మార్గుడికి భవిష్యత్తు ఉండదు.

కీర్తన 37:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీతిపరులకు యెహోవా దగ్గరనుండే ముక్తి కలుగుతుంది. వేదన సమయంలో ఆయన వాళ్ళను కాపాడతాడు.

కీర్తన 37:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా వాళ్ళని దుర్మార్గుల బారినుంచి రక్షిస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఆయనలో ఆశ్రయం పొందారు.

Available Bible Translations

American Standard Version
Psalms 37 (ASV) »
King James Version
Psalms 37 (KJV) »
GOD’S WORD® (GW)
Psalms 37 (GW) »
World English Bible
Psalms 37 (WEB) »
Louis Segond 1910
Psaumes 37 (LSG) »
Luther Bibel 1912
Psalm 37 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
भजन संहिता 37 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਜ਼ਬੂਰ 37 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
গীতমালা 37 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
சங்கீதங்கள் 37 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
स्तोत्रसंहिता 37 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ગીતશાસ્ત્ર 37 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಕೀರ್ತನೆಗಳು 37 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْمَزَامِيرُ 37 (AVD) »
תנ ך עברי מודרני
תהלים 37 (HEB) »
Bíblia Sagrada Português
Salmos 37 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Thánh Thi 37 (VIE) »
Reina Valera Antigua
Salmos 37 (RVA) »
La Sacra Bibbia
Salmi 37 (RIV) »
圣 经 简体中文和合本
诗 篇 37 (CUVS) »
聖 經 繁體中文和合本
詩 篇 37 (CUVT) »
Bibla e Shenjtë
Psalmet 37 (ALB) »
Svenska Bibeln 1917
Psaltaren 37 (SV1917) »
Библия на русском
Псалтирь 37 (RUSV) »
Українська Біблія
Псалми 37 (UKR) »
Szent Biblia - Magyar
Zsoltárok 37 (KAR) »
Българска Библия
Псалми 37 (BULG) »
聖書 日本語
詩篇 37 (JPN) »
Det Norsk Bibel
Salmene 37 (NORSK) »
Biblia Takatifu
Zaburi 37 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Sabuurradii 37 (SOM) »
De Heilige Schrift
Psalmen 37 (NLD) »
Dansk Bibel 1871
Salme 37 (DA1871) »

TELIRV Book Selection List