ఆదికాండం Chapter 27 TELIRV Bible Verse Images

ఆదికాండం 27 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ఆదికాండం 27 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


ఆదికాండం 27:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇస్సాకు బాగా ముసలి వాడయ్యాడు. అతని కళ్ళు పూర్తిగా మసకబారాయి. ఆ పరిస్థితిలో అతడు తన పెద్ద కుమారుడు ఏశావుతో “నా కొడుకా” అని పిలిచాడు. అతడు “చిత్తం నాన్నగారూ” అన్నాడు.

ఆదికాండం 27:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ఇస్సాకు “చూడు, నేను ముసలివాణ్ణి. ఎప్పుడు చనిపోతానో తెలియదు.

ఆదికాండం 27:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి నువ్వు నీ ఆయుధాలు అమ్ముల పొదినీ, విల్లునీ తీసుకుని అడవికి వెళ్ళి అక్కడ నాకోసం వేటాడి మాంసం తీసుకురా.

ఆదికాండం 27:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దాన్ని నాకోసం రుచికరంగా వండి తీసుకురా. నాకిష్టమైన వంటకాలు సిద్ధం చేసి పట్టుకు వస్తే నేను చనిపోక ముందు వాటిని తిని నిన్ను ఆశీర్వదిస్తాను” అన్నాడు.

ఆదికాండం 27:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇస్సాకు తన కొడుకు ఏశావుతో ఇలా చెప్తుంటే రిబ్కా వీరికి తెలియకుండా చాటు నుండి వింటూ ఉంది. ఏశావు వేటాడి మాంసం తీసుకు రావడానికి అడవికి వెళ్ళాడు.

ఆదికాండం 27:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు రిబ్కా తన కొడుకు యాకోబుతో “జాగ్రత్తగా విను. మీ నాన్న నీ అన్నతో మాట్లాడటం నేను విన్నాను. ఆయన నీ అన్నతో

ఆదికాండం 27:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
‘నేను చనిపోక ముందు భోజనం చేసి యెహోవా సముఖంలో నిన్ను ఆశీర్వదిస్తాను. కాబట్టి నువ్వు వేటాడి మాంసం తెచ్చి నాకోసం రుచిగా వండి తీసుకురా’ అన్నాడు.

ఆదికాండం 27:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కొడుకా, కాబట్టి ఇప్పుడు నా మాట విను. నేను నీకు చెప్పింది చెయ్యి.

ఆదికాండం 27:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నువ్వు మంద దగ్గరికి వెళ్ళి రెండు మంచి మేక పిల్లలను పట్టుకుని రా. నేను వాటితో మీ నాన్నఇష్టపడే విధంగా రుచిగా భోజనం తయారు చేస్తాను.

ఆదికాండం 27:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ నాన్న చనిపోకముందు వాటిని తిని నిన్ను ఆశీర్వదించేలా దాన్ని నువ్వు ఆయన దగ్గరికి తీసుకు వెళ్ళు” అంది.

ఆదికాండం 27:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దానికి యాకోబు తన తల్లితో “నా అన్న ఏశావుకు ఒళ్ళంతా జుట్టు ఉంది. నేను నున్నగా ఉంటాను.

ఆదికాండం 27:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒకవేళ మా నాన్న నన్ను తడిమి చూశాడనుకో. అప్పుడు నేను అతని దృష్టికి ఒక మోసగాడిలా ఉంటాను. అప్పుడిక నా మీదికి ఆశీర్వాదం స్థానంలో శాపం వస్తుంది” అన్నాడు.

ఆదికాండం 27:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కానీ అతని తల్లి “కొడుకా, ఆ శాపం నాపైకి వస్తుంది గాక! నువ్వు మాత్రం నా మాట విను. వెళ్ళి నేను చెప్పినట్టు వాటిని నా దగ్గరికి తీసుకుని రా” అని చెప్పింది.

ఆదికాండం 27:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి యాకోబు రెండు మేక పిల్లలను పట్టుకుని వాటిని తన తల్లి దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఆమె వాటితో అతని తండ్రి ఇష్టపడే విధంగా రుచికరంగా వండి భోజనం సిద్ధం చేసింది.

ఆదికాండం 27:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రిబ్కా ఇంట్లో ఆమె పెద్ద కొడుకు ఏశావుకు చెందిన మంచి బట్టలు ఉన్నాయి.

ఆదికాండం 27:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆమె వాటిని యాకోబుకు తొడిగింది. మేక పిల్లల చర్మాన్ని అతని మెడ పైని నున్నని భాగంలో కప్పింది.

ఆదికాండం 27:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తాను వండి సిద్ధం చేసిన రుచికరమైన వంటకాలనూ రొట్టెనూ తన కొడుకైన యాకోబు చేతికిచ్చింది.

ఆదికాండం 27:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు తన తండ్రి దగ్గరికి వచ్చాడు. నాన్నగారూ, అని పిలిచాడు. ఇస్సాకు “కొడుకా ఏమిటి? నువ్వు ఎవరివి?” అని అడిగాడు.

ఆదికాండం 27:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దానికి యాకోబు “నేను ఏశావుని. నీ పెద్ద కొడుకుని. నువ్వు నాకు చెప్పినట్టే చేశాను. లేచి నేను వేటాడి తెచ్చిన దాన్ని తిని నన్ను ఆశీర్వదించు” అన్నాడు.

ఆదికాండం 27:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ఇస్సాకు తన కొడుకుతో “నా కొడుకా అది ఇంత త్వరగా నీకు ఎలా దొరికింది?” అన్నాడు. దానికి యాకోబు “నీ దేవుడైన యెహోవా దాన్ని నా ఎదుటికి రప్పించాడు. అందుకే ఇంత త్వరగా దొరికింది” అన్నాడు.

ఆదికాండం 27:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ఇస్సాకు “నా కొడుకా, నువ్వు ఏశావువి అవునో కాదో తడిమి చూస్తా. దగ్గరికి రా” అన్నాడు.

ఆదికాండం 27:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. అతడు యాకోబును తడిమి చూసి ఇలా అన్నాడు. “స్వరం యాకోబుది కానీ చేతులు ఏశావు చేతులే” అన్నాడు.

ఆదికాండం 27:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యాకోబు చేతులు అతని అన్న అయిన ఏశావు చేతుల్లా జుట్టు కలిగి ఉండటంతో ఇస్సాకు యాకోబును గుర్తు పట్టలేకపోయాడు. కాబట్టి ఇస్సాకు అతణ్ణి ఆశీర్వదించాడు.

ఆదికాండం 27:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“నువ్వు నిజంగా నా కొడుకు ఏశావువేనా?” అని అడిగాడు. యాకోబు “అవును నేనే” అన్నాడు.

ఆదికాండం 27:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ఇస్సాకు “ఆ ఆహారం తీసుకురా. నువ్వు వేటాడి తెచ్చిన దాన్ని నేను తిని నిన్ను ఆశీర్వదిస్తాను” అన్నాడు. యాకోబు ఆహారం తీసుకు వచ్చాడు. దాన్ని అతడు తిన్నాడు. ద్రాక్షారసం తీసుకు వస్తే తాగాడు.

ఆదికాండం 27:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు అతని తండ్రి అయిన ఇస్సాకు “నా కొడుకా, దగ్గరికి వచ్చి నాకు ముద్దు పెట్టు” అన్నాడు.

ఆదికాండం 27:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యాకోబు దగ్గరికి వచ్చి అతణ్ణి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ఇస్సాకు అతని బట్టలు వాసన చూసి అతణ్ణి ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు. “చూడు, నా కొడుకు సువాసన, యెహోవా ఆశీర్వదించిన చేని సువాసనలాగా ఉంది.

ఆదికాండం 27:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆకాశం నుండి కురిసే మంచులో ఒక భాగాన్నీ, భూమి సమృద్దిలో ఒక భాగాన్నీ, విస్తారమైన ధాన్యాన్నీ, ద్రాక్షారసాన్నీ, దేవుడైన యెహోవా నీకు అనుగ్రహిస్తాడు గాక!

ఆదికాండం 27:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనుషులు నీకు సేవలు చేస్తారు గాక! జాతులు నీ ముందు సాగిలపడతారు గాక! నీ బంధువులందరికీ నువ్వు రాజువి అవుతావు. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడతారు గాక! నిన్ను శపించేవారు శాపానికి గురి అవుతారు గాక! నిన్ను ఆశీర్వదించే వారికి ఆశీర్వాదం కలుగు గాక.”

ఆదికాండం 27:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇలా ఇస్సాకు యాకోబును ఆశీర్వదించిన తరువాత యాకోబు తన తండ్రి ఇస్సాకు దగ్గర్నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే అతని అన్న వేట నుండి తిరిగి వచ్చాడు.

ఆదికాండం 27:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు కూడా రుచికరమైన ఆహారం సిద్ధం చేసి తన తండ్రి దగ్గరికి తెచ్చాడు. “నాన్నా, నీ కొడుకు వేటాడి తెచ్చిన దాన్ని తిని నన్ను ఆశీర్వదించు” అని తండ్రితో అన్నాడు.

ఆదికాండం 27:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని తండ్రి అయిన ఇస్సాకు “నువ్వు ఎవరివి?” అని అడిగాడు. అతడు “నేను నీ కొడుకుని. ఏశావు అనే నీ పెద్ద కొడుకుని” అన్నాడు.

ఆదికాండం 27:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దాంతో ఇస్సాకు గడగడ వణికిపోయాడు. “అలా అయితే వేటాడిన మాంసం నా దగ్గరికి పట్టుకు వచ్చినదెవరు? నువ్వు రాకముందు నేను వాటన్నిటినీ తిని అతణ్ణి ఆశీర్వదించాను. తప్పనిసరిగా అతడే దీవెన పొందినవాడు.”

ఆదికాండం 27:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏశావు తన తండ్రి మాటలు విని ఎంతో వేదనతో పెద్ద కేక పెట్టాడు. ఏడ్చాడు. తన తండ్రితో “నాన్నా, నన్ను కూడా ఆశీర్వదించు” అన్నాడు.

ఆదికాండం 27:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇస్సాకు “నీ తమ్ముడు మోసంతో వేషం వేసుకుని వచ్చి నీ ఆశీర్వాదాన్ని తీసుకువెళ్ళాడు” అన్నాడు.

ఆదికాండం 27:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏశావు ఇలా అన్నాడు. “యాకోబు అనే పేరు వాడికి చక్కగా సరిపోయింది. వాడు నన్ను రెండు సార్లు మోసం చేశాడు. నా జ్యేష్ఠత్వపు జన్మహక్కు తీసుకున్నాడు. ఇప్పుడు నాకు రావలసిన ఆశీర్వాదం తీసుకు పోయాడు.” ఇలా చెప్పి ఏశావు తన తండ్రిని “నాకోసం ఇక ఏ ఆశీర్వాదమూ మిగల్చలేదా?” అని అడిగాడు.

ఆదికాండం 27:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు ఇస్సాకు “చూడు, అతణ్ణి నీకు యజమానిగా నియమించాను. అతని బంధువులందరినీ అతనికి సేవకులుగా ఇచ్చాను. ధాన్యాన్నీ కొత్త ద్రాక్షారసాన్నీ అతనకి ఇచ్చాను? ఇవి కాక నీకు ఇంకా ఏ ఆశీర్వాదాలు మిగిలి ఉన్నాయి?” అన్నాడు.

ఆదికాండం 27:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏశావు తన తండ్రితో “నాన్నా, నీ దగ్గర ఒక్క ఆశీర్వాదమూ లేదా? నాన్నా, నన్ను కూడా ఆశీర్వదించు” అంటూ గట్టిగా ఏడ్చాడు.

ఆదికాండం 27:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని తండ్రి ఇస్సాకు అతనికిలా జవాబిచ్చాడు. “చూడు, నీ నివాసం భూసారానికి దూరంగా ఉంటుంది. పైనుండి ఆకాశపు మంచు దాని మీద కురవదు.

ఆదికాండం 27:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నువ్వు నీ కత్తి మీద ఆధారపడి జీవిస్తావు. నీ తమ్ముడికి దాసుడివి అవుతావు. కానీ నువ్వు తిరగబడితే అతని కాడిని నీ మెడపైనుండి విరిచి వేస్తావు.”

ఆదికాండం 27:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యకోబుకు తన తండ్రి ఇచ్చిన ఆశీర్వాదం విషయమై ఏశావు అతణ్ణి ద్వేషించాడు. ఏశావు ఇలా అనుకున్నాడు. “నా తండ్రి చనిపోయే రోజు ఎంతో దూరం లేదు. అది అయ్యాక నా తమ్ముడు యాకోబును చంపుతాను.”

ఆదికాండం 27:42 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన పెద్దకొడుకు ఏశావు పలికిన ఈ మాటలను గూర్చి రిబ్కా వింది. ఆమె తన చిన్నకొడుకు యాకోబును పిలిపించింది. అతనితో “చూడు, నీ అన్న ఏశావు నిన్ను చంపుతాను అనుకుంటూ తనను తాను ఓదార్చుకుంటున్నాడు.

ఆదికాండం 27:43 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి కొడుకా, నా మాట విను. హారానులో ఉన్న నా సోదరుడు లాబాను దగ్గరికి పారిపో.

ఆదికాండం 27:44 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ అన్న కోపం చల్లారే వరకూ కొద్ది రోజులు అక్కడే అతనితోనే ఉండు.

ఆదికాండం 27:45 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ అన్న కోపం పూర్తిగా చల్లారిపోయి, నువ్వు అతనికి చేసిన దాన్ని అతడు మర్చిపోయే వరకూ అక్కడ ఉండు. అప్పుడు నేను అక్కడనుండి నిన్ను పిలిపిస్తాను. ఒక్క రోజులోనే నేను మీ ఇద్దరినీ పోగొట్టుకోవడం ఎందుకు?” అంది.

ఆదికాండం 27:46 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రిబ్కా ఇస్సాకుతో “ఏశావు పెళ్ళాడిన హేతు జాతి స్త్రీల వల్ల నా ప్రాణం విసిగిపోయింది. ఈ దేశపు అమ్మాయిలైన హేతు కుమార్తెల్లో వీళ్ళలాంటి మరో అమ్మాయిని యాకోబు కూడా పెళ్ళి చేసుకుంటే ఇక నేను బతికి ఏం ప్రయోజనం?” అంది.

Available Bible Translations

American Standard Version
Genesis 27 (ASV) »
King James Version
Genesis 27 (KJV) »
GOD’S WORD® (GW)
Genesis 27 (GW) »
World English Bible
Genesis 27 (WEB) »
Louis Segond 1910
Genèse 27 (LSG) »
Luther Bibel 1912
Genesis 27 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
उत्पत्ति 27 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਪੈਦਾਇਸ਼ 27 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
আদি 27 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
ஆதியாகமம் 27 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
उत्पत्ति 27 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ઉત્પત્તિ 27 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಆದಿಕಾಂಡ 27 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلتَّكْوِينُ 27 (AVD) »
תנ ך עברי מודרני
בראשית 27 (HEB) »
Bíblia Sagrada Português
Gênesis 27 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Sáng Thế 27 (VIE) »
Reina Valera Antigua
Génesis 27 (RVA) »
La Sacra Bibbia
Genesi 27 (RIV) »
圣 经 简体中文和合本
创 世 纪 27 (CUVS) »
聖 經 繁體中文和合本
創 世 記 27 (CUVT) »
Bibla e Shenjtë
Zanafilla 27 (ALB) »
Svenska Bibeln 1917
1 Mosebok 27 (SV1917) »
Библия на русском
Бытие 27 (RUSV) »
Українська Біблія
Буття 27 (UKR) »
Szent Biblia - Magyar
1 Mózes 27 (KAR) »
Българска Библия
Битие 27 (BULG) »
聖書 日本語
創世記 27 (JPN) »
Biblia Takatifu
Mwanzo 27 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Bilowgii 27 (SOM) »
De Heilige Schrift
Genesis 27 (NLD) »

ఆదికాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List