ఆదికాండం Chapter 38 TELIRV Bible Verse Images

ఆదికాండం 38 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ఆదికాండం 38 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


ఆదికాండం 38:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ కాలంలో యూదా తన సోదరులను విడిచిపెట్టి హీరా అనే ఒక అదుల్లాము వాడితో నివసించాడు.

ఆదికాండం 38:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అక్కడ షూయ అనే ఒక కనానీ యువతిని చూసి ఆమెను వివాహమాడి ఆమెతో కాపురం చేశాడు.

ఆదికాండం 38:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆమె గర్భవతి అయ్యి ఒక కొడుకును కన్నప్పుడు వాడికి ఏరు అని పేరు పెట్టారు.

ఆదికాండం 38:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆమె మళ్ళీ గర్భం ధరించి మరొక కొడుకును కని వాడికి ఓనాను అని పేరు పెట్టింది.

ఆదికాండం 38:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆమె మళ్ళీ గర్భం ధరించి మూడవ కొడుకును కని వాడికి షేలా అని పేరు పెట్టింది. వారు కజీబులో ఉన్నప్పుడు ఆమె వాణ్ణి కన్నది.

ఆదికాండం 38:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదా తన పెద్ద కొడుకు ఏరుకి తామారు అనే యువతిని పెళ్ళి చేశాడు.

ఆదికాండం 38:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదా జ్యేష్ఠ కుమారుడు ఏరు యెహోవా దృష్టికి దుష్టుడు కాబట్టి యెహోవా అతణ్ణి చంపాడు.

ఆదికాండం 38:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు యూదా ఓనానుతో “నీ అన్నభార్య దగ్గరికి వెళ్ళి మరిది ధర్మం జరిగించి నీ అన్నకి సంతానం కలిగించు” అని చెప్పాడు.

ఆదికాండం 38:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఓనాను ఆ సంతానం తనది కాబోదని తెలిసి ఆమెతో పండుకున్నప్పుడు తన అన్నకి సంతానం కలగకూడదని తన వీర్యాన్ని నేలపై విడిచాడు.

ఆదికాండం 38:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు చేసింది యెహోవా దృష్టికి చెడ్డది కాబట్టి ఆయన అతణ్ణి కూడా చంపాడు.

ఆదికాండం 38:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు యూదా ఇతడు కూడా ఇతని అన్నల్లాగా చనిపోతాడేమో అని భయపడి “నా కుమారుడు షేలా పెద్దవాడయ్యే వరకూ నీ తండ్రి ఇంట్లో విధవరాలుగా ఉండు” అని తామారుతో చెప్పాడు. కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట్లో నివసించింది.

ఆదికాండం 38:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చాలా రోజుల తరువాత యూదా భార్య అయిన షూయ కూతురు చనిపోయింది. తరువాత యూదా దుఃఖనివారణ పొంది, అదుల్లామీయుడైన హీరా అనే తన స్నేహితుడితో కలిసి తిమ్నాతులో తన గొర్రెల బొచ్చు కత్తిరించే వారి దగ్గరికి వెళ్ళాడు.

ఆదికాండం 38:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి తిమ్నాతుకు వెళ్తున్నాడని తామారుకు తెలిసింది.

ఆదికాండం 38:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షేలా పెద్దవాడైనప్పటికీ తనను అతనికి భార్యగా తీసుకోకుండా ఉండడం చూసి తామారు తన విధవరాలి బట్టలు తీసివేసి, ముసుగు వేసుకుని, శరీరమంతా కప్పుకుని, తిమ్నాతుకు వెళ్ళే మార్గంలో ఏనాయిము అనే ద్వారం దగ్గర కూర్చుంది.

ఆదికాండం 38:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదా ఆమెను చూసి, ఆమె ముఖం కప్పుకుని ఉండడం వలన ఆమె వేశ్య అనుకుని,

ఆదికాండం 38:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆమె దగ్గరికి వెళ్ళి, ఆమె తన కోడలని తెలియక “నీతో సుఖిస్తాను, రా” అని పిలిచాడు. అందుకు ఆమె “నువ్వు నాతో సుఖించినందుకు నాకేమిస్తావు?” అని అడిగింది.

ఆదికాండం 38:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు అతడు “నా మందలో నుండి ఒక మేక పిల్లను పంపుతాను” అన్నాడు. ఆమె “అది పంపే వరకూ ఏమైనా తాకట్టు పెడితే సరే” అని అంది.

ఆదికాండం 38:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు “ఏమి తాకట్టు పెట్టమంటావ్?” అని ఆమెను అడిగాడు. ఆమె “నీ ముద్ర, దాని దారం, నీ చేతికర్ర” అని చెప్పింది. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో వెళ్ళాడు. ఆమె అతని వలన గర్భవతి అయ్యింది.

ఆదికాండం 38:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడామె లేచి వెళ్లిపోయి ముసుగు తీసేసి తన విధవరాలి వస్త్రాలు ధరించింది.

ఆదికాండం 38:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరవాత యూదా ఆ స్త్రీ దగ్గర నుండి ఆ తాకట్టు వస్తువులను తీసుకోడానికి తన స్నేహితుడయిన అదుల్లామీయుడి ద్వారా మేకపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు.

ఆదికాండం 38:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి అతడు “ఆ మార్గంలో ఏనాయిము దగ్గర కనిపించిన ఆ వేశ్య ఎక్కడ ఉంది?” అని అక్కడి మనుషులను అడిగాడు. అయితే వారు “ఇక్కడ వేశ్య ఎవరూ లేదు” అని అతనికి చెప్పారు.

ఆదికాండం 38:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి అతడు యూదా దగ్గరికి తిరిగి వెళ్ళి “ఆమె నాకు కనబడలేదు. అంతేగాక, అక్కడి మనుషులు ఇక్కడికి వేశ్య ఎవరూ రాలేదని చెప్పారు” అన్నాడు.

ఆదికాండం 38:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదా “మనలను అపహాస్యం చేస్తారేమో, ఆమె వాటిని ఉంచుకోనీ. నేను నీతో ఈ మేక పిల్లను పంపాను, ఆమె నీకు కనబడలేదు” అని అతనితో అన్నాడు.

ఆదికాండం 38:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సుమారు మూడు నెలలైన తరువాత “నీ కోడలు తామారు జారత్వం జరిగించింది. అంతేకాక ఆమె జారత్వం వలన గర్భవతి అయ్యింది” అని యూదాకు కబురొచ్చింది. అప్పుడు యూదా “ఆమెను తీసుకు రండి, ఆమెను సజీవ దహనం చెయ్యాలి” అని చెప్పాడు.

ఆదికాండం 38:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆమెను బయటికి తీసుకు వచ్చినప్పుడు, ఆమె తన మామ దగ్గరికి అతని వస్తువులను పంపి “ఇవి ఎవరివో ఆ మనిషి వలన నేను గర్భవతినయ్యాను. ఈ ముద్ర, ఈ దారం, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తు పట్టండి” అని చెప్పించింది.

ఆదికాండం 38:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదా వాటిని గుర్తు పట్టి “నేను నా కుమారుడు షేలాను ఆమెకు ఇయ్యలేదు కాబట్టి ఆమె నాకంటే నీతి గలది” అని చెప్పి ఇంకెప్పుడూ ఆమెతో పండుకోలేదు.

ఆదికాండం 38:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నెలలు నిండినప్పుడు ఆమె గర్భంలో కవలలు ఉన్నారు.

ఆదికాండం 38:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆమె ప్రసవిస్తున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాపాడు. మంత్రసాని ఒక ఎర్ర దారం వాడి చేతికి కట్టి “వీడు మొదట బయటికి వచ్చాడు” అని చెప్పింది.

ఆదికాండం 38:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాడు తన చెయ్యి వెనక్కి తీయగానే అతని సోదరుడు బయటికి వచ్చాడు. అప్పుడామె “నువ్వెందుకురా చొచ్చుకు వచ్చావు?” అంది. అందుచేత వాడికి “పెరెసు” అని పేరు పెట్టారు.

ఆదికాండం 38:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ తరువాత చేతికి దారం కట్టి ఉన్న అతని సోదరుడు బయటికి వచ్చాడు. అతనికి “జెరహు” అని పేరు పెట్టారు.

Available Bible Translations

American Standard Version
Genesis 38 (ASV) »
King James Version
Genesis 38 (KJV) »
GOD’S WORD® (GW)
Genesis 38 (GW) »
World English Bible
Genesis 38 (WEB) »
Louis Segond 1910
Genèse 38 (LSG) »
Luther Bibel 1912
Genesis 38 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
उत्पत्ति 38 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਪੈਦਾਇਸ਼ 38 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
আদি 38 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
ஆதியாகமம் 38 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
उत्पत्ति 38 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ઉત્પત્તિ 38 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಆದಿಕಾಂಡ 38 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلتَّكْوِينُ 38 (AVD) »
תנ ך עברי מודרני
בראשית 38 (HEB) »
Bíblia Sagrada Português
Gênesis 38 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Sáng Thế 38 (VIE) »
Reina Valera Antigua
Génesis 38 (RVA) »
La Sacra Bibbia
Genesi 38 (RIV) »
圣 经 简体中文和合本
创 世 纪 38 (CUVS) »
聖 經 繁體中文和合本
創 世 記 38 (CUVT) »
Bibla e Shenjtë
Zanafilla 38 (ALB) »
Svenska Bibeln 1917
1 Mosebok 38 (SV1917) »
Библия на русском
Бытие 38 (RUSV) »
Українська Біблія
Буття 38 (UKR) »
Szent Biblia - Magyar
1 Mózes 38 (KAR) »
Българска Библия
Битие 38 (BULG) »
聖書 日本語
創世記 38 (JPN) »
Biblia Takatifu
Mwanzo 38 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Bilowgii 38 (SOM) »
De Heilige Schrift
Genesis 38 (NLD) »

ఆదికాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List