ఆదికాండం Chapter 37 TELIRV Bible Verse Images

ఆదికాండం 37 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ఆదికాండం 37 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


ఆదికాండం 37:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యాకోబు తన తండ్రి పరదేశీయుడుగా ఉండిన కనాను దేశంలో నివసించాడు.

ఆదికాండం 37:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యాకోబు జీవిత వృత్తాంతం ఇది. యోసేపు పదిహేనేళ్ళ వాడుగా ఉన్నప్పుడు తన సోదరులతో కూడ మందను మేపుతూ ఉన్నాడు. అతడు చిన్నవాడుగా తన తండ్రి భార్యలైన బిల్హా కొడుకుల దగ్గరా జిల్పా కొడుకుల దగ్గరా ఉండేవాడు. అప్పుడు యోసేపు వారి చెడ్డ పనులను గూర్చిన సమాచారం వారి తండ్రికి చేరవేసేవాడు.

ఆదికాండం 37:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యంలో పుట్టిన కొడుకు కాబట్టి తన కొడుకులందరికంటే అతణ్ణి ఎక్కువగా ప్రేమించి అతని కోసం ఒక అందమైన నిలువుటంగీ కుట్టించాడు.

ఆదికాండం 37:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని సోదరులు తమ తండ్రి అతణ్ణి తమందరికంటే ఎక్కువగా ప్రేమించడం వలన అతని మీద పగపట్టి, అతనితో ఎప్పుడూ ప్రేమగా మాట్లాడేవారు కాదు.

ఆదికాండం 37:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోసేపు ఒక కల కని తన సోదరులతో దాన్ని గూర్చి చెప్పినప్పుడు వారు అతని మీద మరింత పగపట్టారు.

ఆదికాండం 37:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు వారితో ఇలా చెప్పాడు. “నేను కన్న ఈ కల మీరూ వినండి.

ఆదికాండం 37:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అదేమిటంటే మనం పొలంలో ధాన్యం కట్టలు కడుతూ ఉన్నాం. నా కట్ట లేచి నిలబడగానే మీ కట్టలు దాని చుట్టూ చేరి నా కట్టకి సాష్టాంగపడ్డాయి.”

ఆదికాండం 37:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు అతని సోదరులు “నువ్వు నిజంగానే మమ్మల్ని ఏలుతావా? మామీద నువ్వు అధికారివి అవుతావా” అని అతనితో చెప్పి, అతని కలలను బట్టీ అతని మాటలను బట్టీ అతని మీద మరింత పగ పెంచుకున్నారు.

ఆదికాండం 37:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడింకొక కల కని తన సోదరులతో “ఇదిగో నేను మరొక కల గన్నాను. అందులో సూర్య చంద్రులూ, పదకొండు నక్షత్రాలూ నాకు సాష్టాంగ పడ్డాయి” అని చెప్పాడు.

ఆదికాండం 37:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు తన తండ్రితో, తన అన్నలతో అది చెప్పాడు. అతని తండ్రి అతనితో “నువ్వు కన్న ఈ కల ఏమిటి? నేనూ నీ తల్లీ నీ అన్నలూ నిజంగా నీకు సాష్టాంగపడాలా?” అని అతణ్ణి గద్దించాడు.

ఆదికాండం 37:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని సోదరులు అతనిపై కక్ష పెంచుకున్నారు. అయితే అతని తండ్రి ఆ మాటలు జ్ఞాపకం ఉంచుకున్నాడు.

ఆదికాండం 37:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోసేపు సోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపడానికి వెళ్ళారు.

ఆదికాండం 37:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో “నీ సోదరులు షెకెములో మందను మేపుతున్నారు. నిన్ను వారి దగ్గరికి పంపుతాను, రా” అన్నప్పుడు అతడు “అలాగే” అని చెప్పాడు.

ఆదికాండం 37:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు యాకోబు “నువ్వు వెళ్ళి నీ సోదరుల క్షేమాన్ని, మంద క్షేమాన్ని తెలుసుకుని నాకు కబురు తీసుకురా” అని అతనితో చెప్పి హెబ్రోను లోయ నుండి అతణ్ణి పంపించాడు. అతడు షెకెముకు వచ్చాడు.

ఆదికాండం 37:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోసేపు పొలంలో ఇటు అటు తిరుగుతూ ఉండగా ఒక మనిషి అతణ్ణి చూసి “దేని గురించి వెదుకుతున్నావు?” అని అడిగాడు.

ఆదికాండం 37:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకతడు “నేను నా సోదరులను వెదుకుతున్నాను. వారు మందను ఎక్కడ మేపుతున్నారో దయచేసి నాకు చెప్పు” అని అడిగాడు.

ఆదికాండం 37:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు ఆ మనిషి “వారు ఇక్కడి నుండి వెళ్ళిపోయారు. వారు ‘దోతానుకు వెళ్దాం పదండి’ అని చెప్పుకోవడం నేను విన్నాను” అని చెప్పాడు. అప్పుడు యోసేపు తన సోదరుల కోసం వెదుకుతూ వెళ్ళి దోతానులో వారిని కనుగొన్నాడు.

ఆదికాండం 37:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు దగ్గరికి రాక ముందే వారు అతణ్ణి దూరం నుండి చూసి అతణ్ణి చంపడానికి దురాలోచన చేశారు.

ఆదికాండం 37:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు “అడుగో, కలలు కనేవాడు వస్తున్నాడు.

ఆదికాండం 37:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వీణ్ణి చంపి ఒక గుంటలో పారేసి, ‘ఏదో క్రూర జంతువు వీణ్ణి చంపి తినేసింది’ అని చెబుదాం. అప్పుడు వీడి కలలేమౌతాయో చూద్దాం” అని ఒకరి కొకరు చెప్పుకున్నారు.

ఆదికాండం 37:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రూబేను ఆ మాట విని “మనం వాణ్ణి చంపకూడదు” అని చెప్పి వారి చేతుల్లో చావకుండా యోసేపును తప్పించాడు.

ఆదికాండం 37:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎలాగంటే రూబేను అతణ్ణి తమ తండ్రికి అప్పగించాలని, వారు అతణ్ణి చంపకుండా విడిపించాలని ఉద్దేశించి “రక్తం చిందించ వద్దు. అతణ్ణి చంపకుండా అడవిలో ఉన్న ఈ గుంటలో తోసేయండి” అని వారితో చెప్పాడు.

ఆదికాండం 37:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోసేపు తన సోదరుల దగ్గరికి వచ్చినప్పుడు వారు యోసేపు తొడుక్కొన్న ఆ అందమైన నిలువుటంగీని తీసేసి,

ఆదికాండం 37:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతణ్ణి పట్టుకుని ఆ గుంటలో పడదోశారు. అది నీళ్ళు లేని వట్టి గుంట.

ఆదికాండం 37:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు భోజనానికి కూర్చున్నపుడు, ఐగుప్తుకు సుగంధ ద్రవ్యాలు, మస్తకి, బోళం మోసుకుపోతున్న ఒంటెలతో ఇష్మాయేలీ యాత్రికులు గిలాదు నుండి రావడం చూశారు.

ఆదికాండం 37:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు యూదా “మనం మన తమ్ముణ్ణి చంపి వాడి చావుని దాచిపెట్టడం వలన ఏం ప్రయోజనం?

ఆదికాండం 37:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ ఇష్మాయేలీయులకు వాణ్ణి అమ్మేద్దాం రండి. ఎలాగైనా వాడు మన తమ్ముడు, మన రక్త సంబంధి గదా? వాడిని చంపకూడదు” అని తన సోదరులతో చెప్పాడు. అందుకు అతని సోదరులు అంగీకరించారు.

ఆదికాండం 37:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ మిద్యాను వర్తకులు దగ్గరికి వచ్చినపుడు వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు ఇరవై షెకెల్ ల వెండికి అతణ్ణి అమ్మేశారు. వారు యోసేపును ఐగుప్తుకు తీసుకుపోయారు.

ఆదికాండం 37:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రూబేను ఆ గుంట దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు యోసేపు అందులో లేకపోవడంతో అతడు తన బట్టలు చింపుకున్నాడు.

ఆదికాండం 37:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు తన సోదరుల దగ్గరికి వెళ్ళి “చిన్నవాడు లేడే, అయ్యో, నేనెక్కడికి వెళతాను?” అన్నాడు.

ఆదికాండం 37:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు ఒక మేకపిల్లను చంపి, యోసేపు అంగీని దాని రక్తంలో తడిపారు.

ఆదికాండం 37:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు దాన్ని తమ తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి “ఇది మాకు దొరికింది. ఇది నీ కొడుకు అంగీనో కాదో చూడు” అన్నారు.

ఆదికాండం 37:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు దాన్ని గుర్తుపట్టి “ఈ అంగీ నా కొడుకుదే, ఏదో ఒక క్రూర జంతువు వాణ్ణి చంపి తినేసింది. తప్పనిసరిగా అది యోసేపును చీల్చేసి ఉంటుంది” అన్నాడు.

ఆదికాండం 37:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యాకోబు తన బట్టలు చింపుకుని తన నడుముకు గోనెపట్ట కట్టుకుని చాలా రోజులు తన కొడుకు కోసం దుఃఖించాడు.

ఆదికాండం 37:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని కొడుకులు, కూతుర్లు అందరూ అతణ్ణి ఓదార్చడానికి ప్రయత్నం చేశారు గానీ అతడు ఓదార్పు పొందలేదు. “నేను ఏడుస్తూ చనిపోయిన వారుండే స్థలానికి నా కొడుకు దగ్గరికి వెళ్తాను” అని అతడు యోసేపు కోసం ఏడ్చాడు.

ఆదికాండం 37:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మిద్యానీయులు యోసేపును ఐగుప్తుకు తీసుకువెళ్లి, ఫరో రాజు అంగ రక్షకుల సేనానిగా పని చేస్తున్న పోతీఫరుకు అతణ్ణి అమ్మేశారు.

Available Bible Translations

American Standard Version
Genesis 37 (ASV) »
King James Version
Genesis 37 (KJV) »
GOD’S WORD® (GW)
Genesis 37 (GW) »
World English Bible
Genesis 37 (WEB) »
Louis Segond 1910
Genèse 37 (LSG) »
Luther Bibel 1912
Genesis 37 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
उत्पत्ति 37 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਪੈਦਾਇਸ਼ 37 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
আদি 37 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
ஆதியாகமம் 37 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
उत्पत्ति 37 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ઉત્પત્તિ 37 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಆದಿಕಾಂಡ 37 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلتَّكْوِينُ 37 (AVD) »
תנ ך עברי מודרני
בראשית 37 (HEB) »
Bíblia Sagrada Português
Gênesis 37 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Sáng Thế 37 (VIE) »
Reina Valera Antigua
Génesis 37 (RVA) »
La Sacra Bibbia
Genesi 37 (RIV) »
圣 经 简体中文和合本
创 世 纪 37 (CUVS) »
聖 經 繁體中文和合本
創 世 記 37 (CUVT) »
Bibla e Shenjtë
Zanafilla 37 (ALB) »
Svenska Bibeln 1917
1 Mosebok 37 (SV1917) »
Библия на русском
Бытие 37 (RUSV) »
Українська Біблія
Буття 37 (UKR) »
Szent Biblia - Magyar
1 Mózes 37 (KAR) »
Българска Библия
Битие 37 (BULG) »
聖書 日本語
創世記 37 (JPN) »
Biblia Takatifu
Mwanzo 37 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Bilowgii 37 (SOM) »
De Heilige Schrift
Genesis 37 (NLD) »

ఆదికాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List