ఆదికాండం Chapter 49 TELIRV Bible Verse Images

ఆదికాండం 49 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ఆదికాండం 49 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


ఆదికాండం 49:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యాకోబు తన కొడుకులను పిలిపించి ఇలా అన్నాడు. “మీరు కలిసి రండి, రాబోయే రోజుల్లో మీకు ఏం జరుగుతుందో నేను చెబుతాను.

ఆదికాండం 49:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యాకోబు కొడుకుల్లారా, కలిసి వచ్చి వినండి. మీ తండ్రి ఇశ్రాయేలు మాట వినండి.

ఆదికాండం 49:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రూబేనూ, నువ్వు నా పెద్ద కొడుకువి. నా బలానివి, నా శక్తి ప్రథమ ఫలానివి. ఘనతలోనూ బలంలోనూ ఆధిక్యం గలవాడివి.

ఆదికాండం 49:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పారే నీళ్ళలా చంచలుడివి. నీది ఉన్నత స్థాయి కాదు. ఎందుకంటే నువ్వు, నీ తండ్రి మంచం ఎక్కి దాన్ని అపవిత్రం చేశావు. నువ్వు నా మంచం మీదికి ఎక్కావు.

ఆదికాండం 49:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షిమ్యోను, లేవి అన్నదమ్ములే. వారి కత్తులు దౌర్జన్యం చేసే ఆయుధాలు.

ఆదికాండం 49:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు, వారి సభలో చేరవద్దు. నా హృదయం వారితో కలవలేనంత ఉదాత్తమైనది. కోపంలో వారు మనుషులను చంపారు. సరదా కోసం ఎద్దుల కాళ్ళ నరాలు తెగ్గొట్టారు.

ఆదికాండం 49:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారి కోపం చాలా తీవ్రమైనది. వారి ఆగ్రహం క్రూరమైంది. అవి శాపగ్రస్తమైనవి. నేను వారిని యాకోబు ప్రజల్లో విభాగిస్తాను. ఇశ్రాయేలులో వారిని చెదరగొడతాను.

ఆదికాండం 49:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదా, నీ సోదరులు నిన్ను స్తుతిస్తారు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉంటుంది. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడతారు.

ఆదికాండం 49:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదా సింహం పిల్ల. నా కుమారుడా, నువ్వు చీల్చిన దాని దగ్గరనుంచి వచ్చావు. అతడు కాళ్ళు ముడుచుకుని పడుకున్నాడు. సింహం లాగా, ఆడ సింహం లాగా గర్జించాడు. అతన్ని లేపడానికి తెగించేవాడెవడు?

ఆదికాండం 49:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షిలోహు వచ్చే వరకూ యూదా దగ్గరనుంచి రాజదండం తొలగదు. అతని కాళ్ళ మధ్య నుంచి అధికార రాజదండం తొలగదు. రాజ్యాలు అతనికి లోబడతాయి.

ఆదికాండం 49:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ద్రాక్షావల్లికి తన గాడిదనూ, మేలైన ద్రాక్ష తీగెకు తన గాడిద పిల్లనూ కట్టి, ద్రాక్షారసంలో తన బట్టలనూ, ద్రాక్షల రక్తంలో తన అంగీనీ ఉతికాడు.

ఆదికాండం 49:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని కళ్ళు ద్రాక్షారసమంత ఎర్రగా, అతని పళ్ళు పాలవలే తెల్లగా ఉంటాయి.

ఆదికాండం 49:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జెబూలూను సముద్రపు ఒడ్డున నివసిస్తాడు. అతడు ఓడలకు రేవుగా ఉంటాడు. అతని పొలిమేర సీదోను వరకూ ఉంటుంది.

ఆదికాండం 49:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్శాఖారు రెండు దొడ్ల మధ్య పడుకున్న బలమైన గాడిద.

ఆదికాండం 49:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు మంచి విశ్రాంతి స్థలాన్నీ రమ్యమైన భూమినీ చూశాడు. బరువులు మోయడానికి భుజం వంచి చాకిరీ చేసే దాసుడయ్యాడు.

ఆదికాండం 49:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దాను ఇశ్రాయేలు గోత్రాల్లో ఒక గోత్రంగా తన ప్రజలకు న్యాయం తీరుస్తాడు.

ఆదికాండం 49:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దాను, దారిలో పాము లాగా, గుర్రం మడిమె కరచి, రౌతు వెనక్కి పడిపోయేలా చేసే కట్లపాముగా దారిలో ఉంటాడు.

ఆదికాండం 49:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా, నీ రక్షణ కోసం కనిపెడుతున్నాను.

ఆదికాండం 49:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దోపిడీ గాళ్ళు గాదును కొడతారు. అయితే, అతడు వాళ్ళ మడిమెను కొడతాడు.

ఆదికాండం 49:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆషేరు ఆహారం శ్రేష్ఠమైనది. రాజులకు తగిన మధుర పదార్దాలు అతడు అందిస్తాడు.

ఆదికాండం 49:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నఫ్తాలి వదిలిపెట్టిన లేడి. అతనికి అందమైన పిల్లలుంటారు.

ఆదికాండం 49:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోసేపు ఫలించే కొమ్మ. ఊట దగ్గర పండ్లు కాసే పెద్ద కొమ్మ. దాని కొమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపిస్తాయి.

ఆదికాండం 49:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
విలుకాళ్ళు అతనీపై దాడి చేస్తారు. అతని మీద బాణాలు వేసి అతన్ని హింసిస్తారు.

ఆదికాండం 49:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే, అతని విల్లు స్థిరంగా ఉంటుంది. అతని చేతులు నైపుణ్యంతో ఉంటాయి. ఎందుకంటే, ఇది యాకోబు పరాక్రమశాలి చేతుల వలన, ఇశ్రాయేలు ఆధార శిల, కాపరి పేరున అయింది.

ఆదికాండం 49:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీకు సహాయం చేసే నీ తండ్రి దేవుని వలన, నిన్ను దీవించే సర్వశక్తుని వలన, నీకు పైనుండి వచ్చే దీవెనలు, కింది అగాధపు దీవెనలు, స్తనాల, గర్భాల దీవెనలు వస్తాయి.

ఆదికాండం 49:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ తండ్రి దీవెనలు, పురాతన పర్వతాలంత ఘనంగా, నిత్య గిరులంత ఉన్నతంగా ఉంటాయి. అవి యోసేపు తల మీద ఉంటాయి. తన సోదరుల్లో ఘనుడైన వాని నడినెత్తి మీద ఉంటాయి.

ఆదికాండం 49:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బెన్యామీను ఆకలిగొన్న తోడేలు. అతడు ఉదయాన ఎరను మింగి, దోచుకున్న దాన్ని, సాయంత్రం వేళ పంచుకుంటాడు.”

ఆదికాండం 49:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇవన్నీ ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు. వారి తండ్రి వారిని దీవిస్తూ వారితో చెప్పింది యిదే. ఎవరి దీవెన వారికి తగినదే.

ఆదికాండం 49:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత అతడు వారికి ఆజ్ఞాపిస్తూ ఇలా అన్నాడు. “నేను నా పూర్వీకుల దగ్గరికి వెళ్ళబోతున్నాను.

ఆదికాండం 49:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హిత్తీయుడైన ఎఫ్రోను పొలంలోని గుహలో నా పూర్వీకుల దగ్గర నన్ను పాతిపెట్టండి. ఆ గుహ కనాను దేశంలోని మమ్రే దగ్గర ఉన్న మక్పేలా మైదానంలో ఉంది. అబ్రాహాము దానినీ ఆ పొలాన్నీ హిత్తీయుడైన ఎఫ్రోను దగ్గర శ్మశాన భూమి కోసం స్వాస్థ్యంగా కొన్నాడు.

ఆదికాండం 49:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అక్కడే వారు అబ్రాహామునూ అతని భార్య శారాను పాతిపెట్టారు. అక్కడే ఇస్సాకును అతని భార్య రిబ్కాను పాతి పెట్టారు. అక్కడే నేను లేయాను పాతిపెట్టాను.

ఆదికాండం 49:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ పొలాన్నీ అందులోని గుహనూ హేతు కొడుకుల దగ్గర కొన్నారు” అన్నాడు.

ఆదికాండం 49:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యాకోబు తన కొడుకులకు ఆజ్ఞాపించడం ముగించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకుని ప్రాణం విడిచి తన వారి దగ్గరికి చేరాడు.

Available Bible Translations

American Standard Version (ASV)
Genesis 49 (ASV) »
King James Version (KJV)
Genesis 49 (KJV) »
GOD’S WORD® (GW)
Genesis 49 (GW) »
Berean Bible (BSB)
Genesis 49 (BSB) »
World English Bible (WEB)
Genesis 49 (WEB) »
French Bible (LSG)
Genèse 49 (LSG) »
German Bible (LUTH1912)
Genesis 49 (LUTH1912) »
Bengali Bible (BENIRV)
আদি 49 (BENIRV) »
Hebrew Bible (HEB)
בראשית 49 (HEB) »
Portuguese Bible (BSL)
Gênesis 49 (BSL) »
Vietnamese Bible (VIE)
Sáng Thế 49 (VIE) »
Spanish Bible (RVA)
Génesis 49 (RVA) »
Italian Bible (RIV)
Genesi 49 (RIV) »
Chinese Simplified (CUVS)
创 世 纪 49 (CUVS) »
Chinese Traditional (CUVT)
創 世 記 49 (CUVT) »
Albanian Bible (ALB)
Zanafilla 49 (ALB) »
Swedish Bible (SV1917)
1 Mosebok 49 (SV1917) »
Russian Bible (RUSV)
Бытие 49 (RUSV) »
Ukrainian Bible (UKR)
Буття 49 (UKR) »
Hungarian Bible (KAR)
1 Mózes 49 (KAR) »
Bulgarian Bible (BULG)
Битие 49 (BULG) »
Japanese Bible (JPN)
創世記 49 (JPN) »
Norwegian Bible (NORSK)
1 Mosebok 49 (NORSK) »

ఆదికాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List